Village Missionary Movement

கிராம மிஷனரி இயக்கம்


దిన ధ్యానము(Telugu) 15.04.2024

దిన ధ్యానము(Telugu) 15.04.2024

 

అంశం: గ్రహింపు లేని హృదయము 

 

"వారు వివేచింపరు గ్రహింపరు చూడకుండునట్లు వారి కన్నులు కప్పబడెను గ్రహింపకుండునట్లు వారి హృదయములు మూయ బడెను" - యెషయా 44:18 

 

ఇద్దరు స్నేహితులు సాయంకాల సమయంలో ఇంటి బయట నిలబడి మాట్లాడుతున్నారు. దూరంగా ఉన్న ఇంట్లో విస్తారముగా పొగ రావడం గమనించారు. వెంటనే వాళ్లు ఎంత మాత్రం ఆలస్యం చేయకుండా ఆ పోగ వచ్చిన దిక్కు వైపు పరిగెత్తుకుని వెళ్లారు. ఆ మేడ మీద ఉన్న గదిలో అగ్ని మండుతా ఉంది. లోపల గడపెట్టి ముయబడిన ఉన్న తలుపును పగలగొట్టి లోనికి వెళ్లారు. చాలా అందంగా అలంకరింపబడిన గదిలో విలువ కలిగిన కార్పెట్లు అవన్నీ చూడ్డానికి చాలా అందంగా కనబడ్డాయి. ఎవరైనా లోపల ఉన్నార అని పిలుస్తూ ప్రతి రూమును కూడా వెతుకుతూ ఉన్నారు. ఎక్కడి నుంచి జవాబు లేదు. ఒక గదిలో మాత్రం ఇంకా చూడలేదు. తలుపు తీసి చూస్తే బయట ఏం జరుగుతుందో తెలియక ఒక కుటుంబం అంతా కూడా టీవీ ముందు కూర్చుని కనురెప్పలార్పకుండా టీవీ చూస్తూ ఆ ప్రోగ్రాం చూస్తూ ఉన్నారు. టీవీ ముందు స్విచ్ ఆఫ్ చేసి త్వరగా బయటికి రండి మీ ఇల్లు పై గదులు కాలిపోతున్నాయి అని అరిచారు. త్వరగా అందరు కలిసి ప్రాముఖ్యమైన వస్తువులను తీసుకొని ఇంట్లోంచి బయటికి వచ్చారు. తర్వాత ఆ మంటలు ఆర్పుటకు వాహనం కూడా వచ్చింది ఆ అగ్ని కూడా ఆర్పి వేయబడింది. ఇంటిలో అగ్ని కారణం వల్ల తలుపు తీసినప్పుడు మనుషుల యొక్క అడుగుల చప్పుడును దేనిని గమనించకుండా టీవీ చూస్తున్న వారు ఆ ఊరి ప్రజలందరినీ చూసి సిగ్గుపడ్డారు.  

 

ఇశ్రాయేలు ప్రజలు ప్రయాణం చేసి మోయాబు పల్లపు ప్రాంతానికి వచ్చినప్పుడు మోయాబు రాజైన బాలాకు ఇశ్రాయేలీయులను శపించుటకు డబ్బులు ఇచ్చి బిలామును పిలిపించుకొని రమ్మంటున్నారు. నిజాయితీగల హృదయము కలిగిన బాలాకు వారితో కూడా వెళ్ళుటకు సిద్ధపడ్డారు. గాడిద మీద బయలుదేరి వెళుతూ ఉండగా ఆయనకు వ్యతిరేకంగా నిలబడిన దూతను కూడా చూడకుండా గ్రహింపులేని హృదయముతో వెళుతున్నారు. కానీ బిలాము యొక్క గాడిదైతే గోడ వైపుకు వెళ్ళిన వెంటనే దేవుడు గాడిద నోరు తెరిచారు. గాడిదని మూడుసార్లు కొట్టారు ఇంకా ఏమి జరుగుతుందో గ్రహించలేదు. 

 

 దీనిని చదువుతున్న ప్రియమైన వారలారా! మనలో అనేకులు ఇలానే జీవిస్తున్నాం. మనం ఏమి చేస్తున్నామో మన చుట్టూ ఏమి జరుగుతుందో గ్రహింప లేకుండా ఉంటున్నాం. దేని గురించి ఆలోచన చేయకుండా ఎక్కడ జరిగితే నాకేంటి నాకు ఎలాంటి ఆపద లేదు నేను బాగుంటే చాలు దేని గురించి చింతలేదు అనే జీవిస్తూ హృదయంలో గ్రహింపులేని వారిగా జీవిస్తున్నాం. హృదయం ఇలా ఉంటే నెమ్మది నెమ్మదిగా మన మనస్సాక్షి చచ్చినదిగా మారి మనము చాలా ప్రమాదకరములోనికి వెళ్ళిపోతాం. జాగ్రత్త పడదాం ! 

- సిస్టర్. ఫాతిమా గారు 

 

ప్రార్థన అంశం:-

సువార్త పరిచర్య ద్వారా దర్శింపబడుతున్న గ్రామాలు కొరకు ప్రార్థిద్దాం

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

www.vmm.org.in

ఈమెయిల్: info@vmm.org.in

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250


Comment As:

Comment (0)