Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 07.06.2024
Share:

By Village Missionary Movement

Friday, 07-Jun-2024

దిన ధ్యానము(Telugu) 07.06.2024

 

అంశం:- ఆఖరి అవకాశం

 

"నేను సువార్తను ప్రకటించుచున్నను నాకు అతిశయ కారణములేదు. సువార్తను ప్రకటింపవలసిన భారము నామీద మోపబడియున్నది. అయ్యో, నేను సువార్తను ప్రకటింపక పోయినయెడల నాకు శ్రమ" - 1 కోరింథీయులకు 9:16

 

మీరందరూ టైటానిక్ గురించి బాగా విని ఉంటారు. మనిషి యొక్క శక్తిని మించిన శక్తి ఒకటి ఉంది అని గ్రహించిన సంవత్సరము 1912. ఎలాగైనా బ్రతికి బయటపడదామా అని అందరూ సముద్రం మధ్యలో కొట్టుమిట్లాడుతున్నప్పుడు మరణాన్ని చూచి భయపడని ఒక మనిషి గురించి నిజ సంఘటన విందామా? 

 

ఈ క్రూరమైన సంఘటన జరిగి నాలుగు సంవత్సరాల తర్వాత టైటానిక్ నుండి బయటపడిన వారు దాని యొక్క జ్ఞాపకార్థ కూడికకు పిలవబడి ఉన్నారు. అక్కడికి వచ్చిన యవ్వనస్తుడు చెప్పిన కార్యము అందరూ హృదయాలను కదిలిసివేసింది. ఆ యవ్వనస్తుడు విరిగిపోయిన ఓడ మధ్యలో ఇరుక్కుపోయి ప్రాణాలతో పోరాడుతున్నాడు అప్పుడు ఈయనతో నావలో వచ్చిన జాన్ అనే వ్యక్తి ఈయన ప్రాణానికి కాపాడుటకు ఒక చిన్న పడవలో ఈయనను ఎక్కించారు. అంతకుముందు ఆయన అడిగిన ఒక ప్రశ్న నీవు రక్షణ పొందుకున్నావా అని అడిగారు. ఆ యవనస్తుడు లేదు అన్నాడు. వెంటనే ఆయనకు రక్షణ గురించి మీకు తెలియవలసి ఉన్నది అని చెప్పిన జాన్ ఆయనకు సువార్త ప్రకటించారు. తర్వాత మరల జాన్ ఇతరులను కాపాడుటకు వెళ్ళిపోయారు. ఆ చిన్న నావలో ఇంచుమించు ఆరుగురిని కాపాడారు చల్లని వాతావరణంలో తన బలము ఉన్నంతవరకు ఇతరులను కాపాడి ఆ నీటిలో ఆయన మునిగిపోయారు. ఆఖరి వరకు యేసయ్య గురించి చెబుతూ ప్రాణమును విడిచారు. దాని గురించి ఆ యవ్వనస్తుడు చెబుతున్నప్పుడు ఆ క్యాంపులో ఉన్న వారందరూ నిశ్శబ్దం అయిపోయారు అందరూ కన్నీరు కార్చారు. 

 

అపోస్తులుడైన పౌలు ప్రభువైన యేసుక్రీస్తును అంగీకరించిన వెంటనే ఆలోచన చేయకుండా దేవాలయంలో ప్రసంగించారు మరియు సువార్త ప్రకటించుట యొక్క గొప్పతనమును ఆయన భాగ్యం అని ఎంచుకున్నారు. కాబట్టి పౌలు సువార్త ప్రకటించుట నా మీద ఉన్న బాధ్యత సువార్త నేను ప్రకటించని యెడల నాకు శ్రమ అని రాస్తున్నారు. 

 

ప్రియమైన వారలారా! సువార్త ప్రకటించుట అనేది అందరి మీద ఉన్న బాధ్యత. ప్రభువును వెంబడిస్తున్న ప్రతి ఒక్కరూ చేయవలసిన ప్రధానమైన పని. ఇలాంటి సమయంలో మనం చెప్పే సువార్త ఇతరుల యొక్క యొక్క జీవితాన్ని కట్టగలదు. మనము మన ప్రభువు వలన ఈ దినాన్ని చివరి అవకాశంగా తలంచి యేసయ్యను ప్రకటిద్దాం. జీవిత అంచుల్లో ఉన్న వారికి మరణం వైపు పరిగెత్తుతున్న వారికి మనము సువార్త ఒక ప్రారంభముగా మారుతుంది. 

- శ్రీమతి. శక్తి శంకర్ రాజు గారు. 

 

ప్రార్థన అంశం:-

త్రిబుల్ సి (చైల్డ్ కేర్ చైల్డ్) అనే పరిచర్యలో పాల్గొనిన చిన్నారులు దీవెనలు పొందుకునేటట్లు ప్రార్థిద్దాం.

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

www.vmm.org.in

ఈమెయిల్: info@vmm.org.in

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al perabet perabet giriş safirbet safirbet giriş betasus betasus giriş virüsbet medusabahis medusabahis giriş grandpashabet grandpashabet giriş jojobet jojobet giriş vaycasino vaycasino giriş pusulabet pusulabet giriş perabet perabet giriş perabet perabet giriş matbet slot oyna perabet perabet giriş hiltonbet perabet perabet perabet betnano holiganbet galabet kalebet holiganbet