Village Missionary Movement

கிராம மிஷனரி இயக்கம்


దిన ధ్యానము(Telugu) 26.11.2022

దిన ధ్యానము(Telugu) 26.11.2022

 

అంశం:- నెపములు.

 

“అయితే వారందరు ఏకమనస్సుతో నెపములు చెప్ప సాగిరి. మొదటివాడునేనొక పొలము కొనియున్నాను, అవశ్యముగా వెళ్లి దాని చూడవలెను, నన్ను క్షమింపవలెనని నిన్ను వేడుకొనుచున్నననెను” - లూకా 14:18

 

ఇంగ్లాండ్ ప్రధాని అయిన విన్ స్టన్ సర్జన్ యొక్క ఆఫీసులో అతనికి సహాయ కరముగ పనిచేసే ఒకతను అబద్దములు చెప్పుటలో మిక్కిలి నైపుణ్యం కలిగిన వాడు. ప్రధాని అయిన విన్ స్టన్ సమయానికి ఆఫీసుకు వచ్చినా సరే తన సహాయకుడు చాలా సార్లు ఆలస్యంగా వచ్చేవాడు. అతనితో పాటు ఆలస్యమునకు గల కారణం కూడా తీసుకొని వస్తాడు. ఒక సారి విన్ స్టన్ తన సహాయకుడ్ని పిలిచారు. కాని అతడు అక్కడికి రాలేదు. అలవాటు ప్రకారంగా ఆలస్యంగా వచ్చాడు. ఎందుకు ఆలస్యం అని అడిగినప్పుడు అయ్యా నన్ను క్షమించాలి నా చేతి గడియారం కొంచం ఆలస్యంగా తిరుగుతోంది అనే విషయాన్ని ఇప్పుడే గమనించాను అని చెప్పాడంట. వెంటనే నువ్వు నీ చేతి గడియరాన్ని మార్చుకో లేదంటే నేను నిన్ను మార్చాల్సి వస్తుంది కాబట్టి నిర్ణయం నువ్వే తీసుకో అని అన్నారంట విన్ స్టన్. ఆ తరువాత నుండి ఆ సహాయకుడు అబద్దం చెప్పడం మానేసాడు. ఆఫీసుకు సరైన సమయానికి రావడం మొదలు పెట్టాడు. 

 

పరిశుద్ధ గ్రంధంలో చాలా చోట్ల నెపములు అనగా ఆబద్ధం చెప్పే వ్యక్తులను మనం చూడవచ్చు. ఆదాము, హవ్వ, సౌలు, ఎఫ్రాయిము గోత్రము వారు ఇలా చాలా మందే బైబిల్లో కనబడతారు. ఇలా నెపములు మాట్లాడేవారు అబద్ధములు చెప్పుటకు అస్సలు బయపడరు. వారు అబద్దం మాట్లాడటం వలననే ధారాళంగా నెపములు చెప్తుంటారు. ఎక్కడ ఆబద్దం, నెపములు కనబడునో అక్కడ అపవాది క్రియలు ఉండును. నెపము అనే స్వభావమును ఇంకొక విధముగా చెప్పాలి అంటే సోమరితనం. సోమరులే ప్రతి దానికీ నెపములు చెబుతారు. ఒక పనిని ఆలస్యంగా చేయడం లేదా మరచిపోవడం ఈ రెండింటి వెనుక సోమరితనం కలదు. నెపములను అంత సులభముగా తొలగించ లేము. ఇది కూడా ఒక పాపమే. లూకా సువార్త 14:15-35 వచనాల్లో ముగ్గురు వ్యక్తులను గూర్చి మనం చదువుతున్నాం. ప్రభువు వీరితో మీరే ఈ పనిని చేయాలి అని బలవంతం చేయలేదు. బదులుగా వారిని విడిచిపెట్టి ఇతరులకు ఆ పనిని అప్పగిస్తున్నారు. దేవుని పనిని నేను మరచి పోయిన పక్షమున ఆ స్థలములో కొంచం కూడా సంబంధం లేని వేరే వ్యక్తిని తీసుకొని వచ్చి దేవుడు వారిని వాడుకొంటారు. మోషే యిర్మీయా వంటి ఒకరు ఇద్దరు వ్యక్తులను తప్ప వేరే ఎవరితోనూ నువ్వే ఈ పనిని చెయ్యాలి అని బలవంతం చేయడం మనం చూడలేము. ఈ వాక్యం మధ్యలో ప్రభువు మీ ద్వారా ఒక పనిని చెయ్యాలి అని ఆశ పడినట్లు అయితే వెంటనే లోబడి చెయ్యడమే మనకు ఆశీర్వదకరం. ప్రభువు మిమ్మును నడిపించును గాక!

- బ్రదర్. పి. జేకబ్ శంకర్ గారు.

 

ప్రార్థన అంశం:-

మీడియా పరిచర్యల ద్వారా ప్రార్ధించమని అడిగిన వ్యక్తుల జీవితంలో దేవుడు అద్భుతం చేయు లాగున ప్రార్దిద్దాం.

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

www.vmm.org.in

ఈమెయిల్: info@vmm.org.in

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250


Comment As:

Comment (0)