Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 09.06.2024 (Kids Special)
Share:

By Village Missionary Movement

Sunday, 09-Jun-2024

దిన ధ్యానము(Telugu) 09.06.2024 (Kids Special)

 

అంశం:- డాక్టర్ మేకన్సి 

 

ప్రత్యేకముగా చిన్న పిల్లల కొరకు

 

"నేను సువార్తను ప్రకటించుచున్నను నాకు అతిశయ కారణములేదు. సువార్తను ప్రకటింపవలసిన భారము నామీద మోపబడియున్నది. అయ్యో, నేను సువార్తను ప్రకటింపక పోయినయెడల నాకు శ్రమ" – 1 కోరింథీయులకు 9:16 

 

హలో పిల్లలు మిషనరీలు విదేశం నుండి మనదేశమునకు వచ్చి అనేక త్యాగపూరితమైన పనులు చేయుట వలనే మనము దేవుని తెలుసుకొనుటకు వీలైంది. అది మాత్రమే కాదు చదువు మరియు వైద్యరంగంలో మిషనరీలు చేత మనం పొందుకున్న కార్యములు ఒక ధన నిధి వంటివి. ఈ దినము మిషనరీలు ఏమి చేశారో తెలుసుకుందామా? 

 

 ఈరోడ్డు అనే ప్రాంతంలో యేసు క్రీస్తు ప్రేమను ప్రకటించుటకు కష్టములో ఉన్న వారికి సహాయం చేయుటకు వచ్చిన మిషనరీ ప్రాబ్ ఈయన జీవించినది 20వ శతాబ్దం. ఆ దినములలో హఠాత్తుగా రోగములు వచ్చి అనేకమంది మరణించారు. కరోనా విస్తరించిన దినాలలో మందు లేకుండా గుంపులు గుంపులుగా ప్రజలు మరణించారు కదా ఆ దినాల్లో మనకు ఎంత భయం ఉండేది? ఇంటీని విడిచి బయటకు వచ్చి ఆడుకోలేని పరిస్థితి. చాలా భయపడ్డాం కదా అయితే యేసయ్య అద్భుత రీతిలో కరోనా నుండి మనకు విడుదల ఇచ్చారు. 

 

 కానీ యేసయ్యను ఎరుగని ప్రజలు ఏమి చేశారు? మలేరియా, కలరా, ప్లేగు వంటి అనేక రోగముల చేత అనేకమంది మరణించారు దానిని చూచి వేదన చెందిన ప్రాబ్ వెల్లూరులో పనిచేస్తున్న మేకన్సి అనే డాక్టర్ని పిలిపించారు. ఎందుకో తెలుసా స్త్రీలు పురుషుల వైద్యులతో వైద్యం చేయించుకునేవారు కాదు అందువల్ల అనేక మంది ఇబ్బంది పడ్డారు. కాబట్టి స్త్రీల కొరకు స్త్రీల వైద్యురాలైన మేకన్సి పిలవబడి రాత్రి పగలు తేడా లేకుండా పనిచేశారు. ఆమెకు ఆ రోగం వచ్చేస్తుంది అని భయపడకుండా ప్రజలను వెతుక్కుంటూ వెళ్లి వారికి సహాయం చేశారు. అందువలన అనేకమంది ప్రయోజనం పొందుకున్నారు. ఆమె ఆ వైద్య సేవలను వారికి అందించి ప్రయాసపడ్డారు. ఈమె ఈరోడ్డు అనే ప్రాంతంలో 15 సంవత్సరములు పరిచర్య చేశారు. ఈమె ఆ ప్రాంతానికి వచ్చిన మొట్టమొదటి మిషనరీ. ప్రాబ్ హాస్పిటల్ రావడానికి కారణం అయ్యారు కూడా. 

 

ఏంటి పిల్లలు చక్కగా సుఖవంతమైన జీవితం జీవించి ఉన్న ఈమె దాని విడిచిపెట్టి త్యాగపూరితముగా సేవలందించిన మేకన్సి, ప్రాబ్ వీరి యొక్క జీవితం వల్ల అనేక మంది దీవించబడ్డారు కదా మరి మీరు కూడా యేసయ్యకు ప్రయోజనకరమైన వారుగా మారవచ్చు. నేను చిన్నపిల్లవాడిని నేనేమీ చేయలేను అని తలంచకండి. మీరు చేయగలిగినది యేసయ్యకు చేయండి. పక్కనే ఉన్నవారికి ఆయన గురించి చెప్పండి. సరేనా! 

- శ్రీమతి. అంబు జ్యోతి స్టాలిన్ గారు

 

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

www.vmm.org.in

ఈమెయిల్: info@vmm.org.in

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al holiganbet giriş holiganbet padişahbet bets10 extrabet royalbet süperbetin padişahbet betcio royalbet casinoroyal queenbet bahiscasino betcio bahiscasino atlasbet padişahbet betpas bahiscasino celtabet queenbet casibom jojobet jojobet casibom holiganbet restbet safirbet