Village Missionary Movement

கிராம மிஷனரி இயக்கம்


దిన ధ్యానము(Telugu) 26.04.2024

దిన ధ్యానము(Telugu) 26.04.2024

 

అంశం:- మరియొక చెంపను చూపించు 

 

"వాడు నాకు చేసినట్లు వానికి చేసెదను వాని క్రియచొప్పున వానికి ప్రతిఫలమిచ్చెద నను కొనకుము" - సామెతలు 24:29 

 

క్యాంపస్ క్రూసైడ్ అనే పరిచర్యలో పార్ట్ టైం గా పరిచర్య చేస్తూ వచ్చాడు ఒక ఫుట్ బాల్ ఆటగాడు. ఈ యవ్వనస్తుడు ఒకసారి క్రీస్తు సువార్తను ప్రకటించే ఒక కరపత్రికను పంచి పెడుతూ ఉన్నాడు. ఆయన ఇచ్చిన కరపత్రిక పొందుకున్న యవ్వనస్తుడు ఆ కరపత్రికను నలిపి ఆయన ముఖం మీద విసిరి ద్వేషముతో ఆయనను చూసి ముఖము పైన ఉమ్మి వేశాడు. మీ యొక్క యేసును కూడా నేను ఇలానే ద్వేషిస్తున్నాను అని అన్నాడు. సాధారణంగా ఫుట్ బాల్ ఆటగాళ్లు శరీరం చాలా బలంగా ఉంటుంది కానీ ఆటగాడు అయితే తన బలాన్ని చూపించకుండా యేసు కొరకు దాని సహించుకుని రుమాలతో తన ముఖమును తుడుచుకున్నాడు. దేవుడు ఆ యవ్వనస్తుడు హృదయంలో పని చేయడం ప్రారంభించాడు. తన మొఖం పైన ఉమ్ము వేసిన వ్యక్తి ఒక సంవత్సరం తర్వాత రక్షింపబడి ఆ ఫుట్ బాల్ ఆటగాడుతో కలిసి పరిచర్య చేయడం ప్రారంభించాడు .

 

యేసుక్రీస్తు ప్రభువు ఈ భూమ్మీద జీవించిన దినాల్లో ఆయన ప్రసంగించిన కొండమీద ప్రసంగము చాలా ప్రసిద్ధిగాంచింది. కొండమీద ప్రసంగం అని చెప్పబడుతున్న మత్తయి సువార్త 5,6,7 అధ్యాయాలు అనేకులు చేత కంఠస్థం చేయబడి వెంబడిస్తూ వస్తున్నారు. క్రైస్తవులు కానీ వారు కూడా వారి యొక్క ప్రసంగాలలో ఈ కొండమీద ప్రసంగం యొక్క ఉదాహరణలు ఎత్తి చూపిస్తున్నారు. తమ మాటలను కొనసాగిస్తూ ఉంటారు. దీనిలో ప్రభువు ఏమి చెప్పారు అంటే నేను మీకు చెబుతున్నాను కీడుకు ప్రతి కీడు చేయవద్దు. ఒక చెంప మీద కొట్టిన యెడల ఆయనకు మరియొక చెంపను కూడా చూపించమన్నాడు. 

 

ప్రియమైన వారలారా! అనేకులు క్రీస్తు కొరకు అనేక నిందలను భరించవచ్చు, దానికి కీడుకు ప్రతికీడు మనము చేయకుండా మనలను కొడుతున్న వారికి మరియొక చెంపని చూపిద్దాం. వ్యతిరేకించుట కంటే సహనముతో వెళ్ళుటకు అధిక బలం కావాలి. దేవుడు బలాన్ని మనకు ఇచ్చి ఇస్తారు. దేవున్ని ఇంకా తరచూ మనం వెంబడించినప్పుడు మాటలచే ఎవరు గాయపరిచిన వారికి చెంపను చూపించేటప్పుడు మనల్ని బలపరిచే దేవుడు మనకు బలాన్ని ఇస్తారు. వారిని కూడా తన వైపుకు లాక్కుంటారు. ప్రభువును వెంబడించే శిష్యులుగా మనం మారదాం. దేవుడు తన ప్రణాళిక ద్వారా మనల్ని హెచ్చిస్తారు. మన ద్వారా అనేకులు తన వద్దకు రావడానికి మనల్ని దేవుడు వాడుకుంటారు. 

- శ్రీమతి. జాస్మిన్ పాల్ గారు 

 

ప్రార్థన అంశం:

మన ఉత్తర భారతదేశ మిషనరీల కొరకు ప్రార్థిద్దాం

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

www.vmm.org.in

ఈమెయిల్: info@vmm.org.in

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250


Comment As:

Comment (0)