Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 01.07.2024
Share:

By Village Missionary Movement

Monday, 01-Jul-2024

దిన ధ్యానము(Telugu) 01.07.2024

 

అంశం:- ఆత్మీయ వరాలు 

 

"నమ్మినవారివలన ఈ సూచక క్రియలు కనబడును(మూలభాషలో-నమ్మినవారిని ఈ సూచక క్రియలు వెంబడించును); ఏవనగా, నా నామమున దయ్యములను వెళ్లగొట్టుదురు; క్రొత్త భాషలు మాటలాడుదురు" - మార్కు 16:17 

 

మేము పరిచర్య చేయుట ప్రారంభించిన దినాలలో ఒక గ్రామంలో నడుస్తూ వెళ్లేటప్పుడు ఆ మార్గములో కూర్చుని ఉన్న వృద్ధురాలైన తల్లిగారు ధాన్యమును శుభ్రము చేస్తూ ఉండగా హఠాత్తుగా కిందపడ్డారు. ఆమెలో ఉండిన దెయ్యము కేకలు వేస్తూ వెళ్లిపోయింది. నేను వాళ్ళ కొరకు తల పైన చేతులు పెట్టి ప్రార్థించలేదు, అంతకుముందు ఆ తల్లి గురించి నాకు ఏమీ తెలియదు కానీ నడిచి వెళ్ళేటప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు క్రియ చేశారని గ్రహించగలిగాను. 

 

బైబిల్లో అపోస్తులుల యొక్క దినాలలో జరిగిన అద్భుతాలు ఆశ్చర్యకారాలు మన చదువుతున్నాం. వారి యొక్క చేతుల ద్వారా అనేక అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు ప్రజల మధ్యన చేయబడ్డాయి మరియు రోగులను మంచం మీద పెట్టి మంచముతో పేతురు నడిచి వెళుతున్న మార్గంలో పెట్టేవారు అనేక అద్భుతాలు జరిగాయి. ఆత్మీయ వరాలు పనిచేస్తూ ఉన్నాయి. 

 

యేసుక్రీస్తు ప్రభువు పరలోకానికి వెళ్ళడాని కంటే ముందు అనేకమంది ప్రజలను శిష్యులుగా చేసి తండ్రి కుమారా పరిశుద్ధాత్మ నామములో బాప్తీస్మం ఇవ్వమని ఆజ్ఞాపించి వెళ్లారు. శిష్యులు అదేవిధంగా చేసి ప్రజలకు బాప్తిసం ఇచ్చారు. ఆయన చెప్పినది చేయుట మన బాధ్యత. ఆయన ఆజ్ఞను సంపూర్ణముగా చేసినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మన ద్వారా ఆత్మీయ వరాలను ప్రత్యక్ష పరుస్తారు. దీనిని పేతురు చేశాడు. ధైర్యముగా వ్యతిరేకతల మధ్యలో కూడా నిలబడి యేసుక్రీస్తును ప్రకటించేటప్పుడు ఆత్మ వరాలు పని చేస్తున్నాయి. కాబట్టి వారు వెళ్లే మార్గం గుండా ప్రభువు వారితో ఉండి అద్భుత కార్యాలు చేశారు. 

 

ప్రియమైన వారలారా! ఇలాంటి అద్భుతాలు మీ ద్వారా కూడా జరగాలని ఆశక్తి కలిగి ఉన్నారా? మీరు ప్రభువు మీకు అప్పగించిన పనిని నెరవేర్చుటకు కచ్చితంగా ముందుకు వెళ్ళండి పరిశుద్ధాత్మ దేవుడు మీ ద్వారా గొప్ప కార్యాలు చేస్తాడు. ఎలా అంటే ఆయన పైన విశ్వాసముంచి ఆయన గూర్చి ఇతరులకు చెప్పినప్పుడు మీ ద్వారా ఆత్మీయ వరాలు పనిచేస్తుంటాయి. ఆ విశ్వాసంతో మీ చేతులు వారిపైన పెట్టి ప్రార్థించండి. రోగాలు తగ్గిపోతాయి, దయ్యాలు పారిపోతాయి. మీ చేతుల ద్వారా కూడా ఇలాంటి అద్భుతాలు జరుగుతాయి కాబట్టి బయలుదేరి వెళ్ళుడి. 

- బ్రదర్. కే. డేవిడ్ గణేష్ గారు 

 

ప్రార్థన అంశం:-

ఈ నెల అంతా జరుగుతున్న దేవుని పరిచర్యలో దేవుని హస్తము తోడైయుండి నడిపించేటట్లు ప్రార్థిద్దాం.

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

www.vmm.org.in

ఈమెయిల్: info@vmm.org.in

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al perabet perabet giriş safirbet safirbet giriş betasus betasus giriş virüsbet medusabahis medusabahis giriş grandpashabet grandpashabet giriş jojobet jojobet giriş vaycasino vaycasino giriş pusulabet pusulabet giriş perabet perabet giriş perabet perabet giriş matbet slot oyna perabet perabet giriş hiltonbet perabet perabet perabet betnano holiganbet galabet kalebet holiganbet