Village Missionary Movement

கிராம மிஷனரி இயக்கம்


దిన ధ్యానము(Telugu) 22.07.2024

దిన ధ్యానము(Telugu) 22.07.2024

 

అంశం:- విశ్వాసం

 

"నా కుమారుడువైన(పిల్లవైన) తిమోతీ, నీవు విశ్వాసమును మంచి మనస్సాక్షియు కలిగినవాడవై, నిన్నుగూర్చి ముందుగా చెప్పబడిన ప్రవచనముల చొప్పున ఈ మంచి పోరాటము పోరాడవలెనని వాటినిబట్టి యీ ఆజ్ఞను నీకు అప్పగించుచున్నాను" - 1 తిమోతికి 1:18

 

రాము మరియు ఆయన తల్లి చర్చికి వెళ్ళుటకు సిద్ధమవుతున్నారు. నామకార్థపు క్రైస్తవుడైన అతని తండ్రి చర్చికి రారు. ఆయనకు టు వీలర్ లో వీళ్ళిద్దరిని చర్చికి తీసుకుని వెళ్లి దింపడం మాత్రమే ఆయన పని. ఆ దినము కూడా అలానే ఇద్దరినీ చర్చికి తీసుకుని వెళ్లారు. అప్పుడు బోధకుడు ఆవగింజంత విశ్వాసం ఉంటే కొండను చూచి వెళ్లిపో అనిన యడల అది అలా అవుతుంది అని చెప్పినది ఆయన చెవిలో పడింది. త్వరగా ఇంటికి వెళ్లారు రాత్రి మోకరించి ప్రార్థించారు. దానిని చూచిన రాము మరియు అతని యొక్క తల్లి చాలా ఆశ్చర్య పడ్డారు. ఆయన ప్రార్థన ఏమిటంటే తన తోటలో ఉంటున్న పెద్ద రాయి తొలగిపోవాలి అన్నదే. రాత్రి అందరూ పడుకున్నారు. మరుసటి రోజు ఉదయం ఆయన పరిగెత్తుకొని వెళ్లి తోటలోని ఆ రాయి చూశారు అది అలాగనే ఉంది. వెంటనే రాము యొక్క తండ్రి ఇలా చెప్పారు. నాకు ముందే తెలుసు ఈ రాయి ఎంత మాత్రం కదలదు అని.

 

 బైబిల్లో ఒక సంఘటన ఇలానే రాయబడి ఉంది. ఒక మనిషి తన యొక్క కుమారుడి యొక్క స్వస్థత కొరకు యే సు ప్రభువు యొక్క శిష్యుల వద్దకు వచ్చాడు. శిష్యులు ఆ కుమారుడికి స్వస్థత ఇవ్వలేకపోయారు. ఆ కుమారుడ్ని యేసుప్రభు వద్దకు తీసుకుని వచ్చారు. తర్వాత యేసుప్రభు ఆ కుమారుడిలో ఉండినటువంటి దయ్యములను వెళ్ళగొట్టారు. వెంటనే అది ఆయనను విడిచిపెట్టి వెళ్ళిపోయింది. ఆ క్షణమే ఆ యవ్వనస్తుడు స్వస్థపరచబడ్డాడు. శిష్యులు యేసుని వద్దకు ఒంటరిగా వచ్చి మా వలన ఎందుకు ఈ కార్యము జరగలేదు అని అడిగారు. అందుకు యేసుప్రభు మీ అవిశ్వాసము వలన అది జరగలేదు. ఆవగింజంత విశ్వాసం ఉంటే చాలు అని అన్నారు.

 

ప్రియమైన వారలారా! విశ్వాసము ఆవగింజంత చిన్నదైనప్పటికీ అది సంపూర్ణంగా ఉంటుంది. అలానే సంపూర్ణ విశ్వాసం మనకు ఉండాలి. యేసుప్రభువు మీద విశ్వాసం పెట్టి ప్రార్థించే ప్రార్థనకు కచ్చితంగా జవాబు దొరుకుతుంది. యేసయ్య వద్ద సమస్తమైన ఆరోగ్యము, మేలులు కలవు. మనమే విశ్వాసముతో మనకు అవసరమైనది యేసయ్య యొద్ద నుండి పొందుకోవాలి. మన యొక్క విశ్వాసము లోకాన్ని జయిస్తున్న జయము అని బైబిల్ చెప్తుంది. వెండి బంగారం కంటే మన విశ్వాసము ఉన్నతమైనది. విశ్వాసము లేకుండా ఉండుట దేవునికి ఇష్టము లేదు. ప్రతిరోజు మనము మన విశ్వాసంలో వర్ధిల్లాలి అని దేవుని యుద్ధ ప్రార్థించాలి. మనము క్రీస్తు మీద విశ్వాసం పెట్టి ఆయనకు ప్రార్థన చేస్తున్నప్పుడు కచ్చితంగా జవాబు పొందుకుంటాం. ఆమెన్!

- సిస్టర్. దివ్య అలెక్స్ గారు 

 

ప్రార్థన అంశం:-

మనం నడిపిస్తున్న చిన్నపిల్లల క్యాంపుల్లో అనేక మంది చిన్నపిల్లలు తీసుకుంటూ నిర్ణయాల్లో వారు నిలబడి ఉండేటట్లు ప్రార్థిద్దాం.

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

www.vmm.org.in

ఈమెయిల్: info@vmm.org.in

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250


Comment As:

Comment (0)