Village Missionary Movement

கிராம மிஷனரி இயக்கம்


దిన ధ్యానము(Telugu) 18.03.2023

దిన ధ్యానము(Telugu) 18.03.2023

 

అంశం: మారని ప్రేమ

 

"ఆయన మన నిమిత్తము తన ప్రాణముపెట్టెను" - 1యోహాను 3:16 

 

కొన్ని సంవత్సరాలకు మునుపు ఒక హత్య నేరమునకు పాల్పడిన యవ్వనస్తుడు ఒకడు చెరసాలలో వేయబడి మరణశిక్షకు నియమించబడ్డాడు. ఆ సమయంలో దేవుని సేవకుడు ఒకాయన వెళ్లి యేసు యొక్క ప్రేమ గురించి అతనికి తెలియజేశారు. కుమారుడా లోకము నిన్ను హత్య చేసినవాడు అని త్రోసి వేయవచ్చు మరణమునకు తర్వాత నీ ఆత్మ యొక్క పరిస్థితి ఏమిటి? నిన్ను సృష్టించినవాడు నిన్ను వెతికి వచ్చినవాడు సిలువలో నీ కొరకు రక్తము కార్చినవాడైన యేసుక్రీస్తు నిన్ను ప్రేమిస్తున్నారు అని చెప్పినప్పుడు ఆయన కళ్ళల్లో నుండి కన్నీరు కారింది. ఆ దినము ఆయన తన హృదయాన్ని దేవుని కొరకు సమర్పించారు. ఆయన హృదయంలో గొప్ప సమాధానము వచ్చింది శిక్ష పొందుకొనవలసిన రోజు కూడా వచ్చింది. చివరగా తాను నేర్చుకున్న పాటను పాడుతూ సంతోషముతో ఆ శిక్షను అంగీకరించుటకు వెళ్ళాడు. "యేసు నన్ను ప్రేమిస్తున్నాడు యేసు నన్ను ప్రేమిస్తున్నారు యేసు నన్ను ప్రేమించుటకు నేను ఎంత భాగ్యము చేస్తున్నాను నీచూడనైన నన్ను యేసయ్య ప్రేమిస్తున్నారు దీనిని గ్రహించి ఆయన ప్రేమ హస్తములో ఆసక్తితో అనుకుంటాను". 

 

బైబిల్లో కూడా ప్రారంభం మొదలుకొని చివరి వరకు కూడా దేవుని ప్రేమను మనం చూడగలం. సిలువలో ఆయన త్యాగపూరితమైన ప్రేమను చూస్తున్నాం. ఆ ప్రేమ బండ రాయి వంటి హృదయాన్ని కూడా కరిగింప చేయగలిగిన కల్వరి ప్రేమ. ఈ లోకానికి యేసుప్రభు మనిషిగా వచ్చినప్పుడు అందరిని ప్రేమించారు. కొందరు ఆయన ప్రేమకు బదులుగా ప్రేమనే జవాబుగా ఇచ్చారు. లూకా సువార్త 10 వ అధ్యాయంలో మార్త, మరియ అనే ఇద్దరు సహోదరీలు ఆయనను తమ ఇంట చేర్చుకున్నారు అని చదువుతున్నాం. లాజరు ఆయన యొక్క స్నేహితుడు అని పిలవబడ్డాడు. లాజరు రోగముతో మరణించినప్పుడు యేసు కన్నీరు కార్చారు అని యోహాను 11:35లో చదవగలం. ఆయన యొక్క కనికరము మరల లాజరును ప్రాణంతో లేపింది. 

 

లోకములో పలు రకములైన ప్రేమలు కలవు. కొన్ని ప్రేమలు నకిలీ ప్రేమలు, అలానే స్వార్థమైన ప్రేమ, నటించే ప్రేమ కానీ కలువరి ప్రేమ అయితే మహా త్యాగపూరితమైన ప్రేమ. పవిత్రమైన కనికరము గల ప్రేమ నిజమైన ప్రేమ. ప్రియమైన దేవుని పిల్లలారా ప్రేమ లేని ఈ ప్రపంచంలో అనాది వలే ఉంటున్నాను అని తలుచుతున్నారా? ఆ కలవరి సిలువ వైపు చూడండి అక్కడ ఆయన తన యొక్క విలువ కలిగిన రక్తాన్ని చిందించి నిన్ను ప్రేమిస్తున్నారు. తప్పిపోయిన కుమారుడు వలె వెనక్కు వెళ్లిపోయిన పరిస్థితుల్లో ఈ దినము మీరు ఉండినప్పటికీ ఇంక నువ్వు యేసయ్య మిమ్మల్ని ప్రేమిస్తున్నారు. మరి ఆయన చెంతకు వెళ్లి నీ జీవితాన్ని సమర్పిస్తావా? యేసుక్రీస్తు ప్రభువు యొక్క రక్తములో పాపక్షమాపణ, రక్షణ మనకు కలిగింది. 

- శ్రీమతి. జబకని శేఖర్ గారు 

 

ప్రార్థన అంశం: 

మన హెడ్ ఆఫీస్ లో ఆకలి గల వారికి ఆహారం ఇచ్చుట అనే ప్రణాళికలో ఆదరించబడుతున్న వ్యక్తులు దేవుని ప్రేమను రుచిచూచేటట్లు ప్రార్థిద్దాం.

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

www.vmm.org.in

ఈమెయిల్: info@vmm.org.in

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250


Comment As:

Comment (0)