Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 14.07.2024 (Kids Special
Share:

By Village Missionary Movement

Sunday, 14-Jul-2024

దిన ధ్యానము(Telugu) 14.07.2024 (Kids Special)

 

అంశం:- పక్షులు మరియు కట్టెలు నరికే వాడు.

 

"విధవరాండ్రను తండ్రిలేనివారిని పరదేశులను దరిద్రులను బాధపెట్టకుడి, మీ హృదయమందు సహోదరులలో ఎవరికిని కీడు చేయదలచకుడి" - జెకర్యా 7:10

 

ప్రత్యేకంగా చిన్నపిల్లల కొరకు 

 

ఒక గ్రామంలో మనీ అనే వ్యక్తి తన కుటుంబీకులతో కలిసి నివసిస్తున్నాడు. రోజు కట్టెలు నరికి వాటిని అమ్మి తన కుటుంబాన్ని పోషిస్తూ ఉన్నాడు. ఆయన రోజు వెళ్తున్న ఒక అడవిలో ఒక పెద్ద మామిడి చెట్టు ఒకటి ఉన్నది. దానిపైన పక్షులు మరియు తేనెటీగలు ఆ చెట్టు పైన ఉండగలిగే జీవరాసులు అన్నీ కూడా గూడ్లు కట్టి నివాసం చేస్తూ ఉన్నాయి . మనీ కట్టెల నరికి విశ్రాంతి కొరకు ఆ మామిడి చెట్టు నీడలోనికి వచ్చి ఉన్నాడు. ప్రతిరోజు వెళ్ళటం వలన ఆ చెట్టు పైన ఉన్న జీవరాశులన్నీ కూడా మనీకి మంచి స్నేహితులుగా మారి రోజు ఆయనకు తినుటకు ఫలములను ఇస్తూ ఉండేవి.

 

 ఒక దినము ఆ ఊరు పెద్ద మనీని పిలిచి నాకు ఒక మంచి చెక్క అవసరమైనది కాబట్టి రెండు ఎద్దుల బండ్లు పట్టే అంత పెద్ద చెట్టును నరికి నాకు తీసుకుని రా నేను దానికి తగినట్టుగా ఎక్కువ మొత్తంలో డబ్బులు ఇస్తానని చెప్పాడు. మనీ వెంటనే సరే అని చెప్పి అడవులోనికి వెళ్లి చెట్లను వెతకడం ప్రారంభించాడు. ఎంత వెతికినా ఆ ఊరు పెద్ద అడిగినట్లు ఆ సైజు చెట్టు దొరకలేదు కాబట్టి అలసిపోయి విశ్రాంతి కొరకు ఆ మామిడి చెట్టు కిందకు వచ్చాడు. ఆ మామిడి చెట్టు నీడలో కూర్చుని ఉన్నప్పుడు మనీకి ఒక ఆలోచన కలిగింది. నేను ఈ చెట్టు నరికి ఊరు పెద్దకి తీసుకుని వెళ్తే చాలా డబ్బులు సంపాదించవచ్చు అని ఆలోచించి చెట్టుని గొడ్డలితో నరకడం ప్రారంభించాడు. వెంటనే ఆ మామిడి చెట్టు అయ్యో మానవుడా ఎందుకు నన్ను నరుకుతున్నావు? నా నీడకు వచ్చి ఎంతోమంది విశ్రాంతి పొందుతూ ఉన్నారు. నువ్వు కూడా రోజు వచ్చి విశ్రాంతి తీసుకుంటున్నావు కదా నేను నీకు నీడనిస్తున్నాను కాబట్టి నరకవద్దు అని వేడుకున్నది. కానీ మనీ అయితే దేనిని లెక్కచేయకుండా చెట్టు కొట్టడం ప్రారంభించాడు. కొంచెం సమయం తర్వాత పక్షులన్నీ వచ్చి అయ్యో మానవుడా దయతో ఈ చెట్టు నరకవద్దు నీకు ఇంకా ఎన్ని పండ్లు కావాలన్నా మేము తీసుకుని వస్తాము ఎంత తేనే కావాలన్నా ఇస్తాము కానీ ఈ చెట్టును మాత్రం నరకవద్దు అని చెప్పి ఏడ్చాయి. కానీ ఆయనకు ఎంత మాత్రం కనికరం లేకుండా ఆ చెట్టును నరుకుతూ ఉన్నాడు. అప్పుడు ఒక కొమ్మ విరిగి కింద పడింది ఆ కొమ్మలో గూడు కట్టి నివసిస్తున్న పక్షి యొక్క మూడు పిల్లలు కింద పడ్డాయి. దాంట్లో రెండు చనిపోయి ఒకటి ప్రాణంతో కొట్టుకుంటుంది. వెంటనే తల్లి పక్షి ఆ పిల్లల చుట్టూ ఎగురుతూ ఏ మానవుడా మేము మీకు ఎంత సహాయం చేసాము ఇంత అన్యాయంగా నా బిడ్డలను చంపేసావే అని ఏడుస్తూ ఆయన చుట్టూ తిరిగింది. దానిని చూచిన మనీ యొక్క హృదయము బ్రద్దలైంది. అల్పమైన ధనము కొరకు ఆశపడి ఎన్ని జీవరాశులను నాశనం చేయడానికి నేను సిద్ధపడ్డాను అని చెప్పి వాటికి క్షమాపణ అడిగి ఇలా ఎప్పుడు ఎంత ధనము వచ్చినా ఇలాంటి పొరపాటు చేయను అని నిర్ణయించుకున్నాడు. 

 

హలో పిల్లలు మీరు కూడా మీ పైన ప్రేమ చూపించిన వారికి, సహాయం చేసిన వారికి ఎన్నడను కీడు చేయకూడదు. సరేనా!

- శ్రీమతి. సారాల్ సుభాష్ గారు

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

www.vmm.org.in

ఈమెయిల్: info@vmm.org.in

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al perabet perabet giriş safirbet safirbet giriş betasus betasus giriş virüsbet medusabahis medusabahis giriş grandpashabet grandpashabet giriş jojobet jojobet giriş vaycasino vaycasino giriş pusulabet pusulabet giriş perabet perabet giriş perabet perabet giriş matbet slot oyna perabet perabet giriş hiltonbet perabet perabet perabet betnano holiganbet galabet kalebet holiganbet