By Village Missionary Movement
Saturday, 08-Jun-2024దిన ధ్యానము(Telugu) 08.06.2024
అంశం:- సర్వ శక్తి కలిగిన దేవుడు
"నీవు సమస్త క్రియలను చేయగలవనియు నీవు ఉద్దేశించినది ఏదియు నిష్ఫలము కానేరదనియు నేనిప్పుడు తెలిసికొంటిని" - యోబు 42:2
అది ఒక చిన్న గ్రామం. ఆ ఊరు రోడ్డు ప్రక్కనే ఎండిపోయిన పరిస్థితులు ఒక చెట్టు ఉంది. యవ్వనస్తురాలైన ఒక ఆమె ఆ మార్గం గుండా రోజు నడిచి వెళ్ళుట వాడుక. ఒకరోజు ఆమె ఎండిపోయిన ఆ చెట్టును చూసి నీవు నేను స్నేహితులం ఎందుకంటే నీ వల్ల ఎవరికి ప్రయోజనం లేదు, చదువు పూర్తి చేసుకొని పని లేకుండా ఉన్న నా వలన ఎవరికి ఎలాంటి ప్రయోజనం లేదు కాబట్టి నీవు నేను ఒకే గుంపు అని చెప్పింది. నెలలు గడిచాయి ఆ మార్గం గుండా వచ్చిన ఆ యవ్వనస్తురాలకి చాలా ఆశ్చర్యం అనిపించింది. ఎండిపోయిన ఆ చెట్టు చక్కగా చిగురించడం ప్రారంభించింది. దానిని చూచిన ఆమె చాలా సంతోషించింది. వెంటనే ప్రభువా ఎండిపోయిన చెట్టుని మీరు ఇంత చక్కగా అందంగా చిగురింపజేసినారు కాబట్టి నా జీవితంలో కూడా మీరు చిగురింప చేయగలరు అని నిజాయితీగా ప్రార్ధించింది. యేసయ్య ఆమె యొక్క ప్రార్థన విని ఒక సేవకురాలుగా మార్చి అనేకులకు ప్రయోజనకరమైన వ్యక్తిగా వాడుకుంటున్నారు.
బైబిల్లో కూడా మార్తా, మరియా అనేవారి యొక్క సహోదరుడు మరణించారు. కుటుంబీకులు మరియు బంధువులు అంతా అయిపోయింది అనుకున్నారు. ఏడుస్తున్న వారి వద్దకు యేసయ్య వచ్చారు. మరణించిన లాజరును మరల జీవింపజేశారు. నిరీక్షణ లేకుండా వ్యర్థముగా ఉండిన లాజరు యొక్క సహోదరీల యొక్క జీవితం చిగురించింది.
క్రీస్తు నందు ప్రియమైన వారలారా మీ జీవితంలో మనము తలంచినది జరగలేదు అని బలహీనపడే అవసరం లేదు మీ జీవితానికి తగిన జీతం లేదే నా చదువుకు తగిన పనిలేదే అని విలపించకండి. ఎండిపోయిన చెట్టుని చిగురింప చేయగలిగిన దేవుడు మీ జీవితాన్ని కూడా చిగురింప చేయగలడు. మీకు సుఖవంతమైన జీవితాన్ని చిగురింప చేయగలిగిన దేవుడు మీకు ఉన్నారు. చిగురింపజేయడం మాత్రమే కాదు ఫలం ఇచ్చి ఇతరులకు దీవెనకరముగా మారుస్తారు. ఆయనను నమ్ముతున్న అందరికీ వారి యొక్క జీవితంలో సమస్తాన్ని మన ప్రభువు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. మనము ఆయన హస్తంలో ఉన్నాం కాబట్టి చింతించవద్దు. సర్వశక్తి కలిగిన దేవుడు మనల్ని చక్కగా నడిపిస్తారు. విశ్వసించండి, అద్భుతాలను చూస్తారు.
- శ్రీమతి. అనిత అలగర్ సామి గారు
ప్రార్థన అంశం:
సి.సి.సి (చైల్డ్ కేర్ చైల్డ్) పరిచర్యలో జాయిన్ అయి ఉన్న చిన్నారుల యొక్క చదువు గురించి ప్రార్థిద్దాం.
*Whatsapp*
ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.
www.vmm.org.in
ఈమెయిల్: info@vmm.org.in
Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin
విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001
ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250