Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 17.07.2024
Share:

By Village Missionary Movement

Wednesday, 17-Jul-2024

దిన ధ్యానము(Telugu) 17.07.2024

 

అంశం:- క్రీస్తా? బరబ్బా?     

 

"ఈ లోకమునైనను లోకములో ఉన్నవాటినైనను ప్రేమింపకుడి. ఎవడైనను లోకమును ప్రేమించినయెడల తండ్రి ప్రేమ వానిలో నుండదు" - 1 యోహాను 2:15

 

నాకు తెలిసిన ఒక సహోదరి యొక్క భర్త సైన్యములో పనిచేసే వారు. ఒకసారి సైన్యము నుండి వచ్చినప్పుడు ఇతర సైనికులను వారి భార్యలతో కలిసి పార్టీకి రమ్మని మద్యం సేవించడానికి ఆజ్ఞాపించారు. ఆ సహోదరి అయితే క్రీస్తును ఎరిగినందున క్రీస్తు మరియు భర్త అనే పోరాటం. చివరికి ఒక నిర్ణయానికి వచ్చారు. భర్తకు లోబడాలి అని ప్రభువు చెప్పారు కానీ దేవునికి ఇష్టం లేని కార్యాలలో భర్తకు లోబడుట కంటే దేవుని మాటకు లోబడుట మేలు అని క్రీస్తుకి లోబడాలి అని నిర్ణయించుకుని అలాంటి ప్రజలతో వెళ్ళుటకు, త్రాగుటకు తిరస్కరించారు. దాంతోపాటు రోజు కన్నీరు కార్చి తన భర్త కొరకు ప్రార్థించారు. భర్త యొక్క హృదయాన్ని దేవుడు మార్చారు.

 

ఇలానే బైబిల్లో కూడా నాలుగు సువార్తల్లో క్రీస్తు బరబ్బా అనే యూదా ప్రజలు నిర్ణయం తీసుకోవాల్సిన కార్యాన్ని ఫిలాతు వాళ్ళు ముందు పెట్టి ఉన్నారు కానీ యూదా ప్రజలు క్రీస్తును విడిచిపెట్టి బరబ్బా ను ఎంచుకున్నారు. యేసయ్య యొద్ద ఎలాంటి నేరము నేను కనుగొనలేదు అని ఫిలాతు చెప్పినప్పటికీ ప్రజలు బరబ్బానే విడిపించమని ఎంచుకున్నారు. ఆయన హత్య చేసిన వాడుగాను కలహములు రేపేవాడుగా ఉన్నప్పటికీ ఆయనను ఎంచుకున్నారు. అలానే ఇశ్రాయేలు జనాంగము ఇతర దేవుళ్ళను సేవించి వచ్చినప్పుడు యెహోషువ ప్రజల యొద్ద ఎంత వరకు రెండు తలంపుల మీద నడుస్తారు? దేవుడా? బయలుదేవతా? ఎవరిని వెంబడిస్తారు అని అంటున్నారు. 1 రాజులు 18: 21 ఇలానే ఈ దినము అనేకమంది క్రైస్తవ పేర్లు పెట్టుకుని వారమునకు ఒక్క సారి దేవాలయానికి వెళ్లి వస్తున్నారు. మరియు అనేకులు క్రైస్తవ స్నేహితులతో కలిసి నప్పుడు వారి కొరకు లోక కార్యాల్లో కలిసిపోతున్నారు. నాకు తెలిసిన నాకు దగ్గరగా ఉన్న స్నేహితుని విడిచిపెట్టలేను దగ్గరగా ఉన్న స్నేహితులని తిరస్కరించలేను అని చెప్పి లోక కార్యములలో సర్దుకుపోతున్నారు.

 

దేవుని పిల్లలారా ఇలానే క్రీస్తా? స్నేహితులా? అని వచ్చినప్పుడు సరైన నిర్ణయం తీసుకోండి. ఎందుకంటే శరీరానుసారమైన క్రియలు, గర్వము ఇవన్నీ కూడా లోకము నుండి వచ్చినవి తండ్రి వల్ల వచ్చినవి కావు అవి లోకంలో ఉన్నవి అని 1 యోహాను 2:16 లో చదువుతున్నాం. లోకమును లోకములో ఉన్న వాటిని తిరస్కరించాలి. ఇలా మీరు జీవిస్తున్నప్పుడే మనుషులు చేత తిరస్కరించబడినప్పటికీ పక్కన పెట్టబడినప్పటికీ త్రోసి వేయబడినప్పటికీ ధైర్యంతో ఉండండి. అప్పుడు మన కొరకు శ్రమలను అనుభవించి రక్షించిన యేసయ్యను గుర్తించుకొనుడి. మన ద్వారా మేలు పొందుకున్న ప్రజల చేత తిరస్కరింపబడినప్పటికీ, ఎవరు మనల్ని ద్వేషించినా, పక్కనపెట్టిన క్రీస్తు కొరకు నిలబడినప్పుడు క్రీస్తు మీ పక్షమున ఉండి ఆయనే నీతి గల న్యాయాధిపతిగా నీతి చేస్తారు. ఆమెన్!

- శ్రీమతి. గ్రేస్ జీవమని గారు 

 

ప్రార్థన అంశం:-

ఇనియవలె అనే కార్యక్రమం ద్వారా స్త్రీలు అనేకులు క్రీస్తు నందు కుటుంబములను కట్టుకోనేటట్లు ప్రార్థిద్దాం.

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

www.vmm.org.in

ఈమెయిల్: info@vmm.org.in

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al