Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 11.06.2024
Share:

By Village Missionary Movement

Tuesday, 11-Jun-2024

దిన ధ్యానము(Telugu) 11.06.2024

 

అంశం:- లెమ్ము తేజరిల్లుము

 

"నీకు వెలుగు వచ్చియున్నది, లెమ్ము, తేజరిల్లుము యెహోవా మహిమ నీమీద ఉదయించెను" - యెషయా 60:1

 

అమెరికా రాష్ట్రపతులుగా ఉండిన అబ్రహం లింకన్, జార్జ్ వాషింగ్టన్, జాన్ కెనడి అనేవాళ్ళు తమ ఆత్మీయ జీవితంలో దేవునితో ఉండిన ఐక్యత వలన హెచ్చింపబడి ప్రకాశించి ఈ జన్మ వరకు మారని ప్రఖ్యాత గలవారీగా చరిత్రలో నిలిచారు. 

 

మిషనరీలు కూడా అనేక వేలకొలదిమంది ప్రపంచమంతా ప్రకాశించేవారిగా కనబడుతున్నారు. అనేకులు మరుగైనప్పటికీ వాళ్ళు ప్రఖ్యాతి మాత్రము మార్పు చెందకుండా మరుగై పోకుండా వాళ్ళ సత్క్రియల వలన ప్రకాశవంతంగా ఉన్నది. 

 

బైబిల్లో కూడా పాత నిబంధన గ్రంథములో దేవుని కొరకు ప్రకాశించిన వాళ్ళు హెబ్రీయులకు రాసిన పత్రిక 11 వ అధ్యాయంలో విశ్వాసుల పట్టికలో పరిశుద్ధాత్మ దేవుడు రాసిపెట్టి ఉన్నారు. వీళ్ళు తర్వాత ఈ దినము వరకు ఉన్న విశ్వాసులు యేసుక్రీస్తును తమ హృదయములో ప్రకాశింపజేసి ప్రకాశించే వెలుగుగా ఉన్నారు. లెమ్ము ప్రకాశించుము అని తమ ఆత్మీయ జీవితములను కాపాడుకున్న వారు ఇతరుల యొక్క ఆత్మను కూడా కాపాడుతున్న వారిగా ఉన్నారు. 

 

కెవిన్ కట్టర్ అనే ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఫోటోగ్రాఫర్ చాలా చక్కటి ఫోటో ఒకటి తీశారు. నోబెల్ ప్రైజ్ కు సమానమైన బహుమానాన్ని పొందుకున్నాడు. ఆ ఫోటోను చూసినవాడు తరువాత ఏమి జరిగింది అని అడిగిన ప్రశ్నకు లోకమంతటి నుండి అడుగుతూ ఉన్నారు. ఆ ప్రశ్నకు జవాబు చెప్పలేని కెవిన్ కట్టర్ బహుమానాన్ని పొందుకున్న రెండు నెలల్లో ఆత్మహత్య చేసుకున్నాడు. ఆయన రాసిపెట్టినది నన్ను అందరూ క్షమించండి కారణము నేను తీసిన ఫోటో చూడండి ఒక చిన్నది శరీరమంతా ఎండిపోయి అస్తిపంజరం వలె కనబడింది. ఆ చిన్నది ఉన్న కొంత దూరంలో చనిపోయిన వాళ్లను తినే రాబందు ఒకటి వేచి ఉన్నది. ఆకలి వలన మరణించే గుంపులో ఆ చిన్నది ఉన్నది. ఆమెను కాపాడుటకు నేను ఎలాంటి ప్రయత్నం చేయలేదు కానీ ఫోటో తీయడం మాత్రమే ప్రాముఖ్యంగా పెట్టుకున్నాను అని రాసి పెట్టి తన జీవితాన్ని ముగించుకున్నాడు. కావున మన ఆలోచన దేవునికి తగినట్టుగా దేవుని ఆలోచనలకు తగినట్టుగా ఆలోచించకుండా శరీరానుసారముగ కనబడిన ఎడల మన వెలుగును సాతానుడు ఆర్పి వేసేస్తాడు కానీ దేవుడు అయితే మన వెలుగు ప్రకాశించాలి అని కోరుకుంటున్నారు. 

 

ఈ దినము మనలో ఎవరిని మ్రింగుదమా అని సాతాను వేచి ఉన్న దానిని చాలా చక్కగా ప్రసంగం చేస్తూ ఉన్నాము కానీ వాడి వద్ద నుండి ప్రజలను కాపాడుటకు ప్రయాస పడలేదు. నీ విశ్వాసము పతనమవ్వకుండా నేను మీ కొరకు ప్రార్థన చేశాను అని పేతురు కొరకు ప్రార్థించిన యేసయ్య వలె జీవిద్దాం. లోకానికి వెలుగుని ఇచ్చేవారుగా మారదాం. 

- ఎస్. శామ్యూల్ మొరిష్ గారు 

 

ప్రార్థన అంశం:

కన్మనీ పిల్లై ఏసువు గాహే అనే పరిచర్యలో కలిసి ఉన్న యవ్వనస్తుల గురించి ప్రార్థిద్దాం.

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

www.vmm.org.in

ఈమెయిల్: info@vmm.org.in

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al holiganbet giriş holiganbet padişahbet bets10 extrabet royalbet süperbetin padişahbet betcio royalbet casinoroyal queenbet bahiscasino betcio bahiscasino atlasbet padişahbet betpas bahiscasino celtabet queenbet casibom jojobet jojobet casibom holiganbet restbet safirbet