By Village Missionary Movement
Thursday, 27-Jun-2024దిన ధ్యానము(Telugu) 27.06.2024
అంశం:- చేయగలిగినది చేద్దాం
"ఈమె తన శక్తికొలదిచేసి, నా భూస్థాపన నిమిత్తము నా శరీరమును ముందుగా అభిషేకించెను" - మార్కు 14:8
యోహాన్ ఫిలిప్ బాప్త్రిసియస్ (1711 నుండి 1791) అనే జర్మనీ దేశపు క్రైస్తవ బోధకుడు మరియు తమిళ భాషలో ఒక కవిగా ఉండేవాడు. లూధరన్ సంఘానికి చెందిన ఈయన తమిళ్ డిక్షనరీ, తమిళ్లో బైబిల్ ను రాశారు. చెన్నైలో ఈయన యొక్క సంఘంలో అనేక దేశస్థులు ఉన్నందున వారి మధ్య ప్రసంగించుకొనుటకు జర్మన్, డచ్, పోర్చుగీస్, ఆంగ్లభాష, తమిళ్ అనే భాషను నేర్చుకొని ఈ ఐదు భాషల్లో కూడా ప్రసంగం చేసేవారు. తమిళ్ భాషలో బైబిల్ ని తర్జుమా చేయుటలో ఈయన పాత్ర ఎక్కువగా ఉంది. ఈయన ట్రాన్స్లేషన్ గురించి హుపర్ అనే వ్యక్తి చెప్పేటప్పుడు బైబిల్ ను తర్జుమా చేసి చరిత్రలో బాప్త్రిసియస్ చేసినది గొప్ప పని అది ప్రోత్సాహవంతమైనది అన్నారు. ఈయన తన వల్ల మాత్రమే కాదు క్రీస్తు మహిమ కొరకు కార్యాయం చేశారు.
ప్రభువైన యేసుక్రీస్తు భూలోకంలో జీవించిన దినాలలో అనేకమైన అద్భుతాలను ఆశ్చర్య కార్యాలు చేశారు. ఒక స్త్రీ చేసిన కార్యం ఆయనను ఎక్కువగా ఆకర్షించింది. అది ఏమిటి అంటే సీమోను ఇంటిలో విందు కొరకు పిలవబడినప్పుడు ఆ స్త్రీ విలువ గలిగిన అత్తరు బుడ్డిని తీసుకువచ్చి ఆయన తల మీద పోసింది. కొందరు ఈ అత్తరును ఇంతగా వ్యర్థం చేయుట ఎందుకు అధికమైన ధనమునకు అమ్మి బీదలకు ఇచ్చి ఉండవచ్చు కదా అని అన్నారు. కానీ ఈమె తాను చేయగలిగినదంతా చేసినది అని యేసుప్రభు ఆమెను పొగిడారు.
నా ప్రియమైన వారలారా! పరిచర్యకు నాకు పిలుపు లేదు అని చెప్పేవారుగా ఉన్నారా చింతించొద్దు ఎక్కడ నా నామం పేరట ఇద్దరు ముగ్గురు కూడి ఉంటారో అక్కడ నేను ఉంటాను అని చెప్పిన దేవుడు జవాబు దయ చేయడానికి యేసుప్రభు సజీవుడుగా ఉన్నారు. కాబట్టి మన ఫీల్డ్ లో నేరుగా వెళ్లి సువార్త ప్రకటించలేని విధముగా ఉండిన యెడల అలాంటి వాళ్ళు పరిచర్య కొరకు, ఇతరులు చేస్తున్న పరిచర్య కొరకు భారము కలిగి ప్రార్థన చేద్దాం. చేయగలిగినది చేద్దాం, ఇవ్వగలిగినది ఇద్దాం. ఇందువల్ల దేవుని రాజ్యము బలంగా కట్టబడుతుంది. మనము చేయగలిగిన కార్యాన్ని చేసి పరమందున్న దేవుని రాజ్యానికి పాలి భాగస్తులు అవుదాం మనం కలిగినది ప్రభువైన యేసు క్రీస్తునకు ఇద్దాం.
- బ్రదర్. పచ్చయి ముత్తు గారు
ప్రార్థన అంశం:-
ఆమెను విలేజ్ టీవీలో వస్తున్న కార్యక్రమాల ద్వారా అనేక హృదయాలు తెరవబడేటట్లు ప్రార్థిద్దాం.
*Whatsapp*
ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.
www.vmm.org.in
ఈమెయిల్: info@vmm.org.in
Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin
విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001
ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250