Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 05.06.2024
Share:

By Village Missionary Movement

Wednesday, 05-Jun-2024

దిన ధ్యానము(Telugu) 05.06.2024

 

అంశం:- జయ జీవితం 

 

"తాను నిలుచుచున్నానని తలంచుకొనువాడు పడకుండునట్లు జాగ్రత్తగా చూచుకొనవలెను" - 1 కోరింథీయులకు 10:12

 

జూ పార్క్ లో సింహం ఉన్నచోటలో ఒక చిన్న పాప పడిపోయింది. కన్నతల్లి ఆ బిడ్డను దాంట్లో వేస్తుందా? వేయదు కదా. అలాగైతే ఆ తల్లి తన బిడ్డను ఉంచిన స్థలము ప్రమాదకరమైన స్థలముగా ఉన్నందున ఆ పాప పడిపోయింది. 

 

పాపపు అంచుల్లో నిలబడుతున్న అనేకమంది నేను పడిపోను అని చెప్పిన వారి పరిస్థితి ఇలానే ఉంటుంది. ఐగుప్తులో నుండి బయలుదేరిన ఇశ్రాయేలీయులు దేవుడు నడిపింపును కల్లారా చూచి అనుభవించిన వారు. అయితే ఇక్కడ దేవుని విడిచి దూరంగా వెళ్లిపోయారు. దేవుని పరీక్షించుటవలన, సనుగుకొనడం వలన వారు పతనమయ్యారు. దేవుని యొక్క నడిపింపును పొందుకున్న వీళ్ళు యొక్క జీవితము పతనము అయ్యేటట్లు మన జీవితం కూడా పతనము కావచ్చు. కాబట్టి మనము హెచ్చరికతో జీవించాలి. 

 

మన జీవితంలో వచ్చే శోధనలను తట్టుకోగలిగే బలాన్ని, పాపపు శోధన నుండి తప్పించుకునే మార్గాన్ని ఏర్పాటు చేయుటకు దేవుడు శక్తిమంతుడై ఉన్నారు. మన బాధ్యత హెచ్చరికతో జీవించుటయే. పాపపు అంచుల్లో నిలబడుతూ మాట్లాడకూడదు. మన సొంత తెలివితేటలు మీద ఆధారపడి అనేక సమయాలలో పడిపోతూ ఉంటాం. ఇది మనకు తెలుసు నాశనమునకు ముందు గర్వము నడుస్తుంది (సామెతలు 16:18).

 

మనం ఎక్కడ నిలబడుతున్నాం? గర్వముతో అహంభావముతో జీవిస్తున్నామా? అనేదాన్ని నిదానించి చూసుకుందాం. పాపములో పడుతూ లేస్తూ ఉండడానికి అంటే దేవుని బలముతో జాగ్రత్తగా విజయవంతమైన జీవితం జీవించడం ప్రాముఖ్యం. నేను నీకు వ్యతిరేకంగా పాపము చేయకుండనట్లు నీ కట్టడలను నా హృదయంలో దాచుకొని ఉన్నాను (కీర్తనలు 119: 11).

 

అవును ప్రియమైన వారలారా మనము చాలా శ్రద్ధతో జీవించవలసిన ఒక కాలంలో ఉంటున్నాం. తెలివిగలవాడుగా దేవుని వాక్యము హృదయమనే పలక పైన రాయబడిన వారముగా జాగ్రత్తగా జీవించి వాడబారని జీవ కిరీటాన్ని సొంతం చేసుకుందాం. ఆమెన్! 

- శ్రీమతి. బెర్లిన్ చల్లా బాయ్ గారు

 

ప్రార్థన అంశం:-

దేబోరా ప్రార్థన గుంపులు ద్వారా జరుగుతున్న పరిచర్య గురించి ప్రార్థిద్దాం.

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

www.vmm.org.in

ఈమెయిల్: info@vmm.org.in

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al perabet perabet giriş safirbet safirbet giriş betasus betasus giriş virüsbet medusabahis medusabahis giriş grandpashabet grandpashabet giriş jojobet jojobet giriş vaycasino vaycasino giriş pusulabet pusulabet giriş perabet perabet giriş perabet perabet giriş matbet slot oyna perabet perabet giriş hiltonbet perabet perabet perabet betnano holiganbet galabet kalebet holiganbet