Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 08.07.2024
Share:

By Village Missionary Movement

Monday, 08-Jul-2024

దిన ధ్యానము(Telugu) 08.07.2024

 

అంశం:- మన ఆత్మీయ వధువు 

 

“నా సహోదరి నా ప్రాణేశ్వరి మూయబడిన ఉద్యానము మూతవేయబడిన జలకూపము" - పరమగీతము 4:12

 

"మనము ఆత్మీయ వధువులుగా, దేవుని తోటగా, నీటి ఊటగల బావిగా ఉండాలి అని ఆయన కోరుకుంటున్నారు. ఊట గల బావి తోటను పచ్చిక గలదిగా చేస్తుంది. నీటి ఊటలేని భావి తోటను ఎండిపోయి ఎవ్వరు ఇష్టపడని దానిగా ఉంచుతుంది. తోటలో గల ఫలములు వలన వరుడు సంతోషించాలి. వరుడైన దేవుడు కోరుకునే పంట విధేయత అనే ఫలము, ప్రేమ అనే ఫలము, పరిచర్య అనే ఫలము ఎదురుచూస్తూ ఉన్నారు. 

 

విక్టోరియా మహారాణి తన డైరీలో అన్ని కార్యాలను కూడా తన కుటుంబ కార్యాలను ఏదీ దాచి పెట్టకుండా రాసిపెట్టి ఉంచారు. దానిలో రాసిన ఒక కార్యము ఇదిగో. ఆమె ఒక ప్రోగ్రామ్కు వెళ్లి తిరిగి వచ్చినప్పుడు భవనంలో ఉన్న తన గదికి వచ్చినప్పుడు అది లోపల నుండి గడియ పెట్టబడి ఉంది. తలుపు వద్దకు వచ్చి మహారాణి విక్టోరియా వచ్చి ఉన్నారు అని చెప్పినా లోపల నుండి జవాబు ఏమీ రాలేదు. మరల తలుపు కొట్టి నప్పుడు లోపల నుండి ఆమె భర్త ఎవరో అనుకుని ఎవరు వచ్చారు అని అడుగుతూ వచ్చాడు. వెంటనే నేను నీ ప్రియమైన భార్యను వచ్చాను అని చెప్పిన వెంటనే ఆయన పరిగెత్తుకొని వెళ్లి తలుపు తీశారు అంట.

 

ప్రేమతో ఎదురుచూసిన దేవుడు నీవు నా యొద్ద ప్రేమగా ఉంటున్నావా అని ఎదురుచూస్తూ ఉన్నారు. ఆయన మన యొద్ద ప్రేమ చూపిస్తున్నారు. పాలు యాంగిచ్చు అనే గొప్ప సేవకుడు ఎప్పుడు పరిచర్య పరిచర్య అని వెళుతున్నప్పుడు ఆయన భార్య చాలా బలహీనురాలై శరీరము సన్నబడింది. భార్య యొక్క పరిస్థితిని గమనించిన ఆయన దేవుని యొద్ద ప్రార్ధించారు. ప్రభువు ఈయనతో మొట్టమొదటిగా దేవుని ప్రేమించు తర్వాత నిన్ను ప్రేమించుకో తర్వాత నీ భార్యను ప్రేమించు తర్వాత నీ సంఘమును ప్రేమించు అని చెప్పారు. ఇది అపవిత్ర ఆత్మ యొక్క సలహాగా ఉన్నది ఏమో అని ఆలోచిస్తున్నప్పుడు తన సొంత కుటుంబాన్ని నడిపించుట ఎరుగనివాడు దేవుని సంఘాన్ని ఎలా నడిపిస్తాడు (మొదటి తిమోతి 3:5) అని పరిశుద్ధాత్మ దేవుడు స్పష్టముగా మాట్లాడారు.

 

అవును ఒక భార్య భర్త యొద్ద నుండి ప్రేమ ఎలా ఎదురు చూస్తుందో అలానే వరుడైన యేసుక్రీస్తు ప్రభువు ఆత్మీయ వదువైన మన యొద్ద ప్రేమను ఎదురుచూస్తున్నారు. యేసయ్యను ప్రేమిద్దాం, ప్రేమిస్తూ జీవిద్దాం. హల్లెలూయ!

- శ్రీమతి. ఫాతిమా సెల్వా రాజ్ గారు 

 

ప్రార్థన అంశం:-

దేబోరాల్ మిషనరీల ద్వారా జరుగుతున్నటువంటి మిషనరీ పరిచర్యలో దేవుని హాస్తము తోడైయుండి నడిపించేటట్లు ప్రార్థిద్దాం.

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

www.vmm.org.in

ఈమెయిల్: info@vmm.org.in

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al perabet perabet giriş safirbet safirbet giriş betasus betasus giriş virüsbet medusabahis medusabahis giriş grandpashabet grandpashabet giriş jojobet jojobet giriş vaycasino vaycasino giriş pusulabet pusulabet giriş perabet perabet giriş perabet perabet giriş matbet slot oyna perabet perabet giriş hiltonbet perabet perabet perabet betnano holiganbet galabet kalebet holiganbet