Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 13.07.2024
Share:

By Village Missionary Movement

Saturday, 13-Jul-2024

దిన ధ్యానము(Telugu) 13.07.2024

 

అంశం:- దేవుని దృష్టి

 

"నా దోషమును కప్పుకొనక నీ యెదుట నాపాపము ఒప్పుకొంటిని యెహోవా సన్నిధిని నా అతిక్రమములు ఒప్పు కొందు ననుకొంటిని. నీవు నా పాపదోషమును పరిహరించియున్నావు" - కీర్తనలు 32:5

 

ఒక యవ్వనస్తుడు తన కుటుంబాన్ని కాపాడాలి అని తలంచి వేరే దేశములో పనికొరకు వెళ్లాడు. అక్కడ స్నేహితుల యొక్క బలవంతము వలన కుటుంబీకులు దూరముగా ఉండుటవలన త్రాగుడుకు అలవాటుపడ్డాడు. ఇంటికి డబ్బులు పంపించడం మర్చిపోయాడు. తన చేతిలో ఉన్నదంతా కూడా త్రాగి చివరికి పేదరికంలో పడ్డాడు. స్నేహితులు ఈయన పెద్ద త్రాగుబోతు అని చెప్పి దూరమయ్యారు. ఆయన శరీరము బలహీనమైంది. సహాయం చేయుటకు స్నేహితులు బంధువులు లేరు తనకు సహాయం చేసే వారు ఎవరు లేరు అని ఆలోచించాడు కానీ దేవుని దృష్టి ఆయన పైన పడింది. ఆత్మహత్య చేసుకోవాలి అని అనుకున్న ఆయనను యేసయ్య దర్శించి పునర్జీవాన్ని దయచేసారు.

 

ఈ లోకములో జీవిస్తున్న ప్రజలు యొక్క దృష్టి చూచే విధానాలు అనేకమైన విధానాలుగా ఉంటుంది. కానీ ప్రభువు మనల్ని చూస్తున్న విధము మనలను జీవింపచేయుటకు. మన యొక్క దేవుని దృష్టి సలహాలు ఇచ్చే విధముగా ఆశ్చర్యకరమైన దృష్టి గా ఉంటున్నది. అది దయ కలిగినది సమస్త చోట్లలో కూడా తిరిగి మనలను చూస్తూ ఉంటున్న ఆయన కంటికి మరుగై ఎక్కడికి వెళ్ళలేము. చీకటిలో ఉండినను ఆయన దృష్టి మన మీద పెట్టి నడవవలసిన సరియైన మార్గంలో నడిపించి సహాయము చేస్తారు. అగ్ని జ్వాలల వంటి ప్రకాశవంతమైన కన్నులు గలవాడు ఆయన మరియు మన దేవుడు ఎలాంటి పక్షపాతం కలిగిన వాడు కాడు. మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్న ఆయన మన పరిస్థితులను మార్చగలిగేవాడు. ఆయన ఒక్కరే మన యొక్క చెడు మార్గముల నుండి మంచి మార్గములకు నడిపించి గమ్యానికి చేర్చగలిగిన వారు. మన మీద కనుదృష్టి పెట్టి ఆలోచన చెప్పేవాడు. నేను నీకు బోధించి నీవు నడవవలసిన మార్గాన్ని నేర్పించెదను నీ మీద దృష్టి ఉంచి నిన్ను ఆదరిస్తాను అని చెప్పే దేవుడు మన దేవుడు.

 

ప్రియమైన వారలారా! మనుషులు ఎవరు చూడలేదే నన్ను పట్టించుకోలేదు అనే కళ్ళతో ఉంటున్నారా? దేవుని దృష్టి ఎన్నడూ మీ మీద ఉంటున్నది అనేదాన్ని తలంచి సంతోషించుడి. దేవుని దృష్టి మన యొక్క బలహీనతలలోనూ, అనారోగ్యములోనూ, ఇరుకులోను, ఇబ్బందుల్లోనూ, విమోచన కలిగిస్తుంది. మనకు దైవిక పరమైన సలహాలు ఇచ్చి నడిపించుటకు ఆయన దృష్టి ఎప్పుడూ మన మీద పెట్టబడి ఉంటుంది. మనము మన మీద దృష్టి పెట్టడం మానేసి సలహాలు చెప్పే దేవుని వైపున దృష్టి పెట్టి చూడడం ప్రారంభిద్దామా? మనం తల్లి గర్భంలో ఉంటున్నప్పుడే ఆయన యొక్క దృష్టి మన మీద పడింది. ఆఖరి వరకు ఆది మనలను నడిపిస్తుంది. 

- సహోదరి. జోయ్ గ్రేస్ గారు 

 

ప్రార్థన అంశం:-

ఆంధ్రాలో జరుగుతున్న దేవాలయ కట్టడ పనుల కొరకు ప్రార్థిద్దాం.

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

www.vmm.org.in

ఈమెయిల్: info@vmm.org.in

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al perabet perabet giriş safirbet safirbet giriş betasus betasus giriş virüsbet medusabahis medusabahis giriş grandpashabet grandpashabet giriş jojobet jojobet giriş vaycasino vaycasino giriş pusulabet pusulabet giriş perabet perabet giriş perabet perabet giriş matbet slot oyna perabet perabet giriş hiltonbet perabet perabet perabet betnano holiganbet galabet kalebet holiganbet