Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 16.07.2024
Share:

By Village Missionary Movement

Tuesday, 16-Jul-2024

దిన ధ్యానము(Telugu) 16.07.2024

 

అంశం:- సమర్పణ కుమారుడు 

 

“బాలుడు నడువవలసిన త్రోవను వానికి నేర్పుము వాడు పెద్దవాడైనప్పుడు దానినుండి తొలగిపోడు” - సామెతలు 22:6

 

కోట రుసిల్ల దంపతులకు పుట్టిన ఒకే బిడ్డ మరణించింది చాలా దుఃఖముతో ఉన్నారు. డిసెంబర్ నెలలో జర్మనీలో చలి అధికంగా ఉంటుంది. ఆ చలిలో ఒక చక్కని పాట వారి చెవిలో పడింది. పేదవాడైనా ఒక బాబు దేవుడు వస్త్రమిచ్చి నన్ను కాపాడుతున్నారు నాలో తన ప్రేమను నింపారు. నా రోజంతా నన్ను దీవిస్తారు నా యొక్క ప్రాణం పోయినప్పుడ నన్ను మోక్షంలో చేర్చుకుంటారు అనే పాటను వణుకుతున్న చలిలో పాడాడు. ఆ బాలుడు పాట విన్న దంపతులు ఇంటి తలుపు తెరిచి చూచినప్పుడు ఒక పేద పిల్లవాడు వణుకుతున్న చలిలో పాడుతూ ఉన్నాడు.

 

ఆయనను ఇంట్లోనికి పిలిచి ఈ తల్లిదండ్రులు నీవు ఎక్కడి నుంచి వస్తున్నావు అని అడిగినప్పుడు నేను ఒక పేద వాడిని నాతో పుట్టిన వారు ఏడుగురు. నేనే మొదటి వాడను నన్ను నా తల్లిదండ్రులు దేవుని కొరకు ఆ దినమే సమర్పించారు. చదువుటకు ఆసక్తి కానీ నా తల్లిదండ్రు చదివించలేకపోతున్నారు అందువలన ఈ జీవము కలిగిన పాటలు పాడుతూ నిత్యమూ అడుక్కుంటూ స్కూల్లో చదువుతున్నాను అని చెప్పాడు. వెంటనే ఆ దంపతులు ఆ బాలుడిని దత్తత తీసుకుని చదివించారు. అనేక సంవత్సరాలు గడిచాయి. ఆ బాలుడు చదివి పెద్దవాడై ఉన్నత స్థాయికి వెళ్ళాడు. ఉన్నత పదవులు అన్నీ కూడా ఆయన వెతుక్కుంటూ వచ్చాయి కానీ ఆయన అయితే వాటిని విడిచిపెట్టి తన తల్లిదండ్రులు సమర్పణను నెరవేర్చాడు. ఆయనే రిఫార్మేషన్ నక్షత్రము అని పిలవబడుతున్న మార్టిన్ లూథర్. తల్లి తన చిన్నతనంలోనే నేర్పించిన నిరీక్షణతో కూడిన పాట ఆయన సంతతి వారికి సహాయపడింది. ఈ విధముగా మార్టిన్ లూథర్ చిన్నవయసులోనే ఆమె తల్లి నేర్పించిన కార్యాలు ఆయన పెద్దవాడిగా చేసింది. చిన్న వయసులో దేవాలయంలో విడవబడిన సమూయేలు పరిచర్య చేయడంతో పాటు అక్కడ నేర్పించిన కార్యాలన్నీ కూడా నేర్చుకొని దాని ప్రకారము జీవించడం వలన గొప్ప ప్రవక్తగా దీవించబడ్డాడు.

 

నా ప్రియమైన వారలారా చిన్నప్రాయములో మనం నేర్చుకుంటున్న కార్యాలు మన పిల్లలు దేవునిలో ఎదుగుటకు సహాయపడుతుంది. బైబిల్లో నీ విత్తనములను నీళ్లపైన వేయము. అనేక దినముల తర్వాత దాని ఫలమును చూస్తావు అని మనం చదువుతున్నాం. కాబట్టి మనం పిల్లల్ని దేవుని సహాయంతో దేవుని కొరకు దేవుని యొక్క వాక్యంలో నడిపిద్దాం. మన పిల్లలు ఆకాశంలో ఉంటున్న నక్షత్రాల వలె ప్రకాశిస్తారు. అనేకులకు ప్రయోజనమైన వారిగా ఉంటారు .

- శ్రీమతి. జ్ఞాన సెల్వం సెల్వ రాజ్ గారు 

 

ప్రార్థన అంశం:-

కన్మణిఎకేల్ అనే కార్యక్రమం ద్వారా దర్శింపబడుతున్న యనస్తులు పరిశుద్ధతలో ఎదిగేటట్లు ప్రార్థిద్దాం.

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

www.vmm.org.in

ఈమెయిల్: info@vmm.org.in

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al perabet perabet giriş safirbet safirbet giriş betasus betasus giriş virüsbet medusabahis medusabahis giriş grandpashabet grandpashabet giriş jojobet jojobet giriş vaycasino vaycasino giriş pusulabet pusulabet giriş perabet perabet giriş perabet perabet giriş matbet slot oyna perabet perabet giriş hiltonbet perabet perabet perabet betnano holiganbet galabet kalebet holiganbet