By Village Missionary Movement
Thursday, 04-Jul-2024దిన ధ్యానము(Telugu) 04.07.2024
అంశం:- మలుపు
"యుద్ధదినమునకు గుఱ్ఱములను ఆయత్తపరచుటకద్దు గాని రక్షణ యెహోవా అధీనము" - సామెతలు 21:31
కొన్ని సంవత్సరాలకు మునుపు కొంతమంది గొప్ప నాయకులు తమ యొక్క జీవితాలను గురించి మాట్లాడుటకు చికాగో అనే పట్టణంలో కలుసుకున్నారు. వాళ్ళందరూ కూడా అనేక సంవత్సరాలకు మునుపు ఏమీ లేని పరిస్థితుల నుండి తమ జీవితాన్ని ప్రారంభించిన వారు కానీ ప్రస్తుతము తమ యొక్క వ్యాపారం వలన ఆత్మీయ జీవితం వలన ఉన్నత స్థాయిలో కనబడుతున్నారు. వాళ్లు సాధించిన విషయాలు తమకు దొరికిన ఆశీర్వాదాలు గురించి కృతజ్ఞత గల వారీగాను, యదార్థత కలిగిన వారిగా ఉన్నారు. ఏమీలేని పరిస్థితిలో నుండి ప్రారంభించిన తమ యొక్క జీవితములో విజయమునకు కారణాలను అనేకులు మాట్లాడుతూ ఉన్నారు. దాంట్లో ఒక వ్యక్తి దేవుని బలముతో నేను నియమించుకున్న గురి నన్ను నడిపించింది అని చెప్పాడు. మనము అనేక కార్యాలు చేసి ముగించుటకు సహాయం చేసినది ప్రార్థన అన్నాడు. దానిని అంగీకరించే విధంగా అందరు చప్పట్లు కొట్టి తల ఊపారు.
బైబిల్లో యెహోషువ 1:1 లో దేవుడు దాసుడైన మోషే మరణించిన తర్వాత మోషే పనివాడిగా నూను కుమారుడైన యెహోషువ మోషే యొక్క పనివాడిగా పరిచయం చేయబడ్డాడు. యెహోషువ 24: 29లో నూను కుమారుడైన యెహోషువ అనే దేవుని దాసుడు అని పేరుపొంది జీవితాన్ని ముగిస్తున్నాడు. యెహోషువ ఇలాంటి అసాధ్యమైన కార్యములు చేయుట గల కారణము ఆయన ఉదయాన్నే దేవుని దర్శించే ప్రార్థన యోధుడుగా ఉంటున్నాడు. దేవునితో కలిసి ప్రయాస పడిన యెడల గొప్ప విజయలను మనం పొందుకొనవచ్చును అని గ్రహించి యున్నాడు కాబట్టి విజయాన్ని పొందారు.
ప్రియా సహోదరుడా, సహోదరి మనం అనేక కార్యాలలో విజయాలు సాధించుటకు ఆశిస్తూ ఉన్నాం. ఆ కార్యాల గురించి ఉన్నటువంటి గురిలో స్పష్టత కలిగి ఉన్నామా? విజయం ఇచ్చుటకు ఆయన సిద్ధంగా ఉన్నారు ఆయనతో ప్రయాణం చేసి విజయాన్ని పొందుకొనుటకు మీరు సిద్ధంగా ఉన్నారా? క్రమముగా చేయవలసిన దేవునికి సంబంధించిన కార్యాలు క్రమంగా చేస్తున్నామా? లేదా కార్యాలను ప్రారంభించి మధ్యలో విడిచిపెడుతున్నామా? నూతన సంవత్సర నిర్ణయాలు వలె ప్రారంభించబడి విడిచిపెట్టకుండా దేవుని సహాయంతో ఆఖరి వరకు ప్రార్థనతో ప్రయాస పడదాం. సకల విధములైన ప్రయాసమునకు ఫలితము కలదు అని వాగ్దానం చేసిన దేవుడు దానిని మన జీవితంలో నెరవేర్చును గాక! ఆమెన్.
- బ్రదర్. అలగర్ సామి గారు
ప్రార్థన అంశం:-
మన సేవకుల యొక్క ప్రయాణముల కొరకు మరియు వారి సంరక్షణ కొరకు ప్రార్థిద్దాం.
*Whatsapp*
ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.
www.vmm.org.in
ఈమెయిల్: info@vmm.org.in
Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin
విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001
ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250