Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 24.06.2024
Share:

By Village Missionary Movement

Monday, 24-Jun-2024

దిన ధ్యానము(Telugu) 24.06.2024

 

అంశం:- సమస్తము దేవునిది

 

“లోకమును దాని పరిపూర్ణతయు నావే. నేను ఆకలిగొనినను నీతో చెప్పను” - కీర్తనలు 50:12

 

దేవుని యొక్క గ్రంథంలో దివారాత్రములు ధ్యానిస్తూ ఆయన వాక్యమును చదివి రాత్రి పడుకోవడానికి వెళ్లాను. ఒక దినము ఒక కల దాంట్లో బంగారము, వెండి, నవరత్నాలు అన్ని విలువ కలిగిన వస్తువులు పెద్ద రాసిగా వేయబడి ఉన్నాయి. మరొకవైపు సాధారణ ఒక వ్యక్తి నిలబడి ఉన్నారు. ఆయనకు, ఆ వస్తువుల మధ్యలో మనుషులు గుంపులుగా నిలబడి ఉన్నారు. దాంట్లో నేను ఒక వ్యక్తిగా ఉన్నాను. ఆ జన సమూహమును చూసి భూమి దాని యొక్క సంపూర్ణత నావి. ఆ పక్క విలువ గలిగిన వస్తువులు ఈ పక్క నేను. ఈ రెండింటిలో దేనిని కోరుకుంటున్నారు దాన్ని ఎంచుకొని మీకు సొంతం చేసుకొనుడి అన్నారు. ఆ మనుషుల గుంపు వస్తువుల వైపు పరిగెత్తింది. కొన్ని క్షణాల్లో కేకలు పెద్దపెద్ద శబ్దములతో గందరగోళంగా ఆ ప్రదేశం అంత మారిపోయింది. నేను నిశ్శబ్దంగా నిలబడి ఉన్నాను. ఆయన నన్ను చూసి ఎందుకు నిలబడి ఉన్నావు నీవు కూడా నీకు అవసరమైనదాన్ని వెళ్లి తీసుకో అని అన్నారు. నా హృదయమైతే భూమియు దాని సంపూర్ణతయు దేవునిది అని చెప్పిన ఆయననే నేను సొంతము చేసుకోవాలి అని ఆలోచించాను. కల నుండి హఠాత్తుగా లేచాను. 

 

యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకంలో జీవించిన దినాలలో ఆయన ఒక గ్రామంలోనికి ప్రవేశించారు. అక్కడ మార్తా అనే పేరు గల ఒక స్త్రీ ఆయనను తన ఇంటిలో చేర్చుకున్నారు. ఆమెకు మరియ అని ఒక సహోదరి ఉండేది. ఆమె యేసయ్య పాదముల కూర్చొని ఆయన మాటలు వింటూ ఉంది. మార్తా అయితే అనేక పనులు చేసి చాలా ప్రయాస పడుతూ ఉంది. అవసరమైనది ఒక్కటే మరియ తన యొద్ద నుండి ఎవరు తీసివేయలేని విలువైన కార్యాన్ని ఎంచుకున్నది అని ప్రభువు మరియను పొగిడారు. 

 

ప్రియమైన వారలారా భూమియు దాంట్లో గల సంపూర్ణత దేవునిది. ఆయన చేత సమస్తము సృష్టించబడి ఉన్నది. సమస్తము ఆయనలో నిలిచి ఉన్నది. ధనాశ గలవారీగా విలువగలిగిన యేసయ్యను విడిచిపెట్టకూడదు. లోక ఆశలు యేసయ్య యొద్ద నుండి దూరము చేసి విలువ కలిగిన దీవెనలు కోల్పోయినట్లు చేస్తుంది. యేసయ్య గురించి ఉన్న జ్ఞానమే మనము సొంతము చేసుకొనినయెడల అదే విలువైన ఆస్తి కాబట్టి ఆయన పాదముల చెంత కూర్చొని యేసయ్య యొద్ద మేలైన వాటిని వెతుకుదాం. ఉన్నతమైన వాటిని వెతుకుదాం. శాశ్వతమైన నిత్య జీవము మనకు పరలోకములో ఉంచబడి ఉన్నది. కాబట్టి దాని గ్రహించిన వారిగా మనము ముందుకు వెళ్దాం. 

- బ్రదర్. కే. ఎస్. మాణిక్యవాసవన్

 

ప్రార్థన అంశం:-

మనతో కలిసి ఉన్న పార్ట్నర్షిప్ మిషనరీలను దేవుడు బలముగా వాడుకునేటట్లు ప్రార్థిద్దాం.

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

www.vmm.org.in

ఈమెయిల్: info@vmm.org.in

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al holiganbet giriş holiganbet casibom bets10 extrabet royalbet süperbetin casibom giriş casibom jojobet giriş casibom milanobet piabellacasino betpas bahiscasino atlasbet betpas casinoroyal bahiscasino ngsbahis betplay holiganbet jojobet casibom holiganbet jojobet casibom vaycasino romabet