Village Missionary Movement

கிராம மிஷனரி இயக்கம்


దిన ధ్యానము(Telugu) 14.04.2024 (Kids Special)

దిన ధ్యానము(Telugu) 14.04.2024 (Kids Special)

 

అంశం: యేసుతో మాట్లాడము 

 

"నీ ఆజ్ఞలను బట్టి నేను హర్షించెదను అవి నాకు ప్రియములు" - కీర్తనలు 119:47

 

బుజ్జి పిల్లలు పరీక్షలు చక్కగా రాశారా? కొంతమందికి సెలవులు కూడా ఇచ్చేశారు కదా? కొంతమంది పరీక్షలు రాస్తున్నారు. సరే సెలవులను బాగా ఎంజాయ్ చేయండి. జాలిగా ఆడుకోండి. చుట్టాలు ఇంటికి వెళ్ళండి. పక్క ఊర్లకు వెళ్లండి. సరే మరి మీరేంటి ప్లాన్ చేసుకున్నారు? మంచిది జాగ్రత్తగా ఎంజాయ్ చేయండి. 

 

జగన్ తమ్ముడికి ఏరోప్లేన్ లో ఇంగ్లాండ్ దేశంలోకి వెళ్లి అక్కడ వాళ్ళ అంకుల్ ఇంటిపక్కనే ఉన్న రాజభవనాన్ని చూడాలి అని ప్రార్థన చేశాడు. మీకు కూడా అలాంటి ఆశ ఉండేటప్పుడు ప్రార్థించాలి సరైన! 

 

జగన్ ఆ రాజ భవనపు గేటు ముందు ఉంటున్న కాపలా దారుని వద్దకు వెళ్లి నేను రాజును చూడాలి అన్నాడు. అందుకు ఆ కాపలాదారునికి నవ్వొచ్చింది. నువ్వు ఇంత చిన్నవాడివి నీకు రాజుని చూడాలని ఉందా! నిన్ను ఎలా పంపించాలి నిన్ను చూడడానికి రాజు ఇష్టపడని అని చెప్పాడు. అందుకు జగన్ ఆ వాకిట్లో నిలబడి గేటు ముందు నిలబడి వేచి ఉన్నాడు. ఎలాగైనా నేను రాజును చూడాలి అనుకున్నాడు. యేసయ్యా ఎలాగైనా మీరే నాకు సహాయం చేయాలి నా కోరిక నెరవేర్చాలి అని ప్రార్థించి అక్కడ ఎదురు చూస్తున్నాడు. ఒక వ్యక్తి రాగా జగన్ తన కోరికను ఆయనతో చెప్పిన వెంటనే ఆ వ్యక్తి జగన్ను ఆ రాజ భవనంలోని తీసుకుని వెళ్ళాడు. ఒక తలుపు తీయబడింది ప్రతి ఒక్కరు కూడా ఈయనకి సెల్యూట్ చేస్తూ ఉన్నారు. భవనంలో ప్రాముఖ్యమైన పదవిలో ఆయన ఉంటున్నాడు అని జగన్ అర్థం చేసుకున్నాడు. అయితే రాజును చూసిన వెంటనే జగన్ కి ఇది కల నిజమా అని అనుకున్నాడు. అయితే రాజు జగన్ ని ప్రేమతో పిలిచి మాట్లాడారు ఇంగ్లాండ్లో ప్రాముఖ్యమైన స్థలమును దర్శించుటకు జగన్కు ఫ్రీ పాస్ ఇచ్చాడు. జగన్కు చాలా సంతోషం ఇంటికి చేరుకున్నాడు. 

 

హలో పిల్లలు జగన్ కోరిక నెరవేరింది అని చూశారు కదా! మరి మీ ఆశ కూడా నెరవేరాలి అంటే రాజాధిరాజైన యేసయ్యను కలిసి మాట్లాడండి. యేసయ్య తో మీరు ఎప్పుడైనా మాట్లాడవచ్చు. ఎంత గొప్ప భాగ్యం పిల్లలు! ఈ దినమే యేసయ్యతో మాట్లాడండి. సరేనా! వెరీ గుడ్. బాయ్! 

- సిస్టర్. దేబోరా గారు

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

www.vmm.org.in

ఈమెయిల్: info@vmm.org.in

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250


Comment As:

Comment (0)