Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 15.06.2024
Share:

By Village Missionary Movement

Saturday, 15-Jun-2024

దిన ధ్యానము(Telugu) 15.06.2024

 

అంశం:- స్తుతించుడి 

 

"నా నిమిత్తము నేను నిర్మించిన జనులు నా స్త్రోత్రమును ప్రచురము చేయుదురు" - యెషయా 43:21 

 

50 సంవత్సరాలుగా మంచంలోనే శ్రమను అనుభవించిన హన్నా హికిన్స్ ఒక వింతైన ఎముకల రోగముతో బాధపడింది. ఆమె ఎప్పుడూ దేవుని స్తుతి చెల్లించే వ్యక్తిగా తన మంచాన్ని కృతజ్ఞత చెల్లించే మూల అని పిలిచేవారు. 200కు పైగా ఉన్న వ్యక్తుల యొక్క పేర్లను ప్రార్థన అంశములుగా రాసి ప్రార్థించే వ్యక్తిగా ఉన్నారు. క్రీస్తులో లోతైన అనుబవముగల వారిగా దేవున్ని స్తుతించే వ్యక్తిగా జీవించారు. తన యొక్క 77వ సంవత్సరంలో మేఘము మరియు సూర్య ప్రకాశము అనే పుస్తకాన్ని రాశారు. మనము దేవున్ని స్తుతించేటప్పుడు మన యొక్క బలహీనతలు మాత్రమే కాదు మన యొక్క పరిస్థితిలు కూడా మారిపోతాయి. 

 

కొత్త నిబంధనలో అపోస్తులుడైన పౌలు సిలను మనం ఎరుగుదము. సువార్త ప్రకటించడం వలన పౌలు సిల చరసాలలో బంధింపబడ్డారు. చెరసాలలో పెట్టి వాళ్లను జాగ్రత్తగా ఉంచుమని కాపలాదారులకు చెప్పబడింది. వాడు పౌలును సిలను లోపల చెరసాల గదిలో పెట్టి ఆయన కాళ్లకు బొండను బిగించి పెట్టారు. మధ్య రాత్రి వేళలో పౌలు సిలా ప్రార్థన చేసి దేవుని స్తుతిస్తూ పాడుతూ ఉన్నారు. హఠాత్తుగా చెరసాల పునాదులు కదిలినట్లు భూకంపం కలిగింది. అందరి యొక్క బంధకాలు ఊడిపోయాయి. ఆ దినమే వాళ్లను కాపలా కాసిన ఆ చెరసాల అధిపతి రక్షింపబడ్డారు. 

 

ప్రియమైన వారలారా పౌలు సిలా చెరసాలలో స్తుతించి దేవుని యొక్క మహిమను అనుభవించారు. పరలోకములో మనము చేయవలసిన ఒకే ఒక కార్యము కలదు అది దేవుని స్తుతించుటయే. కాబట్టి లోకంలో మనం ప్రతి ఒక్కరము ప్రతి దినము దేవుని యొక్క మహిమను ఆయన అతిశయము గల నామములను చెప్పి స్తుతించాలి. ప్రతి దినము దేవుని యొక్క మహిమను ఆయన అతిశయముగల నామమును చెప్పి స్తుతించాలి. క్రైస్తవులమైన మనము అనేక సందర్భాల్లో ఆయనను స్తుతించుట మర్చిపోతున్నాం. అందుకు గల కారణం మన సమస్యలు పోరాటాలు దేవుని స్తుతించుటకు మనకు మనసునివ్వదు. ప్రతి హృదయ సమస్యలు, పోరాటాలతో నిండిన హృదయములో కూడా దేవున్ని స్తుతించుట నేర్చుకుందాం. ఇంతవరకు దేవుని నుండి పొందుకున్న ప్రతి ఒక్కదాని గురించి దేవుడు చేసిన ప్రతి కార్యము గురించి దేవున్ని స్తుతిద్దాం. మన జీవితంలో ఈ క్షణం వరకు మనల్ని సజీవులుగా ఉంచిన గొప్ప దేవుణ్ణి తలచుకొని ఆయనను స్తుతిద్దాం. అందుకొరకే మనము ఆయన చేత ఈ లోకంలో సృష్టించబడి ఉన్నాం. 

- శ్రీమతి. రూబీ అరుణ్ గారు 

 

ప్రార్థన అంశం:-

313 మండలాల్లో చిన్నపిల్లల క్యాంపులు పెట్టబడినట్లు ప్రార్థిద్దాం.

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

www.vmm.org.in

ఈమెయిల్: info@vmm.org.in

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al