Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 20.06.2024
Share:

By Village Missionary Movement

Thursday, 20-Jun-2024

దిన ధ్యానము(Telugu) 20.06.2024

 

అంశం:- దేవుని కృప 

 

"యెహోవా కృపగలవాడు ఆయన వాత్సల్యత యెడతెగక నిలుచునది గనుక మనము నిర్మూలము కాకున్నవారము" - విలాపవాక్యములు 3:22

 

మనం అనుదినము దేవుని కృపను రుచి చూస్తూ వస్తున్నాం. ఆయన హస్తము మనల్ని కాపాడుతుంది. ఆయన రెక్కల కింద మనకు ఆదరణ. దేవుడు పట్టణమును కాపాడని యెడల కాపలాదారుడు వేచి ఉండటం వ్యర్థము (కీర్తన 127:1) అనే వాక్యం ఎంతో నిజమైనది. 

 

గడిచిన సంవత్సరము డిసెంబర్ నెలలో పెద్ద వరదలు వచ్చాయి. అనేక శ్రమలను తీసుకువచ్చింది. మా ఊరైనా తిరునల్వేలి చాలా నాశనమునకు గురైంది. అనేకుల వారి ఆస్తులు పోగొట్టుకున్నారు. దాంట్లో ఇబ్బంది పడిన వారిలో నా కుమార్తె యొక్క కుటుంబం కూడా ఉంది. ఆదివారం ఆరాధన ముగించుకుని నా కుమార్తె ఇంట్లోకి సంతోషంతో వెళ్లాను. వర్షం పడుతూనే ఉంది. ఆమె ఇల్లు ఉండిన స్థలము లోతైన ప్రాంతం కాబట్టి వర్షపు నీళ్ళు చాలా వేగముగా వరదలు వలె ఇంటికి వచ్చాయి. హఠాత్తుగా వరద నీరు ఇంట్లోకి రావడం ప్రారంభించింది ఆమె నడిపిస్తున్న హాస్టల్ లో పిల్లలు, చిన్న పిల్లలు పెద్దలు మొత్తం 25 మంది మేడ పైకి వెళ్ళాము. మెడ మునిగేంత వరకు నీళ్లు పెరిగాయి. ఫైర్ సర్వీస్ వారికి ఫోన్ చేసి వారి యొక్క సహాయముతో అక్కడ ఉండి బయటపడ్డాము. మూడు గంటల పోరాటం తర్వాత నా ఇంటికి నుండి బయటికి జాగ్రత్తగా వచ్చి చేరుకున్నాం. కట్టుకున్న బట్టలతో బయటకు వచ్చిన వారికి ఒక వైద్యుని సహాయము ద్వారా ఆహారము వస్త్రము ఇవ్వబడి ఆదరించబడడం. 

 

వరదలు ఎక్కువైనప్పటికీ హృదయంలో నిరీక్షణ కదలనిది అనే ఒక పాట ఉన్నది. దానికి తగ్గట్టుగా యేసు ఆదరణగా మనకు అనుకూలమైన సహాయకుడిగా ఉన్నారు. మీరు నీళ్లను దాటేటప్పుడు నేను మీతో ఉంటాను అనే వాక్యము ఎంత నిజమైనది ఆయన మనతోనే ఉన్నారు. 

 

నా ప్రియమైన వారలారా! యోబు భక్తుడు తన కార్యములు కోల్పోతున్నప్పుడు కూడా బైబిల్ లో చూసినప్పుడు మనము కోల్పోయిన కార్యాలను మనం తలచుకొని మనము ముందుకు వెళ్లేటప్పుడు మన కొరకు జీవమును ఇచ్చిన యేసయ్య మన కొరకు సమస్తాన్ని చేయగలరు. మనము నాశనము కాకుండా ఉండుట కేవలము దేవుని కృపవలన. ఆయన కనికరమునకు ఎల్లలు లేవు. ఆపత్కాలమందు మేము ఆయనకు మొరపెట్టినప్పుడు ఆయన ద్వారా మేము కాపాడబడినట్లుగా మీరు కూడా దేవుని వైపు చూడండి దేవుని ద్వారా విడిపించబడతారు. దేవున్ని ఆదరణగా పట్టుకున్నప్పుడు మీరు గొప్ప మేలుపొందుకుంటారు. 

- శ్రీమతి. భువన ధన బాలన్ గారు 

 

ప్రార్థన అంశం:-

ఉత్తర భారత రాష్ట్రాలలో చర్చిలు లేని స్థానాల్లో చర్చిలు కట్టబడేటట్లు ప్రార్థిద్దాం.

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

www.vmm.org.in

ఈమెయిల్: info@vmm.org.in

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al