By Village Missionary Movement
Thursday, 13-Jun-2024దిన ధ్యానము(Telugu) 13.06.2024
అంశం:- ఆలస్యమైనను
“ఆ దర్శన విషయము నిర్ణయకాలమున జరుగును, సమాప్త మగుటకై ఆతురపడుచున్నది, అది తప్పక నెరవేరును, అది ఆలస్యముగా వచ్చినను దానికొరకు కనిపెట్టుము, అది తప్పక జరుగును, జాగుచేయక వచ్చును” - హబక్కూకు 2:3
రక్షింపబడిన ఒక స్త్రీ రక్షింపబడని తన భర్త కొరకు తరచుగా ప్రార్థిస్తూ ఉండేది. కానీ ఆ ప్రార్ధనకు జవాబు వచ్చినట్లు లేదు ఆమె భర్త కూడా రక్షింపబడుటకు ఎలాంటి ఆనవాళ్లు కనబడలేదు. ఒక దినము జరిగిన కారు ప్రమాదంలో ఆ స్త్రీ యొక్క భర్త కూడా చనిపోయాడు. భర్తను కోల్పోయిన దుఃఖము ఒకపక్క ప్రార్థనకు జవాబు రాలేదు అని దుఃఖము మరియొకపక్క. బైబిల్ ను ఆమె మర్చిపోయింది ప్రార్థన విడిచింది ప్రభువును విడిచి దూరంగా వెళ్లిపోయింది. దినములు గడిచాయి ఐదు సంవత్సరాల తర్వాత తన భర్త యొక్క స్నేహితుడు మార్గమధ్యంలో కలవడం జరిగింది. ఆ స్నేహితుడు ఆమెతో మాట్లాడారు. మీ భర్త ఆ ప్రమాదం జరిగినా ఆ దినము ఆయన కారులో నన్ను ఎక్కించుకొని కొన్ని గంటల సేపు వెళ్లడం జరిగింది. నా సాక్షాన్ని, ప్రభువు ప్రేమను అతనికి చెప్పాను శ్రద్ధగా ఆలకించాడు. వెళ్లిన దారిలో కారును ఆపి పాపమును ఒప్పుకొని కన్నీటితో ప్రార్థించాడు. నేను కారులో నుండి దిగినప్పుడు రక్షణ ఆనందము ఆయన ముఖములో చూడగలిగాను కానీ ఆ దినమే ఆయన కారు ప్రమాదంలో ప్రభువు చెంతకు చేరారు అని విన్నాను. దీనిని మీకు చెప్పాలి అని ప్రయాసపడ్డాను. ఈ దినమే అవకాశం దొరికింది అన్నారు. దానిని విన్నప్పుడు ఆమె యొక్క సంతోషానికి హద్దులు లేవు. మరలా దేవుని ప్రేమించడం ప్రారంభించింది.
బైబిల్లో కూడా అబ్రహం 75 సంవత్సరమందు సంతానం నీ పొందుకుంటావు అని దేవుడు వాగ్దానం ఇచ్చారు. వృద్ధాప్యములో సారా యొక్క శరీరం బలహీనత అన్నిటీలో అబ్రహాము ఎదురుచూస్తూ ఉన్నారు. తనకు 100వ సంవత్సరంలో ఇస్సాకును కనుటకు దేవుడు కృపను చూపించారు. అలాగే ఏలియా సేవకుడు ఎలీష రెండింతల ఆత్మను పొందుకుంటావు అని వాగ్దానం పొందుకొని 13 అద్భుతాలు ఎలీషా జీవితంలో జరిగాయి. ఒక కార్య మాత్రం మిగిలి ఉండేది ఎలీషా మరణించారు కూడా కానీ ఎలీషా సమాధిలో మరణించిన ఒక యవ్వనస్తుడిని పెట్టిన వెంటనే ఆ యవ్వనస్తుల ప్రాణంతో తిరిగి లేచాడు (2 రాజులు గ్రంధంలో 13: 21). దేవుని వాగ్దానంలో ఆలస్యమైను కచ్చితంగా నెరవేరుతాయి.
నా ప్రియమైన వారలారా అనేక దినములుగా ప్రార్థించి వస్తున్నాను. దేవుని యొక్క వాగ్దానం నెరవేరుటకు ఎలాంటి ఆనవాళ్లు కనబడలేదు అని బాధపడుతున్నారా? దేవుడు మీ కొరకు కలిగి ఉన్న ప్రణాళిక గొప్పది అది మారనిది తగిన సమయంలో మీరు మీ సొంత కనులారా, చెవులారా చూస్తారు వింటారు. మీ యొక్క హృదయము సంతోషముతో ఉప్పొంగుతుంది నిరుత్సాహపడకండి అద్భుతాలు చూస్తారు. హల్లెలూయ!
- సిస్టర్. మంజుల గారు
ప్రార్థన అంశం:-
ఉత్తర భారత దేశంలో పరిచర్య చేస్తున్న మిషనరీల సంరక్షణ కొరకు ప్రార్థిద్దాం.
*Whatsapp*
ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.
www.vmm.org.in
ఈమెయిల్: info@vmm.org.in
Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin
విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001
ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250