Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 12.07.2024
Share:

By Village Missionary Movement

Friday, 12-Jul-2024

దిన ధ్యానము(Telugu) 12.07.2024

 

అంశం:- గర్వము గలవారు 

 

"కాదుగాని, ఆయన ఎక్కువ కృప నిచ్చును; అందుచేత దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును అని లేఖనము చెప్పుచున్నది" - యాకోబు 4:6

 

టైటానిక్ అనే పేరుగాంచిన పెద్ద ఓడ బ్రహ్మాండమైనదిగా ఎక్కువ ఖరీదు కలిగినదిగా సంరక్షణ పరికరాలతో వైట్ స్టార్ లైన్ సంస్థ చేత తయారు చేయబడింది. ఎంత పెద్ద మంచుకొండనైనా దాని గుండా దూసుకు వెళ్లగలిగిన సామర్థ్యం కలిగినది అనియు ఎలాంటి కాలమునకైనా సరిపోయిన నైపుణ్యత కలిగినదని అందరూ పొగడారు. ఓడ బయలుదేరుటకు సిద్ధపడినప్పుడు ధనవంతులుగా ఎంచబడిన 2224 మంది ప్రయాణికులను తీసుకొని వెళుతున్న ఆ ఆడ నాయకుడు ఇలా అన్నాడు దేవుడే తలచినా ఈ ఓడను ఏమీ చేయలేరు అని అన్నాడు. అలాంటిది తన మొదటి ప్రయాణంలోనే 1812వ సంవత్సరం ఏప్రిల్ 15వ తారీఖున ఉత్తర అట్లాంటిక్ సముద్ర తీరమున ఆ ఓడ మునిగిపోయింది. ఆ ప్రమాదంలో 1500 మందికి పైగా మరణించారు. కారణం ఓడ ముందు భాగంలో మంచు పగలగొట్టగలిగి నటువంటి పరికరం అమర్చబడి ఉన్నది కానీ ఓడ పక్క వైపు నుండి ఆ మంచు గడ్డ వచ్చి గుద్దినందున ఆ ఓడ రెండుగా బ్రద్దలైంది. దానిని రూపొందించిన సంస్థ యొక్క గర్వము అంతా సముద్రపాలు అయింది.

 

బైబిల్లో ఆదికాండములో గోపురాన్ని కట్టి మనము పేరు సంపాదించుకుందాం రండి అని కలిసి వచ్చారు. వీళ్ళు కట్టిన గోపురాన్ని గూర్చిన గర్వాన్ని పగలగొట్టుటకు దేవుడు వారి కార్యాలను వారి భాషలను తారుమారు చేశారు. వీరు తమ పేరు ప్రస్తావించుటకు దానిని నెలకొల్పుటకు ఆశించారు కానీ దేవుని దృష్టికి అది అహిష్టముగా ఉన్నది.

 

ప్రియమైన వారలారా! దేవుడు గర్విష్టులకు వ్యతిరేకంగా నిలబడి ఉన్నారు. దేవుడే వ్యతిరేకిస్తున్న ఏదైనా కార్యమున్నది అంటే ఈ గర్వమే. గర్వమునకు వ్యతిరేకమైన పదము తగ్గింపు స్వభావము, దీనత్వము. మనము యేసయ్య వలె ప్రతి దినము దీన మనస్సు గలవారుగా జీవిద్దాం. మనకు కలిగినవన్నీ కూడా దేవుని కృప చేత మనకు దొరికినవి దేనిలో కూడా మనము గర్వించుటకు హక్కు లేదు. బైబిల్ ఇలా ప్రతి ఒక్కరు హెచ్చరిస్తుంది. నా సామర్థ్యం చేత, నా శక్తి బలము చేత ఈ ఐశ్వర్యాన్ని నేను సంపాదించాను అని నా హృదయంలో చెప్పుకొనకుండా ఉండాలి(ద్వితీయోపదేశకాండము 18: 17). అవును మన జీవము ఆయనకు సొంతమైనది అలా ఉండేటప్పుడు మనము చేసిన వాటిని గురించి గర్వించవచ్చా? కాబట్టి మనము పొందుకున్న సమస్తమైన దయ అన్నిటి కొరకు కృతజ్ఞత స్తుతులు చెల్లించి గర్వాన్ని మన నుండి దూరము చేద్దాం.

- శ్రీమతి. రూబీ అరుణ్ గారు 

 

ప్రార్థన అంశం:

గుజరాత్ రాష్ట్రంలో పరిచర్య విస్తరింపబడేటట్లు ప్రార్థిద్దాం.

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

www.vmm.org.in

ఈమెయిల్: info@vmm.org.in

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al holiganbet giriş holiganbet padişahbet giriş bets10 extrabet royalbet süperbetin jojobet padişahbet holiganbet betcio romabet giriş romabet queenbet bahiscasino markajbet bahiscasino atlasbet casibom matbet matbet giriş