Village Missionary Movement

கிராம மிஷனரி இயக்கம்


దిన ధ్యానము(Telugu) 24.07.2024

దిన ధ్యానము(Telugu) 24.07.2024

 

అంశం:- సంతృప్తిగల మనస్సు 

 

"సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్పలాభసాధనమైయున్నది" - 1 తిమోతికి 6:6

 

అత్యాశ గల కుక్కపిల్ల ఒకటి ఉండేది. సమస్తము నా కొరకే అని తలంచే గుణము దానికి ఎప్పుడూ ఉండేది. ఒక దినము దానికి ఆకలి ఎక్కువగా ఉండటం వలన ఆహారం కొరకు అటు ఇటు తిరుగుతోంది. ఏమి దొరకలేదు. ఒక ఆలోచన కలిగింది. బజారుకు వెళ్తే ఏదైనా దొరుకుతుంది అని బజారుకు వెళ్ళింది. అక్కడ ఒక మాంసపు దుకాణం వద్ద నిలబడి అక్కడ నుండి చిన్న మాంసం ముక్క దొరికితే చాలు అని ఆలోచించిన ఆ కుక్క పిల్లకు ఒక పెద్ద ఎముక కింద పడి ఉండడు చూసి చాలా సంతోషించింది. నాకు రెండు రోజులు సరిపడే ఆహారము దొరికింది అని దాన్ని తీసుకుని ఒక నది ఒడ్డుకు వెళ్ళింది. అప్పుడు ఆ నదిలో గల నీటిలో చూసినప్పుడు ఈ కుక్క వలే మరియొక కుక్క నోట్లో పెద్ద ఎముక పెట్టుకోని ఆ నీటిలో ఉండుట దీనికి కనబడింది. ఈ కుక్కపిల్ల ఆ కుక్కను తరిమేస్తే ఆ ఎముక కూడా నాకే దొరుకుతుంది అని నీళ్లలోకి చూచి ఆవేశముతో అరిచింది. వెంటనే నోట్లో గల ఆ ఎముక జారీ నీటిలో పడింది. కొంత సమయం తరువాత దానికి అర్థమైంది అది తన యొక్క ప్రతిబింబము అని. అది నిజమైన కుక్క కాదు అని అర్థమైంది.

 

అపోస్తులుడైన పౌలు తిమోతికి రాస్తున్నప్పుడు ఇలా చెబుతున్నాడు. సంతృప్తిగల మనసుతో కూడిన దేవుని భక్తి లాభదాయకము అని రాస్తున్నాడు. కొందరు దీనిలో సంతృప్తి చెందరు, కొందరైతే ఇంకా కావాలి అని చివరి వరకు ఏమి పొందుకోకుండా ఉన్న వాటిని పోగొట్టుకునే వారు కూడా ఉన్నారు. భుజించుటకు, ధరించుటకు ఉంటే చాలు అని పౌలు గుర్తు చేస్తున్నారు. అన్నింటిలోనూ సంతృప్తిగల జీవితం జీవించుటకు నేర్పించబడ్డాను అని పౌలు సెలవిస్తున్నాడు.

 

ప్రియమైన దేవుని జనాంగమా ప్రభువును వెంబడిస్తున్న మనము అన్ని సమయాల్లో సంతృప్తిగా ఉండటం నేర్చుకోవాలి. దురాశ గొప్ప నష్టము అనే ఒక సామెత కలదు. దేవునిని యధార్థముగా వెంబడించే పిల్లలకు ఎలాంటి లోపాన్ని ఉంచడు. ఆయన వెతుకుతున్న వారికి ఏ కార్యము కొదువై ఉండదు. కాబట్టి ఆహారము, వస్త్రము, నివసించే స్థలము ఇవి మనకు ఉంటే చాలు అనే తలంపు మనకు ఉండాలి. దేవుడు మనలను దీవించియున్నారు. దానిలోనిది సేవకులకు, లేని వారికి మనము సహాయం చేద్దాం. ఇదే యధార్థమైన భక్తి కూడా. మన యొద్ద ఉన్న వాటితో పరలోకానికి అనేకులను సొంతమైన వారిగా చేద్దాం.

- బ్రదర్. టీ. రాజన్ గారు 

 

ప్రార్థన అంశం:-

చిల్డ్రన్ క్యాంపు ల ద్వారా 10 లక్షల మంది చిన్నారులు దర్శింపబడేటట్లు ప్రార్థిద్దాం.

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

www.vmm.org.in

ఈమెయిల్: info@vmm.org.in

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం in: +91 94424 93250


Comment As:

Comment (0)