Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 21.04.2021
Share:

By Village Missionary Movement

Wednesday, 21-Apr-2021

దిన ధ్యానము(Telugu) 21.04.2021

దేవున్ని నమ్ముడి.

"యెహోవాయందు భయభక్తులుగలవారలారా యెహోవా యందు నమ్మిక యుంచుడి" - కీర్తనలు 115: 11

ప్రపంచ ప్రసిద్ధి గాంచిన ప్రసంగికుడు డి.యల్.మూడీ ఒక మారు సండే స్కూల్లో పాటాలు చెబుతున్నారు. హఠాత్తుగా తన చేతిలో గల బంగారు గడియరాన్ని విప్పి ఇది ఎవరికి కావాలి? అని అడిగారు. విద్యార్థులు అందరికి ఒక సందేహం ఎవరైనా బంగారు గడియరాన్ని ఉచితంగా ఇస్తారా? అని ఏ విద్యార్థి కూడా దానిని తీసుకొనుటకు ముందుకు రాలేదు. తమాషా కొరకు అడుగుతున్నారేమో అని ఆలోచించారు. చివరిగా ఒక 6 సంవత్సరాల బాలుడు వచ్చి దానిని అతని యొద్దనుండి తీసుకున్నాడు. వెంటనే మూడి ఈ గడియారం నాకు ఎంతగా ప్రయోజన కరముగా ఉన్నదో నీకు కూడా అంతే ప్రయోజనకరంగా ఉంటుంది అని అతనిని ప్రోత్సహించి అతనికి ఇచ్చారు. వీటన్నింటిని కూడా చూసిన విద్యార్థులు ఆశ్చర్య పోయారు. వెంటనే వారు ఆ ప్రసంగీకుని యొద్దకు వెళ్లి మీరు నిజముగా అతనికి ఇచ్చివేసారా అని అడిగారు. అవును నేను నిజముగానే ఆ బాబుకు ఇచ్చాను ఎందుకంటే ఆ బాబు నేను చెప్పిన వాటిని నమ్మాడు. ఇప్పుడు ఆ గడియారం ఆయనదే అన్నారు. ఆయన ఆ గడియరాన్ని ఇతర విద్యార్థులకు చూపించి సంతోషపడ్డాడు.

ఇలాగు బైబిల్లో ప్రభువు చెప్పిన వాటన్నింటిని చిన్న పిల్లల వలె నమ్మాలి. లోకమును దేవుడు నీళ్లతో నాశనం చేస్తానని హెచ్చరించినను దానిని ఎవరూ నమ్మకపోయినప్పటికి నోవహు దానిని నమ్మారు. అందువలన నోవహు అతని కుటుంబము రక్షించబడింది. దేవుడు అబ్రాహాముతో ని సంతానం విస్తారముగా విస్తరించును అని చెప్పినట్లుగా ఆయన అనేక జాతులకు తండ్రి అవుటకు నమ్మలేని పరిస్థితులు ఉన్నప్పటకి దానిని నిరీక్షణ అనే విశ్వాసంతో విశ్వసించాడు. అది అతనికి నీతిగా ఎంచబడింది. దేవుడు ఇచ్చిన వాగ్దానాలు అబ్రాహాము, ఇస్సాకు, యాకోబు అని మన పితరులు నమ్మెను అందును బట్టి దీవెనలు సొంతం చేసుకున్నారు. 

క్రీస్తు నందు ప్రియమైన వారలారా! ప్రతి రోజు ప్రభువు మీతో మాట్లాడుతున్నారు, వాగ్దానాలు ఇస్తువున్నారు. నేను నిన్ను దీవిస్తాను, నీ ద్వారా నేను మహిమ పరచబడతాను, చివరి కాల ఉజ్జీవంలో నిన్ను నేను వాడుకుంటాను నిన్ను పాపపు బంధకములలో, రోగముల బారినుండి, సాతాను శక్తుల చేత పీడింపబడుతున్న వారిని మీ ద్వారా విడిపించుటకు మిమ్మల్ని వాడుకుంటాను అని మాట్లాడుతూనే ఉన్నారు. మీరు ఆయన మాటను ఉన్నది వున్నట్లుగా నమ్మినప్పుడు దేవుడు మీద్వారా గొప్ప కార్యములు చేస్తారు. మీ ద్వారా ఆయన చేస్తున్న కార్యం గొప్పగా ఉంటుందని దేవుడు చెబుతున్నారు. అబ్రహాము వలె విశ్వసించండి. కచ్చితంగా దేవుడు చెప్పిన మాటలు మీ జీవితంలో కార్యములు జరగడం మీరు చూస్తారు.
-    శ్రీమతి. సుసన్న మ్యాత్యు

ప్రార్థన అంశం:-
మోక్ష ప్రయాణం, దిన ధ్యానము రాస్తున్న దేవుని పిల్లల్ని దేవుడు బలముగా వాడుకొనేటట్లు ప్రార్థిద్దాం.

ఈ దిన ధ్యానవాక్యం కొరకు ఈ క్రింద నoబర్లును సంప్రదించండి
వాట్సాప్ తమిళ్ కొరకు +91 94440 11864, 
ఇంగ్లీష్ కొరకు +91 86109 84002, 
హిందీ కొరకు +91 93858 10496
తెలుగు +91 94424 93250

ఈమెయిల్: reachvmm@gmail.com
Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001
ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al