Village Missionary Movement

கிராம மிஷனரி இயக்கம்


దిన ధ్యానము(Telugu) 23.04.2024

దిన ధ్యానము(Telugu) 23.04.2024

 

అంశం:- ఇస్కరియోతు యూదా లేదా పేతురు

 

"అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చునప్పుడు మీరు శక్తినొందెదరు గనుక మీరు యెరూషలేములోను, యూదయ సమరయ దేశముల యందంతటను భూదిగంతముల వరకును, నాకు సాక్షులైయుందురని వారితో చెప్పెను" - అపో.కార్యములు 1:8

 

ఒక పెన్ను మన చేతిలో పెట్టుకుని రాసేటప్పుడు అది తనని సంపూర్ణంగా సమర్పించుకొనకపోతే ఏమవుతుంది? నేను ఒక పెన్ను ని నాకు అన్నీ తెలుసు ఎవరి సహాయము నాకు అవసరం లేదు అని చెప్పిన యెడల మనకు బాగా నవ్వుగా ఉంటుంది కదూ! అలాగే మనము నేను సమస్తము చేయగలను, చక్కగా ప్రసంగిస్తాను, పాడతాను అని చెప్పిన యెడల అది దేవునికి నవ్వునే తీసుకొస్తుంది. పరిశుద్ధాత్మ సహాయం లేకుండా మనము చేసే సమస్త కార్యములకు ఎలాంటి ప్రయోజనము ఎలటి ప్రభావము ఉండదు. దాన్ని ఇద్దరి జీవితంలో నుండి చూద్దాం. 

 

యేసు ప్రభువు ఈ లోకంలో జీవిస్తున్న కాలంలో ఈ ఇద్దరు శిష్యులు ఉన్నారు ఒకరు పేతురు మరి ఒకరి పేరు ఇస్కరియోతు యూదా. ఇద్దరు యేసు ప్రభువు సిలువకు వెళ్ళినప్పుడు ఆయన హృదయాన్ని గాయపరిచిన వాళ్లే. ఇస్కరియోతు యూదా ముప్పది వెండి నాణెముల కొరకు యేసు క్రీస్తు ప్రభువుని అప్పగించేసాడు, అలానే పేతురు యేసుప్రభువు హింసించబడినప్పుడు మూడుసార్లు ఆయన ఎవరో నాకు తెలియదు అని తిరస్కరించాడు. ఎలాగో తెలుసా? ఈయనను ఎరుగను అని చెప్పి ఆయనను శపించడం, ఒట్టు పెట్టుకోవడం ప్రారంభించాడు. 

 

ఇద్దరు శిష్యులలో ఎవరు చేసినది పెద్ద పొరపాటు? పేతురుదా లేదా ఇస్కరియోతు యూదా? పేతురు ఇస్కరియోతు యూదా వలె జీవితము ముగింపుకు అప్పగించుకోలేదు. మారుగా పరిశుద్దాత్మ చేత పశ్చాత్తాప పడి ఏడ్చి తన జీవితాన్ని యేసయ్య అప్పగించుకున్నాడు (లూకా 26: 62). ఏ ప్రజల ఎదుట యేసయ్యను తిరస్కరించాడో అదే ప్రజల మధ్యలో యేసయ్య కొరకు ప్రకటించి సాక్షిగా నిలబడ్డాడు. పేతురు ఇవన్నీ తన సొంత బలము చేత చేశాడా? లేదు తన సొంత బలము చేత ఏమీ చేయలేము అని గ్రహించి పరిశుద్ధాత్మ సహాయంతో తన జీవితాన్ని సంపూర్ణంగా సమర్పించుకొని ఆయన జీవితంతో దేవుని కొరకు సాక్ష్యం నిలబడ్డాడు. 

 

నా ప్రియ సహోదరీ సహోదరులారా! మన చేతిలో పెన్ను సంపూర్ణంగా సమర్పించబడి ఎలా మనకు ప్రయోజనకరంగా ఉంటుందో అలా మనము దేవునికి సంపూర్ణంగా సమర్పించబడినప్పుడు బలము పొందుకొని యేసు క్రీస్తు నామము ప్రకటించుటకు, ఆయనకు సాక్షిగా జీవించెదము. 

- శ్రీమతి. సిసిల్దా అలెక్స్ గారు 

 

ప్రార్థన అంశం:-

24 గంటలు చైన్ ప్రేయర్స్ మన ఫీల్డ్ అన్నింటిలో జరిగేటట్లు ప్రార్థిద్దాం.

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

www.vmm.org.in

ఈమెయిల్: info@vmm.org.in

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250


Comment As:

Comment (0)