Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 10.07.2024
Share:

By Village Missionary Movement

Wednesday, 10-Jul-2024

దిన ధ్యానము(Telugu) 10.07.2024

 

అంశం:- అల్ పెట్రాస్ 

 

"దేవుని ప్రేమించువారికి, అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి, మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని యెరుగుదుము" - రోమీయులకు 8:28

 

అనేక సమయాల్లో మనం ఇలాగా దుఃఖపడుతూ ఉంటాం. ఎందుకు మనం వినిపిస్తూ ఉంటాం. నేను కొద్దిగా పొడవుగా, మంచి రంగులో, సన్నగా కొద్దిగా లావుగా, ఇంకా కొద్దిగా చదివి ఉంటే, వేరే ఇంట్లో పుట్టి ఉంటే బాగుంటుంది కదూ అని దుఃఖపడుతూ ఉంటాం. కానీ మిమ్మల్ని చాలా చక్కగా సృష్టించిన దేవుడు అనుగ్రహించి ఉన్నారు. డోంట్ వర్రీ! 

 

అల్ పెట్రాస్ అనే పక్షి గురించి ఈ మధ్యన చదివాను. అది ఒక ప్రేమించే పక్షి. ఇది ఎప్పుడు జతలు జతలుగా జీవిస్తూ ఉంటాయి. దీనికి పొడవాటి రెక్కలు ఉంటాయి చాలా పెద్ద సైజు కూడా ఉంటుంది. మిగిలిన పక్షుల వలె ఎగర లేవు కానీ ఎత్తైన స్థలంనకు వెళ్లి విమానం ఎలాగైతే ఎగురుతుందో అలా ఎగరడం ప్రారంభిస్తుంది. సుమారు ఐదు సంవత్సరాల వరకు కంటిన్యూస్గా ఆగకుండా ఎగర గలదు. సముద్రము లోపల చేపలు దీని ఆహారం. మిగిలిన పక్షులు వలే వీటి యొక్క జీవితం సాధారణమైనది కాదు. దేవుడు వాటికి ఇచ్చిన లైఫ్ స్టైల్ అంగీకరించి ఆశ్చర్య రీతిగా తన జీవితాన్ని కొనసాగిస్తుంది. అవును మీరు కూడా దేవుడు అనుమతించిన కార్యాలను అలానే అంగీకరించండి. 

 

బైబిల్లో రూతు పుస్తకంలో నయోమి అనే తల్లిని చూడవచ్చు. ఆమె భర్త ఎలిమేలెకు దేశంలో ఏర్పడిన కరువు నుండి తప్పించుకొనుటకు మోయాబు దేశమునకు కుటుంబం నుండి వెళ్ళాడు. నయోమి యొక్క భర్త మరణించాడు, తన బిడ్డలు మరణించారు ఒంటరిగా ఆమె బ్రతికింది. తన దేశాన్ని తన జనాల్ని తన దేవుని ఆరాధించుటకు తిరిగి వచ్చింది. అవును తన యొక్క జీవితంలో సమస్తాన్ని కోల్పోయిన దేవుని మర్చిపోలేదు తాను కోడలిని రూతుని తనతో పాటు తీసుకుని వచ్చింది. మన దేవుడు ఆమె కుటుంబాన్ని ఆదరించి కాపాడుటకు, దేవుని కుమారుడు ఆమె సంతతిలో జన్మించుటకు ఒక ప్రణాళిక దేవుని యొద్ద ఉండేది. 

 

అవును నా ప్రియమైన వారలారా! జీవితంలో దేవుడు అనుమతించిన సమస్త కార్యాలను సహనముతో అంగీకరించుడి. దేవుణ్ణి ప్రేమించే వారికి సమస్తము మేలుకొరకే జరుగుతుంది అని మర్చిపోకండి. పరిస్థితులు ఏమైనా సరే దేవుని పక్షమున తిరగండి ఆయన పైన ఆనుకొనుడి ఆయన మీకు ఆదరణ కర్త అయి మిమ్మల్ని దీవిస్తారు, జీవింపజేస్తారు. హల్లెలూయ! 

- సిస్టర్. ఆర్. మంజుల గారు 

 

ప్రార్థన అంశం:-

మన ఫీల్డ్ లో జరుగుతున్న ట్యూషన్ సెంటర్లో చదువుతున్న పిల్లల కొరకు ప్రార్థిద్దాం.

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

www.vmm.org.in

ఈమెయిల్: info@vmm.org.in

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al