Village Missionary Movement

கிராம மிஷனரி இயக்கம்


దిన ధ్యానము(Telugu) 12.04.2024

దిన ధ్యానము(Telugu) 12.04.2024

 

అంశం: ఘనమైన వస్త్రం 

 

"శృంగారమైనపాగా ధరించుకొనిన పెండ్లికుమారుని రీతిగాను ఆభరణములతో అలంకరించుకొనిన పెండ్లికుమార్తెరీతి గాను ఆయన రక్షణవస్త్రములను నాకు ధరింపజేసి యున్నాడు నీతి అను పైబట్టను నాకు ధరింపజేసియున్నాడు కాగా యెహోవానుబట్టి మహానందముతో నేను ఆనందించుచున్నాను నా దేవునిబట్టి నా ఆత్మ ఉల్లసించుచున్నది" - యెషయా 61:10 

 

తరచుగా పడిన వర్షం తర్వాత స్కూల్లు తెరవబడి విద్యార్థులు వస్తున్నారు. కొంతమంది రాలేదు. వచ్చిన విద్యార్థుల్లో కొంతమంది యూనిఫాం వేయకుండా రంగురంగులు వస్త్రాలు ధరించుకొని వచ్చారు. స్కూల్ బెల్ మోగిన వెంటనే ముగ్గురు వ్యక్తులు పరిగెత్తుకుని వచ్చారు. చాలా మంచి యూనిఫాంలో వచ్చిన వీరిని చూసి టీచర్కి చాలా ఆశ్చర్యం అనిపించింది. యూనిఫాంలో రాని వాళ్లు తడిచిపోయింది సార్, మురికిగా ఉంది సార్, ఆర్లేదు సార్ అని అనేక కార్యాలు చెప్పారు. వీలు ముగ్గురు మాత్రం ఉంటున్న స్థలము తాటి చెట్లు గుంపులుగా ఉంటున్న ఒక ప్రాంతంలో నివసిస్తూ ఉన్నారు. కొరడాలతో కొట్టుకుంటూ బిక్షం ఎత్తుకుంటూ చిన్నచిన్న మృగాలను వేటాడుకుని జీవిస్తున్న ప్రజలు వీరు. ఎలారా మీ యూనిఫామ్ ఇంత జాగ్రత్తగా దాచుకున్నారు అనీ టీచర్ అడిగారు. స్కూల్ బట్టలన్నీ కూడా మేము పక్కనే ఉన్న బిల్డింగ్ లో ఒక మూలల్లో జాగ్రత్తగా పెట్టుకున్నాం సార్ అని చెప్పారు. చెప్పినప్పుడే విద్యార్థి ముఖంలో చాలా సంతోషం కనబడుంది. హెడ్మాస్టర్ వారి యొక్క బాధ్యతలను చూచి వారిని ఘనపరిచారు. 

 

ప్రియమైన వారలారా! చూడండి ఈ విద్యార్థులు తమ యూనిఫాంను కాపాడుకొనుటకు ఎంత జాగ్రత్త వహించారో! మనకు ఒక బాధ్యత ఉన్నది మనకు మన పరమ తండ్రి అయిన దేవుడు మన యొద్ద నుండి ఎదురుచూస్తుంది అదే. మన యొక్క రక్షణ వస్త్రమును కాపాడుకునేవారుగా పరలోక రాజ్యమునకు అర్హులుగా మనము చేరుకోవాలి. ఒక రాజు విందుకు వచ్చిన వారందరికీ చూచి అందులో వివాహ వస్త్రము ధరించని ఒకరిని చూచి స్నేహితుడా వస్త్రం ఎక్కడా? ఇలా వచ్చావు అని అడిగాడు. అందుకు ఆ వ్యక్తి దగ్గర సమాధానం లేకుండా పోయింది. చూడండి స్థలమునకు తగ్గట్టుగా మనం వస్త్రం ధరించుకున్నవారముగా ఉండాలి. మనము యేసయ్య ఉన్న చోటులో ఉండటకు అర్హత కలిగినవారముగా ఉన్నాము. అలాగైతే పరలోక రాజ్యంలో ఏసయ్యతో సంతోషించుటకు ఆయన రక్తం మాత్రమే మన పాపములను కడగ గలదు అని విశ్వసించి యేసయ్య నా కొరకు తన ప్రాణమును ఇచ్చారు అని ఎరిగి మన పాపమును విడిచిపెట్టి రక్షణ పొందిన వారముగా, అర్హత పొందినవారముగా రక్షణ వస్త్రము ధరించుకున్న వారముగా ఉంటాం. తరచుగా రక్షణ వస్త్రమును ఆపవిత్ర పరచుకోకుండా కాపాడుకున్నప్పుడు పరలోకములో ఆయనతో కూడా నడిచే భాగ్యం మనకు దొరుకుతుంది. పాపక్షమాపణ, రక్షణ వస్త్రాన్ని పొందుకొనుటకు అదే మార్గం. 

 

మీ యొక్క రక్షణ వస్త్రాన్ని కాపాడుకొనుటకు మరల పాపపు ఊబిలో పడిపోకుండా శ్రద్ధ కలిగి ఉండుడి. ఇతరులకు మీ విలువ కలిగిన రక్షణ వస్త్రం గూర్చి ఎలాగైనా చెప్పుటకు ప్రయత్నిస్తారా? 

- శ్రీమతి. ఏమిమా సుందర్ రాజన్ గారు 

 

ప్రార్థన అంశం:-

ఫీల్డ్ లో జరుగుతున్న గృహ కూడికల కొరకు ప్రార్థిద్దాం

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

www.vmm.org.in

ఈమెయిల్: info@vmm.org.in

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250


Comment As:

Comment (0)