Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 10.06.2024
Share:

By Village Missionary Movement

Monday, 10-Jun-2024

దిన ధ్యానము(Telugu) 10.06.2024

 

అంశం:- భారము 

 

"ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘమువలె మనలను ఆవరించియున్నందున" - హెబ్రీయులకు 12:1 

 

ఒక గ్రామంలో వృద్ధురాలైన ఒక స్త్రీ తన తలపైన గడ్డి మోపును పెట్టుకుని మోస్తు నడుస్తూ వస్తున్నారు. అప్పుడు ఆ మార్గము గుండా ఒక ఎద్దుల బండి వచ్చింది. వెంటనే ఆ ఎద్దుల బండి అతను ఆమెను బండి ఎక్కమని చెప్పారు. ఆమె ఆ బండి ఎక్కింది. అయినప్పటికీ ఆమె తల పైన గల ఆ గడ్డిమోపును కింద పెట్టలేదు. దీనిని చూచిన ఆ ఎద్దుల బండి యజమాని నవ్వుతూ అమ్మ నీ తల పైన ఉన్న ఆ గడ్డిమోపును బండి పైన పెట్టండి అని చెప్పిన ఆమె వినలేదు. తల పైన పెట్టుకునే ప్రయాణం కొనసాగించింది. 

 

పిల్లలు లేని హన్న ఆమె తోబుట్టువైన పెన్నిన్నాతో చాలా వేదనలు అనుభవించింది. దుఃఖకరమైన మాటలు చేత బాధపడుతూ తినకుండా ఏడుస్తూ ఉంది. ఇలా కన్నీటితో భారముతో ఆమె యొక్క దినములు గడిస్తూ ఉన్నాయి. దేవాలయానికి వెళ్ళడానికి అవకాశం దొరికింది దేవుని సన్నిధిలో తన హృదయాన్ని సమర్పించింది, భారాన్ని దించింది. అప్పుడు ఆమె మరలా దుఃఖముతో ఉండలేదు. అవును హన్న తన యొక్క భారాన్ని దేవుని సన్నిధిలో చెప్పేసింది. దేవుని పైన ఆనుకొని సహనముతో వేచి ఉంది. దేవుడు ప్రవక్త అయిన సమూయేలను కనుటకు దేవుడు సహాయం చేశారు. దాని తర్వాత కుమారులు, కుమార్తెలను ఆమె కని దేవుని స్తుతించింది. 

 

దీనిని చదువుతున్న మనము మన యొక్క జీవితంలో ఉన్న భారాలను మనమే మోస్తున్నమా లేదా మన ప్రభు యొక్క పాదం చెంత మనము పెట్టి ఉన్నామా? అవును కీర్తన 55:22లో దేవుని మీద నీ భారాన్ని పెట్టుము ఆయన నిన్ను ఆదరించును, నీతిమంతుడు ఎన్నడూ కదల్చబడడు అని వాక్యం చెబుతూ ఉంది. అవును మన జీవితంలో కనబడుతున్న అప్పుల బాధలు, రోగాలు పేదరికం ఇంకా చెప్పలేని ఎన్నో సమస్యలు ఉండవచ్చు కానీ ఎన్నడూ నిరుత్సాహపడిపోకండి. మిమ్మల్ని తన యొక్క అరచేతుల్లో చెక్కుకున్న దేవుడు ఒకరు ఉన్నారు. ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన మీద మీ చింత యావత్తు పెట్టండి మీ భారాన్ని ఆయనకు ఇచ్చి వేయుడి అప్పుడు మరలా మీరు దుఃఖముతో ఉండవలసిన అవసరం ఉండదు. ఆయన యెహోవా యిరేగా ఉండి అన్నింటినీ చూసుకుంటారు. 

- శ్రీమతి. నిరోషా ఆల్విన్ గారు 

 

ప్రార్థన అంశం:-

యెహోషువా లేము కన్వీనికేల్ అనే పత్రిక ద్వారా అనేక మంది యవ్వనస్తులు దేవుని వైపు తిరుగులాగున ప్రార్థిద్దాం.

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

www.vmm.org.in

ఈమెయిల్: info@vmm.org.in

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al holiganbet giriş holiganbet padişahbet bets10 extrabet royalbet süperbetin padişahbet betcio royalbet casinoroyal queenbet bahiscasino betcio bahiscasino atlasbet padişahbet betpas bahiscasino celtabet queenbet casibom jojobet jojobet casibom holiganbet restbet safirbet