By Village Missionary Movement
Tuesday, 09-Jul-2024దిన ధ్యానము(Telugu) 09.07.2024
అంశం:- విశ్వాసం వలన తప్పించబడ్డారు
"అగ్నిబలమును చల్లార్చిరి; ఖడ్గధారను తప్పించుకొనిరి; బలహీనులుగా ఉండి బలపరచబడిరి; యుద్ధములో పరాక్రమశాలులైరి; అన్యుల సేనలను పారదోలిరి" - హెబ్రీయులకు 11:34
సంఘంలో లేఖనమునకు విరుద్ధమైన కార్యాలు జరుగుట చూచి దాన్ని ఎత్తి చూపించడం వలన మార్టిన్ లూథర్ సంఘము వలన అన్ని బాధ్యతలు నుండి తొలగించబడ్డారు. మరియు అనేక నేరాలు ఆయన పైన మోప బడ్డాయి. మార్టిన్ లూథర్ ఒక రోజు అడవి గుండా వెళుతున్నప్పుడు ఐదుగురు ప్రభుత్వ సైనికులు ఆయనను కనుగొన్నారు. విశ్వాస వీరుడైన లూథర్ ఆ సైనికులను చూసి భయపడలేదు. క్రీస్తు పైన విశ్వాసం కలిగినవాడిగా ప్రార్థించి ధైర్యముతో ఆ సైనికులతో మాట్లాడడం ప్రారంభించారు. ఆ సైనికులు తమ పనిని మరిచిపోయి సమయం తెలియకుండా అనేక గంటలు అతనితో మాట్లాడి సమాధానము కలవారిగా వారి యొక్క ఆత్మల నూతన పరచబడి సంతోషముతో అక్కడనుండి తిరిగి వెళ్లారు. ఆ దినము లూథర్ కాపాడబడ్డారు. ఇలాగ అనేకసార్లు ఆయన తప్పించబడడానికి గల కారణము విశ్వాసం వలన నీతిమంతుడు బ్రతుకును అనే వాక్యమే.
బైబిల్లో కూడా రాజు తప్ప వేరే ఎవరిని కూడా పూజింపకూడదు అని రాజు చేత ఆజ్ఞ ముద్రించబడినప్పటికీ దానియేలు విశ్వాసముతో మూడు పూటలు మునుపుట వలె ప్రార్థిస్తూ ఉన్నాడు. సింహాల బోనులో వేయబడినప్పటికీ ప్రార్థిస్తూ ఉన్నాడు. అందువలన ఆ దేశంలో ఉన్నవారిలో దానియేలు దేవుడే జీవము కలిగిన దేవుడు అని గ్రహించగలిగారు. అలానే షడ్రక్, మేషక్ అబేద్నగోలు బంగారు ప్రతిమను నమస్కరించలేదు. దేవుని పైన విశ్వాసం కలిగిన వారుగా ఉన్నారు. అగ్ని యొక్క తీవ్రత 7 రెట్లు అధిగమించబడింది అయినప్పటికీ దానిలో నుండి కాపాడబడ్డాడు. ఎక్కడైతే ప్రజలు విశ్వాసముతో దేవుని కొరకు పౌరుషముగా ఉంటున్నారో అక్కడ దేవుడు వాళ్లను సంరక్షించుటకు తమ దూతను పంపించుట చూస్తున్నాం.
దీనిని చదువుతున్న ప్రియమైన వారలారా! మన జీవితంలో కూడా శోధనలు, వేదనలు, ఇరుకుల సమయాలలో మనము విశ్వాసము అని పిలవబడే లంగర్ను వేసిన యెడల దేవుడు దాన్ని చూచి ఆయన సమస్త పరిస్థితి నుండి మనలను అద్భుతముగా మనలను విడిపిస్తారు. అది మాత్రమే కాదు చుట్టూ ఉన్నవారు దేవుని శక్తిని గ్రహించినట్లు చేస్తారు. మన విశ్వాసము ద్వారా ఈ లోకాన్ని జయిస్తున్న జయము అని 1 యోహాను 5:4 లో చదువుతున్నాం. విశ్వాసాన్ని పెంచుదాం లోకము నుండి వచ్చే ఇరుకులు, కష్టాలు, వేదనలు నుండి తప్పించబడి సమాధానకరమైన జీవితం జీవిద్దాం.
- శ్రీమతి. జాస్మిన్ పాల్ గారు.
ప్రార్థన అంశం:-
ఆకలి గల వారికి ఆహారం ఇచ్చే పరిచర్య ద్వారా ప్రయోజనం పొందేటట్లు ప్రార్థిద్దాం.
*Whatsapp*
ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.
www.vmm.org.in
ఈమెయిల్: info@vmm.org.in
Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin
విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001
ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250