Village Missionary Movement

கிராம மிஷனரி இயக்கம்


దిన ధ్యానము(Telugu) 27.04.2024

దిన ధ్యానము(Telugu) 27.04.2024

 

అంశం:- ఈ తలంపు వద్దు

 

"గర్వహృదయులందరు యెహోవాకు హేయులు నిశ్చయముగా వారు శిక్ష నొందుదురు" - సామెతలు 16:5

 

ఒక అందమైన గులాబీ తోట ఉన్నది. దాంట్లో అనేక రంగురంగుల గులాబీలు ఉన్నాయి. దాంట్లో ఒకటి మాత్రం చాలా అందంగా చూచుటకు దాని యొక్క రంగుల ఆకర్షణీయంగా ప్రత్యేకంగా ఉన్నాయి. మిగిలిన గులాబీలు కంటే కొద్దిగా దూరంలో అది నాటబడి ఉన్నది. అందువల్ల ఏమో దానికి తన గురించి ఎక్కువ గర్వపడుతూ మిగిలిన గులాబీలను ఎప్పుడు చిన్నచూపు చూస్తూ ఉండేది. ఒక దినము గుంపుగా ఉన్న గులాబీలు ఆ రంగులు రంగులు గల గులాబీతో ఇలా చెప్పాయి. స్నేహితుడా! దేవుని దృష్టిలో అందరూ సమానమే కదా నువ్వెందుకు ఇంతగా గర్వపడుతున్నావు నీవు ఇలా ఉండుట దేవునికి కూడా ఇష్టం ఉండదు అన్నది. ఒక దినము కటోరమైన తుఫాను గాలి వియడం ప్రారంభించింది అప్పుడు ఒంటరిగా ఉన్న ఆ గులాబీ నేలకు ఒరిగిపోయింది. అప్పుడు ఆ గుంపులో గల ఒక గులాబీ తన చేయి చాపి చేయి పట్టుకో అని అన్నది. అందుకు ఆ గులాబీ నేనా నీ చేయి పట్టుకోవాల అని గర్వంతో మాట్లాడింది. ఆ మాట అన్న కొద్ది క్షణాల్లోనే పూర్తిగా వేర్లు చేత పీకబడి ఉన్న స్థలం లేకుండా గాలికి కొట్టుకొని పోయింది. 

 

దీని చదువుతున్న ప్రియమైన వారలారా! బైబిల్లో గల ఆహాబు రాజు యెహోషువాపాతు అనే రాజుతో కలిసి యుద్దమునకు వెళ్తున్నాడు. ఆహాబు దేవుని మాటను అశ్రద్ధ చేసి తన బలాన్ని నమ్ముకున్నాడు. ఆహాబు యొక్క నమ్మకము ఆహాబు యొక్క గర్వము దేవునికి వ్యతిరేకంగా పాపము చేయుటకు యెహోషువాపాతుతో ఆయన చేయిని కలిపి యుద్ధానికి వెళ్ళాడు. ఎవడో ఒకడు గురిపెట్టకే విడిచిపెట్టిన బాణము సరిగా వచ్చి ఆహాబు శరీరమునకు గుచ్చుకు పోయింది అని బైబిల్లో చదువుతున్నాం. ఆహాబు దేవునికి వ్యతిరేకమైన కార్యమే ఆయన చావునకు కారణమైంది అని మనం బైబిల్లో చదువుతున్నాం. గర్వముగలవాడు దేవునికి అసహ్యమైన వాడు అటువంటి వారితో చేతులు కలిపిన వాడు శిక్ష నుండి తప్పించుకోలేడు అనే మాట ప్రకారంగా ఆహాబు జీవితము ఎంత ఘోరము కదా! 

 

గర్వపు ఆలోచన దేవుని ఎదుట అసహ్యమైనది. గర్వముగల హృదయము పతనం వైపు నడిపిస్తుంది. పడిపోవుటకు మునుపు గర్వము నడుస్తుంది కాబట్టి మన మాటలు, చూపులు, నడకలు అన్నింటిని కూడా గర్వము లేకుండా దీన మనస్సు కలిగి ఉందాం. దేవుని యొక్క కనికరాన్ని పొందుకుందాం. 

- నిత్యనంద్ గారు 

 

ప్రార్థన అంశం:-

స్కూల్ మిషన్ ద్వారా అనేక మంది చిన్నారులు దేవుని వైపు నడిపించుటకు మన క్యాంపస్లో ఒక మిషనరీ స్కూల్ కట్టబడేటట్లు ప్రార్థిద్దాం.

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

www.vmm.org.in

ఈమెయిల్: info@vmm.org.in

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250


Comment As:

Comment (0)