Village Missionary Movement

கிராம மிஷனரி இயக்கம்


దిన ధ్యానము(Telugu) 13.04.2024

దిన ధ్యానము(Telugu) 13.04.2024

 

అంశం: ఉపవాసము

 

"ఉపవాసదినము ప్రతిష్ఠించుడి వ్రతదినము ఏర్పరచుడి. యెహోవాను బతిమాలుకొనుటకై పెద్దలను దేశములోని జనులందరిని మీదేవుడైన యెహోవా మందిరములో సమకూర్చుడి" - యోవేలు 1:14 

 

రాము చక్కని పరుగు పందెం ఆటగాడు. ఆరో తరగతి చదువుతున్నాడు. అప్పుడు ఆయన మొట్టమొదటిగా జిల్లా తరఫున జరుగుతున్న పోటీల్లో తన స్కూలు తరపున ఎంపిక చేయబడ్డాడు. ఆయనకు శ్రేష్టమైన తర్ఫీది ఇవ్వడం ప్రారంభించారు. అప్పుడు మొట్టమొదటిగా ఆయన యొక్క బరువు, ఎత్తు పరిశీలించారు. తరువాత పి.టి టీచర్ తర్ఫీదును ప్రారంభించారు. బరువును తగ్గించాలి అని సలహా ఇచ్చారు. ఆహారపు అలవాట్లు విధానం గురించి చెప్పారు. పోటీ జరిగే దినమున ఆ టీచర్ రాముని ఉదయం ఏమి తినకుండా నేను ఇచ్చింది మాత్రమే తీసుకుని తిన అన్నారు. జ్యూస్ మరియు గ్లూకోస్ ఇచ్చారు. ఉదయం 7 గంటలకు పోటీ ప్రారంభమైంది. రాము అందులో విజయం పొందాడు. అవును ఆశించిన ఆహారము పక్కనపెట్టి అవసరమైన ఆహారము తీసుకున్నాడు కాబట్టే ఆటలో విజయన్ని పొందుకున్నాడు. మన ఆత్మీయ జీవితంలో ఉపవాసం చాలా ప్రాముఖ్యము. 

 

కానీ ఈ దినము క్రైస్తవ జీవితంలో ఉపవాసము మరువబడిన ఒక కార్యమైనది. ఫాస్టింగ్ కాదు ఫిస్టింగే అలవాటైపోయింది. ఎస్తేరు రాణి ఉపవాసం ఉండి ప్రార్థన చేసి యూదా జనాంగమును కాపాడుకున్నది. నినీవే ప్రజలు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి దేవుని యొక్క ఉగ్రత నుండి విడుదల పొందుకున్నారు. నెహెమ్యా ఉపవాసం ఉండి ప్రార్థన చేసి దేవుని యొక్క ప్రణాళికను నెరవేర్చి ముగించాడు. అంత ఎందుకు యేసు క్రీస్తు ప్రభువే ఈ లోకంలో జీవించిన దినములో తన పరిచర్య ప్రారంభించక మునుపు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి పరిచర్య ప్రారంభించారు. సాతాను వాక్యము ద్వారా వెళ్లగొట్టుటకు ఉపవాసము చేత బలము కలిగి జయించారు. సాతానును జయించాలి అంటే ఉపవాసము చాలా అవసరం ఇలాంటి సాతాను ఉపవాసముతో, ప్రార్థనలో తప్ప మరి ఏ విధముగా వెళ్లదు అని మత్తయి సువార్త 17:21 లో చదువుతున్నాం. ఉపవాసం ఉండేటప్పుడు ప్రార్థనలోనూ, బైబిల్ ధ్యానములను చేయాలి అప్పుడే నూతన బలమును పొందుకుంటాం. అందువలన కష్టమైన పరిస్థితులను మనం సులువుగా దాటిపోగలం. 

 

ప్రియమైన వారలారా పాపపు, శాపపు బంధకాలలో కట్టబడి ఉండి దాని నుండి విడుదల పొందుకోవాలి అని ఆశిస్తున్నారా? అయితే ఒక్క దినమైన ఉపవాసం ఉండి ఆయన పాదముల చెంతకు చేరుడి. ఒక కార్యాన్ని ప్రారంభించక మునుపు ప్రార్థనతో ప్రారంభించి ఉపవాసం ఉండి ప్రారంభించుడి. యేసుప్రభువు వరుడు ఎత్తబడే దినములు వస్తాయి అప్పుడు శిష్యులు ఉపవాసం ఉంటారని యేసు ప్రభువు చెప్పారు కానీ మనం ఇంకనూ అదే కాలములో ఉంటున్నాం. కానీ ఈ కాలంలో ఇంకను ఉపవాసం చేయకుండా ఉంటున్నాం. ఉపవాసం ఉండడం నేర్చుకుందాం, సాతాన్ని జయించి దేవునితో కలిసి విజయవంతమైన జీవితం జీవిద్దాం. 

- శ్రీమతి. జాస్మిన్ పాల్ గారు 

 

ప్రార్థన అంశం:-

మనతో కలిసి ఉన్న పార్టనర్షిప్ మిషనరీలను దేవుడు బలంగా వాడుకొనేటట్లు ప్రార్థిద్దాం.

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

www.vmm.org.in

ఈమెయిల్: info@vmm.org.in

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250


Comment As:

Comment (0)