Village Missionary Movement

கிராம மிஷனரி இயக்கம்


దిన ధ్యానము(Telugu) 26.03.2023 (Kids Special)

దిన ధ్యానము(Telugu) 26.03.2023 (Kids Special)

 

ప్రత్యేకంగా చిన్న పిల్లల కోసం

 

"కుమారుడు మిమ్మును స్వతంత్రులనుగా చేసినయెడల మీరు నిజముగా స్వతంత్రులై యుందురు" - యోహాను 8: 36

 

ఒక సన్యాసి ఒక గుడిసెలో నివసిస్తూ ఉండేవాడు. సన్యాసి అంటే ఎవరూ అని అడుగుతున్నారు కదా? లోకపు జీవితాన్ని ద్వేషించి, వివాహం చేసుకోకుండా, దేవుని కొరకు సేవ చేస్తూ ఉండేవాళ్లే సన్యాసులు. అదేవిధంగా ఈ సన్యాసి కూడా తనను మరియు తాను ఉండే స్థలము పరిశుభ్రముగా ఉంచుకొని అడవిలో ఉండే పండ్లను దుంపలను ఆహారముగా తీసుకుంటూ దేవునిని మాత్రమే ధ్యానం చేస్తూ ఉండేవాడు. తనను చూడడానికి వచ్చిన వారికి మంచి సలహాలు ఇస్తూ ప్రార్థన చేస్తూ వచ్చేవాడు. ఈ సంగతులను తెలుసుకుని అనేకులు రావడం మొదలుపెట్టారు. వచ్చిన ప్రతివారు పండ్లు, జీడిపప్పు, బాదంపప్పు వంటి మంచి మంచి ఆహార పదార్థములు తీసుకుని వచ్చి ఇచ్చేవారు. అవసరమైనదంతా తీసుకుని మిగిలినది ఎవరికైనా ఇవ్వకుండా వాటిని గుడిసెలో భద్రపరిచేవాడు. సన్యాసి పరిశుభ్రముగా ఉన్న ఇంట్లోకి ఎలుకలు రావడం ప్రారంభించాయి. ఆ సన్యాసిని చూడడానికి వచ్చిన ఒక అతనితో ఎలుకల బాధ భరించలేకపోతున్నాను అని చెప్పాడు సన్యాసి. వెంటనే అతను ఒక పిల్లిని తీసుకుని వచ్చి ఇచ్చాడు. ఎలుకల బాధ పోయింది. ఇప్పుడు పిల్లికి ఆహారం లేదని ఒక అతను ఒక ఆవును తీసుకుని వచ్చి ఆ సన్యాసికి ఇచ్చాడు. ఆవేమిస్తుందో తెలుసు కదా ఆ పాలిస్తుంది కదా. ఆ పాలు పిల్లికి మరియు ఆ సన్యాసికి చాలా ఉపయోగకరంగా ఉండేవి. కానీ అది వేసే మూత్రము, పేడ చాలా దుర్వాసనగా కలుగజేసాయి. అందువలన దోమలు పురుగులు ఎక్కువ అవ్వడంతో ఆ సన్యాసి ప్రశాంతంగా నిద్ర పోలేక పోయాడు. ఆవుని పిల్లిని చూసుకోవడమే పెద్ద పనిగా మారిపోయింది. 

 

అందువలన దేవుని ధ్యానం తగ్గిపోయింది. అతనిని చూడడానికి వచ్చిన జనసమూహం కూడా తగ్గింది. సన్యాసి ఆలోచించడం మొదలుపెట్టాడు. సరిపోయినంత తిన్నప్పుడు బాగుండేది అత్యాశకు చోటిచ్చాను ఆహారమునకు బానిస అయిపోయాను ఇందువలన నా స్థలము మరియు నా యొక్క పరిసర ప్రాంతాలు అపరిశుభ్రముగా మారిపోయాయి అని గ్రహించాడు. ఆవును పిల్లిని తన స్నేహితునికి అప్పగించేసి ఇంటిని శుభ్రపరిచి అనవసరమైన వాటిని తొలగించి ఇకపై దేవునికే తప్ప మరి దేనికిని దాసుడను కాను అని చెప్పి ధ్యానము చేసుకోవడం మొదలు పెట్టాడు. మరలా అనేక మంది ప్రజలు మునుపటి వలె అతని యొక్క సలహాలు కొరకు ప్రార్థన కొరకు రావడం ప్రారంభించారు. 

 

ఏంటి పిల్లలు కథ విన్నారు కదా మీకు కూడా సెల్ ఫోన్, టీవీ, లాప్టాప్, కంప్యూటర్ ఇవన్నీ ఎక్కువగా వాడడం కొరకు దొరికినా సరే ఒక లిమిట్ లో ఉండాలి. అలా చూస్తూనే ఉంటే కంటి సమస్యలే వస్తాయి. మానసిక స్థితి కూడా పాడైపోతుంది. చివరికి మీ భవిష్యత్తు కూడా దెబ్బతింటుంది. ఆ సన్యాసి ఎలా అయితే తన బానిసత్వంను గ్రహించి చక్కదిద్దుకున్నాడో అలాగే మీరు కూడా దేనికి బానిసలుగా ఉన్నారో వాటిని విడిచిపెట్టుటకు ప్రయాసపడాలి. ప్రభువైన యేసు మీకు సహాయం చేస్తారు. మిమ్మును ఆయన చేతులకు అప్పగించుకుంటే నిశ్చయముగా విడుదల కలుగుతుంది. రెడీయేనా పిల్లలు! 

- కంతట వాక్యం. 

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

www.vmm.org.in

ఈమెయిల్: info@vmm.org.in

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250


Comment As:

Comment (0)