Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 19.06.2024
Share:

By Village Missionary Movement

Wednesday, 19-Jun-2024

దిన ధ్యానము(Telugu) 19.06.2024

 

అంశం:- చూచుచున్న దేవుడు 

 

"యెహోవా కన్నులు ప్రతి స్థలముమీద నుండును చెడ్డవారిని మంచివారిని అవి చూచుచుండును" - సామెతలు 15:3 

 

ఒకరోజు ఒక మనిషి తోటలో గడ్డి కోయడానికి వెళ్త ఉన్నాడు అప్పుడు ఆయన కళ్ళు ఆ తోటలో గల టమాట పండ్ల పైన పడింది. వెంటనే తన కుమారుడిని పిలిచి నేను వెళ్లి ఆ టమాటా పండ్లలో కొన్ని తెంపి తెస్తాను ఎవరైనా వస్తున్నారా? చూస్తున్నారా చూసి చెప్పు అని చెప్పాడు. అప్పుడు ఆ చిన్న బాలుడు నాన్న నాన్న ఒకరు చూస్తున్నారు అని చెప్పాడు. వెంటనే భయపడిపోయిన తండ్రి ఎవరు నన్ను చూస్తున్నారని చుట్టూ తిరిగి చూశాడు లేదు నాన్న పైనుండి దేవుడు నిన్ను చూస్తున్నారు అని అన్నాడు. ఆ దినం నుండి ఆ మనిషి దొంగతనం చేయడం మానేశాడు. అవున దేవుడు అన్ని చోట్ల ఉన్నారు. గాలిని మనం చూడలేకపోయినప్పటికీ దానిని గ్రహిస్తున్నాం అలానే దేవుడిని మనం చూడలేక పోయినప్పటికీ ఆయన ఎప్పుడూ మనతో ఉన్నారు. ఆయన మనల్ని చూస్తూనే ఉన్నారు. 

 

బైబిల్లో అబ్రహాము భార్య ఆయిన సారాకు పిల్లలు లేరు. సారా తన దాసి అయిన హాగరు ద్వారా సంతానము రప్పించుకోవాలని చూసింది. సారా అబ్రహముకు హాగరు ని భార్యగా చేర్చుకొని హాగరు గర్భవతిగా అయితే ఒక బిడ్డను ఇస్తుంది అని సారా తలంచి హగరును అబ్రహముకు భార్యగా ఇచ్చింది. కానీ బిడ్డను కన్న తర్వాత హగరు సారాని అశ్రద్ధ చేయడం వల్ల దాన్ని తట్టుకోలేనటువంటి సారా అబ్రహాముకు హాగరును పంపివేమని చెప్పింది. వెంటనే అబ్రహాము నీకు ఏమి తోచుచున్నదో దాన్ని చేయమని చెప్పి పంపించాడు. అయితే అరణ్యంలో దూత హాగరును చూచి హగరు ఎక్కడి నుంచి వస్తున్నావు? ఎక్కడికి వెళ్తున్నావ్? అని అడుగుతున్నారు. అందుకామె నేను నా యజమానురాలైనా సారాను విడిచి పారిపోతున్నాను అని అన్నది. అప్పుడు దేవుని దూత ఆమెతో సారా యొద్దకు తిరిగి వెళ్ళాము ఆమె చేతి క్రింద ఒదిగిండు అన్నారు. హగరు నీవు నన్ను చూచుచున్న దేవుడువని ఆయనకు పేరు పెట్టింది. 

 

అవును దేవుడు మనల్ని చూసే దేవుడు. ఆయన ఆకాశము నుండి మనలను చూస్తూనే ఉన్నాడు. మనం చేస్తున్న ఎలాంటి కార్యామైన ఆయనకు మరుగుగా ఉండలేదు. మన జీవితంలో సమస్త కార్యములను చూస్తున్న దేవుడు ఆయనే. ఆయన మనం చేసే కార్యాలు మాత్రమే కాదు మన తలంపుల్ని కూడా చూస్తున్నాడు. మన హృదయములో మరుగైనది కూడా ఆయన దృష్టి ఎదుట మరుగైనది కాదు. మన యొక్క కూర్చునుట లేచుటను గ్రహించుచున్నారు. కాబట్టి మనం చేసే కార్యాలన్నీ కూడా దేవునికి ప్రియమైనదిగా ఉండాలి. దేవుడు మనల్ని దీవిస్తారు. 

- సిస్టర్. హెబ్సి గారు 

 

ప్రార్థన అంశం:-

ఆగస్టు నెలలో జరగబోతున్న యవ్వనస్తుల ఉజ్జీవ కూటము కొరకు ప్రార్థిద్దాం.

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

www.vmm.org.in

ఈమెయిల్: info@vmm.org.in

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al holiganbet giriş holiganbet casibom bets10 extrabet royalbet süperbetin casibom giriş casibom jojobet giriş casibom milanobet piabellacasino betpas bahiscasino atlasbet betpas casinoroyal bahiscasino ngsbahis betplay holiganbet jojobet casibom holiganbet jojobet casibom vaycasino romabet