Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 21.06.2024
Share:

By Village Missionary Movement

Friday, 21-Jun-2024

దిన ధ్యానము(Telugu) 21.06.2024

 

అంశం:- సమర్పణ 

 

"లేచి పట్టణములోనికి వెళ్లుము, అక్కడ నీవు ఏమి చేయవలెనో అది నీకు తెలుపబడునని చెప్పెను" - అపో.కార్యములు 9:6 

 

3 దిక్కులు కూడా పర్వతములతో ఆవరించి బడి ఉన్న గ్రామము ఒకటి ఉన్నది. ఆ కొండ దిగు భాగమున ఒక డ్యామ్ కట్టబడి ఉన్నది. వర్షాకాలంలో ఆ డ్యామ్ నీటితో నిండి ఒక చిన్న సముద్రం వలె కనిపిస్తూ ఉంటుంది. దాన్ని చూడ్డానికి చాలా ఆకర్షణీయంగా ఉంటుంది కారణము ఒక చిన్న కాలువ దాని ప్రారంభము ఒక విస్తారమైన బలములో వస్తున్న చిన్న ఊట నుండి ప్రారంభమవుతుంది. వర్షాకాలంలో చాలా ఎక్కువగా వచ్చిన ఆ కాలువ నీరు డ్యాముకు నీరు తీసుకువస్తుంది. ఆ విధంగా డ్యాములో నీరు ఎక్కువవుతుంది. అనేక పోలములకు ప్రయోజన కరముగా మారుతుంది. ప్రజలకు అవసరమైన నీళ్లు దొరుకుతున్నాయి. ఆ కాలువలు ఎక్కడెక్కడొ గట్టు లేకుండా చెదిరి ఉంటే ఆ నీరు ఏమాత్రం ప్రయోజనంగా ఉండదు. 

 

కొత్త నిబంధన గ్రంధంలో సౌలు అనే యవనస్తుడు కూడా తనకు ఇష్టం వచ్చినట్లు అన్ని దిక్కులో ప్రయాణం చేశాడు. పారంపర్యమైన న్యాయముల కొరకు భక్తి గలవాడై పౌరుషముతో సంఘమును హింసిస్తూ జీవిస్తూ ఉన్నాడు. ఎవరికి ప్రయోజనం లేనిదిగా ఆయన జీవితం ఉండేది కానీ ఆకాశము నుండి వెలుగును, స్వరాన్ని విన్నప్పుడు ప్రభువా నేనేమి చేయాలి అని నీ చిత్తమై ఉన్నది అని అడిగి తెలుసుకొని తన కొరకు ఉన్న ప్రణాళికను ఎరిగి అన్యులకు సువార్త ప్రకటించుటకు ఆయన ముందుకు వెళ్లారు. తన జీవితాన్ని దర్శనమునకు తగిన విధముగా సమర్పించుకున్నారు. ఆ చిన్న సమర్పణ పౌలును ఇన్ని దేశములకు సువార్తను చేపడుటకు నడిపించింది. బైబిల్లో ఉన్న ఇన్ని పత్రికల ద్వారా ఈ దినం వరకు మనతో మాట్లాడుతూ ఉన్నారు. క్రీస్తు కొరకు ఇంత ప్రయాస పడడానికి అదే కారణమైనది. అది మనకు కూడా ప్రయోజనకరంగా ఆయన జీవించి ఆయన వెళ్లారు. ధైర్యముతో నన్ను వెంబడించండి అని చెప్పే విధంగా జీవించారు. ఆ కాలువ అనేక దిక్కులకు వెళ్లి ఉంటే ఎలాంటి ప్రయోజనం లేదు అలాగే దాని ఫలితాన్ని కూడా అనుభవించలేము. సరైన మార్గంలో దాని మళ్లించేటప్పుడు దాని యొక్క ఫలితాన్ని సంపూర్ణంగా పొందుకుంటున్నాం. 

 

ప్రియమైన వారలారా! ఈ లోకంలో దేవుని క్రియలు మనలో వ్యక్తపరచడానికి మన బాధ్యత ఏమిటి అని గ్రహించుకోవాలి. ఈ దినము మనం ఆయన చిత్తాన్ని చేయుటకు సమర్పించుకున్నప్పుడు దేవుని యొక్క కృపను, దయ అనే ఊట మనలోనికి వచ్చి ఆత్మల దప్పికతో నింపబడదాం. ఆ ఆత్మల దప్పికే మనలను యేసుక్రీస్తు అనే ఆత్మ సంపాదికుని వద్దకు మనల్ని తీసుకుని వెళుతుంది. ఆయన సహాయముతో అనేక ఆత్మలను ఆయన సన్నిధిలో చేర్చడానికి ఆత్మల పట్ల ఉన్న భారమే సహాయం చేస్తుంది.

- సహోదరి. ఏ బ్యూలా గారు 

 

ప్రార్థన అంశం:-

మన క్యాంపస్ లో జరుగుతున్న స్వస్థత ఆరాధనలో అనేకులు పాల్గొనేటట్లు ప్రార్థిద్దాం.

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

www.vmm.org.in

ఈమెయిల్: info@vmm.org.in

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al