Village Missionary Movement

கிராம மிஷனரி இயக்கம்


దిన ధ్యానము(Telugu) 31.03.2024 (Kids Special)

దిన ధ్యానము(Telugu) 31.03.2024 (Kids Special)

 

అంశం: తిరిగి లేచారు. 

 

"నేను మొదటివాడను కడపటివాడను జీవించువాడను; మృతుడనైతిని గాని ఇదిగో యుగయుగములు సజీవుడనైయున్నాను. మరియు మరణముయొక్కయు పాతాళలోకము యొక్కయు తాళపుచెవులు నా స్వాధీనములో ఉన్నవి" - ప్రకటన గ్రంథం 1:18

 

ప్రత్యేకంగా చిన్నపిల్లల కొరకు :

హలో పిల్లలు బాగున్నారా? పరీక్షలు జరుగుతున్నాయా? సండే స్కూల్ కి వెళ్ళాలి యేసయ్యకు నచ్చినటువంటి ఈ సమయాన్ని సండే స్కూల్లో గడపాలి. ఈ దినం ఏ దినమో తెలుసా? ఈస్టర్. ఈస్టర్ అంటే ఏమిటో తెలుసా? యేసుప్రభు మరణము నుండి తిరిగి లేచి పాపము, శాపము, మరణం నుండి మనలను విడిపించి మన కొరకు సిలువలో మరణించిన యేసుక్రీస్తు విజయశీలుడుగా మారిన దినము. ఇది మానవజాతికి సంతోషకరమైన దినము. అక్కడ చీకటి కమ్మియుండగా మనుషులు లేని ఉదయకాల సమయంలో మగ్దలేని మరియ ఆమె యొక్క స్నేహితురాలు యేసయ్య సమాధి వద్దకు వెళ్లారు. మరణించి రెండు దినములు పూర్తయినా యేసయ్య యొక్క శరీరం నుండి కారిన రక్తము వారు మర్చిపోలేకపోయారు. దానిని తలస్తూ, ఏడుస్తూ ఉన్నారు. ఏ పాపము చేయని యేసయ్య మన కొరకు ఘోరంగా సిలువలో మరణించారే అని ఆలోచించినప్పుడు ఆ చీకటి వాళ్లకు పెద్దగా అనిపించలేదు. యేసయ్య శరీరమునకు సుగంధ ద్రవ్యములు పూయాలి అని సమాధి వద్దకు వెళ్లారు. సమాధి తెరవబడినట్లు చూసి ఆశ్చర్యపడ్డారు. లోపటికి వెళ్లి చూసినప్పుడు యేసయ్య అకడ లేరు ప్రకాశవంతమైన మిక్కిలి సుందరమైన దేవదూతలు వారికి కనబడ్డారు. వాళ్లను చూచి భయముతో ఉండిపోయారు. వెంటనే ఆ దూత భయపడుకుడి యెసయ్యను వెతుకుతున్నారు కదా ఆయన తాను చెప్పినట్లు తిరిగి లేచారు. మీరు వెళ్లి ఈ సందేశాన్ని ఆయన శిష్యులకు చెప్పుడి అన్నారు. ఒకపక్క భయము ఉన్నప్పటికీ యేసయ్య మరలా తిరిగి లేచారు అనే సంతోషం వారి హృదయంలో పొంగిపొర్లింది. సమాధిని విడిచి బయటికి వచ్చి పరిగెత్తుకుని వెళ్లారు. యేసయ్య వారికి ప్రత్యక్షమయ్యారు. ఆయనను చూచి వారు భయపడ్డారు కానీ యేసయ్య వారిని చూసి మీరు వర్ధిల్లుదురుగాక అని చెప్పారు. యేసయ్య ఎదుట వాళ్ళు సాష్టాంగ పడి నమస్కరించారు. ఆయనను చూసిన సంతోషంలో పరిగెత్తుకొని ఏడుస్తూ ఉన్న శిష్యుల వద్దకు ఈ శుభవార్తను చెప్పుటకు వెళ్లారు. వారు పొందుకున్న సంతోషానికి అవధులు లేవు మగ్దలేని మరియ యేసుప్రభు మీద పెట్టుకున్న ప్రేమ ఆయన మర్చిపోలేదు. ప్రాణముతో లేచిన వెంటనే మొట్టమొదటిగా యేసయ్యను చూసే భాగ్యము ఆ అక్కకే దొరికింది. 

 

ప్రియ తమ్ముడు చెల్లి లోకములో అన్ని సమాధులు మూయబడి ఉన్నాయి కానీ యేసయ్య సమాధి మాత్రమే తెరవబడి ఉంది. యేసయ్య తిరిగి లేచాడు. ఈ దినం వరకు యేసయ్య జీవుడుగానే ఉన్నారు. మన కొరకు ప్రాణమిచ్చినవాడు దేవుని ఆశీర్వాదాలు ఇవ్వకుండా మానునా? మీరు ఆయన పిల్లలగా మారితే చాలు. 

- శ్రీమతి. జీవా విజయ్ గారు

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

www.vmm.org.in

ఈమెయిల్: info@vmm.org.in

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250


Comment As:

Comment (0)