Village Missionary Movement

கிராம மிஷனரி இயக்கம்


దిన ధ్యానము(Telugu) 23.07.2024

దిన ధ్యానము(Telugu) 23.07.2024

 

అంశం:- జీవితం తర్వాత 

 

"ఈమె తన శక్తికొలదిచేసి, నా భూస్థాపన నిమిత్తము నా శరీరమును ముందుగా అభిషేకించెను" - మార్కు 14:8

 

స్కాట్లాండ్ దేశము అనేకమంది మిషనరీలను ఈ లోకమునకు ఇచ్చిన దేశము. వారిలో ఒకరైన రాబర్ట్ సింగ్ లేయర్. ఈయన తండ్రి రాళ్లు పనిచేస్తూ ఉండేవాడు. ఈయన యవ్వనస్తుడిగా ఉండినప్పుడు 14 సంవత్సరాల నుండి 17 సంవత్సరాల వరకు రాతి పనులు చేస్తూ తన కుటుంబమును పోషించే బాధ్యతగల పనికి పంపించబడ్డారు. పనిచేస్తున్నప్పుడు దేవాలయము కార్యములోనూ తనను అమర్చుకొని పరిచర్య పిలుపుని అంగీకరించి భారతదేశమునకు వచ్చారు. నాగర్ కోవిల్ అనే ప్రాంతంలో పరిచర్య ప్రారంభించారు. ఆ ప్రాంతంలో స్త్రీల కొరకు విద్యాసంస్థలు ప్రారంభించారు. ఈయన ఒక మంచి శిల్పి. శిల్పాలు చెక్కుటలో ఎంత నైపుణ్యత కలిగి ఉన్నడో అనేదానికి మార్తాండం దేవాలయమును ఉదాహరణగా చెప్పవచ్చు. ప్రజల స్నేహితుడిగాను వారి యొక్క ఆత్మీయ తండ్రిగాను ఉండి సింగ్ లేయర్ దేవుడు తనకిచ్చిన ప్రణాళికను చక్కగా క్రమముగా చేసి ముగించారు. ఈయన అక్కడ లేడు కానీ ఈయన జీవితం తర్వాత ఈయన చేసిన కార్యములు పరిచర్య ద్వారా అనేకులు ఈ దినం వరకు రక్షణ పొందుటకు కారణం అయింది.

 

ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ భూలోకంలో జీవిస్తున్న దినములలో బెతానియా కుష్టి రోగి అయిన సీమోను ఇంటిలో విందు కొరకు వెళ్ళినప్పుడు ఒక స్త్రీ విలువ కలిగిన అత్తరును తీసుకుని వచ్చి దాన్ని పగలగొట్టి ఆయన శిరస్సు పైన పోసింది. అప్పుడు కొందరు దాన్ని చూసి సనుగుకున్నారు. ఈ అత్తరును 300 దేనారములకు అమ్మి ఆ ధనమును బీదలకి ఇచ్చి ఉంటే బాగుండు కదా అని సనుగుకున్నారు. అప్పుడు ప్రభు ఆమె గురించి చెప్పిన కార్యము ఈమె సత్క్రియ చేసియున్నది.

 

దీన్ని చదువుతున్న ప్రియమైన వారలారా! అత్తరుని పగలగొట్టి యేసుప్రభువు తలపై పోసిన స్త్రీ జీవితము తర్వాత ఈ దినం వరకు జరుగుతున్న కార్యమేమిటి? ఆ స్త్రీ గురించి ఎక్కడెక్కడ ప్రసంగం చేయబడుతుందో అక్కడక్కడ దీని గురించి గుర్తు చేయబడుతుంది అని ప్రభువు చెప్పినదానిని మనం చూస్తున్నాం. మనకు యేసుక్రీస్తు ప్రభువు ద్వారా ఇవ్వబడింది ఒక్క జీవితం. దీనిని జీవించి ముగించేలోగా దేవుని నామ మహిమార్దమై కార్యాలు చేసి మన పరుగును తులముట్టించాలి. ప్రభువా లోకాశలు విడిచిపెట్టి నీలో పనిచేయుటకు నాకు సహాయం చేయండి అని అడిగినప్పుడు ఖచ్చితంగా ఆయన సహాయం చేస్తారు. ప్రియమైన వారలారా మీ జీవితం తర్వాత మాట్లాడగలిగిన కార్యాలు చేస్తున్నారా?

- శ్రీమతి. శక్తి శంకర్ రాజు గారు 

 

ప్రార్థన అంశం:-

అన్ని మండలాల్లో చిల్డ్రన్ క్యాంపులో జరిపింపబడేటట్లు ప్రార్థిద్దాం.

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

www.vmm.org.in

ఈమెయిల్: info@vmm.org.in

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250


Comment As:

Comment (0)