Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 15.07.2024
Share:

By Village Missionary Movement

Monday, 15-Jul-2024

దిన ధ్యానము(Telugu) 15.07.2024

 

అంశం:- కన్నీరు 

 

"యేసు కన్నీళ్లు విడిచెను" - యోహాను 11:35

 

ఒకసారి సువార్తికుడైన బిల్లీ గ్రహం సందేశం ఇచ్చుటకు లండన్లో ఒక సువార్త కూటమును ఏర్పాటు చేశారు. కానీ అక్కడ ఆయన ఆ కూడిక నడిపించుటకు రాకూడదు అని చాలా వ్యతిరేకత వచ్చింది. గాస్పల్ సర్కస్ నడిపిస్తున్న బిల్లీ గ్రహం వస్తున్నారు అని మీడియాలో, న్యూస్ పేపర్లో ఆయన గురించి హేళన చేసి రాశారు. సంఘాలు కూడా ఆయన రాకడను వ్యతిరేకించాయి. ఇలాంటి పరిస్థితిలో ఆయన భార్య ఓడలో లండన్కు చేరుకున్న వెంటనే అనేకమంది విలేకరులు ఆయన దగ్గరికి వచ్చి మా లండన్ మార్చడానికి వచ్చారు కదా మీ అమెరికాను మార్చేసారా? అని అందరూ నోటికి వచ్చినట్లు ప్రశ్నలు వేసి ఆయనను హేళన చేశారు. ఆయన దిగిన చోట నుండి ఆయన వెళ్ళవలసిన పట్టణమునకు రైలు ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు యేసయ్య కార్యాలు ఇలా ఉన్నాయి ఇలా నేను ఎక్కడికి వెళ్లి పరిచర్య చేయాలి అని దేవున్ని చూచి అడిగినప్పుడు వెంటనే దేవుడు వాక్యముతో అతనితో మాట్లాడారు. వెంటనే ఆయన ప్రభువా ఏలాంటి వ్యతిరేకత వచ్చినా వాటిని జయించుకునే కృపను దయచేయండి అని చెప్పి కన్నీళ్ళతో ప్రార్థించారు. రైలులో నుండి దిగినప్పుడు వేలకోలది మంది ప్రజలు ఆయన కొరకు వేచి ఉండి సంతోషముతో ఆహ్వానించారు. నీ కొరకు నేను ఎంతమంది ప్రజలను ఏర్పాటు చేశానో చూసావా అని ఆయన హృదయంతో దేవుడు మాట్లాడారు. దానిని చూచిన బిల్లీ గ్రహం కళ్ళల్లో నుండి కన్నీరు కారింది.

 

ఈ దినము బైబిల్లో కూడా తన సహోదరుడు మరణించి సమాధి చేయబడినటువంటి పరిస్థితుల్లో లాజరు యొక్క సహోదరీలు చెప్తున్న మాట మీరు ఇక్కడ ఉండి ఉంటే నా యొక్క సహోదరుడు మరణించి ఉండడు అనే ఆ మాట చెప్పడం అలానే మరియా కన్నీరు కార్చడం మనం చూస్తున్నాం. అది ఆయనను కన్నీరు కార్చే విధంగా చేసింది. మీ సహోదరును కొరకే కదా ఏడుస్తున్నారు లాజరు బయటికి రా అని చెప్పి మరణించి నాలుగు రోజులైన లాజరును సజీవుడిగా లేపి సహోదరీలకు అప్పగించాడు.

 

ప్రియమైన వారలారా! దేవుని సన్నిధి యందు మీరు దేనికొరకు కన్నీరు కారుస్తున్నారో ఆ కన్నీరు ఆ దృష్టిలో చాలా విలువ గలిగినది. ఈ లోకంలో అనేకులను దుఃఖపరిచి కన్నీరు కారుస్తున్న వారిని ఈ లోకంలో ప్రజలు ఎంత మాత్రమూ లక్ష పెట్టకుండా దాటిపోతున్న మనుషులను చూస్తున్నాం. కానీ మన ప్రభువు అలాంటివారు కారు మీరు దేనిని ఎవరిని కోల్పోయారో దేనికొరకు ప్రార్థిస్తున్నారో, నా కన్నీరు చూసేవారు ఎవరు లేరు సహాయం చేసే వారు ఎవరు లేరు అని అంగలారిస్తున్నారా? మీ కన్నీరు ఆయనను కదిలిస్తుంది. ఏడవకండి ఆయన మీ ప్రార్థనకు జవాబు ఇస్తారు. ఆమెన్!

- శ్రీమతి. శక్తి శంకర్ రాజ్ గారు 

 

ప్రార్థన అంశం:-

ఛత్తీస్గడ్ రాష్ట్రంలో పరిచర్య చేస్తున్న సేవకులు యొక్క ఆరోగ్యం మరియు సంరక్షణ కొరకు ప్రార్థిద్దాం.

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

www.vmm.org.in

ఈమెయిల్: info@vmm.org.in

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al holiganbet giriş holiganbet padişahbet giriş bets10 extrabet royalbet süperbetin jojobet padişahbet holiganbet betcio romabet giriş romabet queenbet bahiscasino markajbet bahiscasino atlasbet casibom matbet matbet giriş