Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 03.06.2024
Share:

By Village Missionary Movement

Monday, 03-Jun-2024

దిన ధ్యానము(Telugu) 03.06.2024

 

అంశం:- యధార్ధత

 

"ఏలయనగా ప్రభువు దృష్టియందు మాత్రమే గాక మనుష్యుల దృష్టియందును యోగ్యమైన వాటిని గూర్చి శ్రద్ధగా ఆలోచించుకొనుచున్నాము" - 2 కోరింథీయులకు 8:21

 

లేవైట్ అనే గల్ఫ్ ఆటగాడు చాలా శ్రేష్టమైన ఆటగాడు. ఈయన ఒకసారి గల్ఫ్ ఆటలో బాలు కొట్టడానికి సిద్ధమైనప్పుడు బాలు కదులుట ఆయన చూశాడు. ఆటలో గల నియమాలు ప్రకారము బాలు కదిలేటప్పుడు కొడితే ఆ ఆటగాడికి పెనాల్టీగా ఒక స్ట్రోక్ ని విడిచి పెట్టాలి. లేవైట్ ఆటలో పాల్గొన్న ప్రాముఖ్యమైన ఆటగాళ్లులో ఒకడు. ఆట యొక్క ప్రైజ్ మనీ 1,8,000 డాలర్లు. 

 

డేవిడ్ కోలాటం అనే వివరణ ఇచ్చే వ్యక్తి చెబుతున్నాడు గల్ఫ్ ఆటగాళ్లు ఇలాంటి పరిస్థితుల్లో తప్పించుకోవడానికి ఏమేమి చేస్తారో అని వివరించినప్పుడు ఒక తేనెటీగ తనను కరవడానికి వచ్చినట్లు ఆటగాళ్లు తలలు దించుకొని తన చేతుల్ని అటు ఇటు ఊపుతూ ఉంటారు లేదా బాలు విడిచిపెట్టి కొంత దూరం వెళ్లి కంట్లో ధూళి పడినట్లు కంటిని సరిచేసుకుంటుంటారు అదే సమయంలో ఎవరైనా బాలు కదులుట చూస్తున్నారా అని చూస్తూ ఉంటారు కూడా. ఏ ఒక్కరు గమనించకపోతే మరలా వచ్చి ఆ బాలు కొడతారు కానీ లేవైట్ అయితే అలా చేయలేదు. మారుగా తన యొక్క స్ట్రోక్ ని విడిచిపెట్టారు తర్వాత మరొక రౌండ్కి వెళ్లారు. అందరి కనులను కప్పి పనిచేయడానికి అవకాశం ఉండినప్పటికీ తన యదార్థత వలన అలా చేయలేదు. బైబిల్లో కూడా దావీదు రాజు కీర్తనలో చెపుతున్న మాటలు వినండి దోషక్రియలు నేను చేయనొల్లకుంటిని ఆయన దృష్టికి నేను యథార్థుడనైతిని (కీర్తన 18: 23) అంటున్నారు. ఈ యదార్థత అన్నది దేవుడు నన్ను చూస్తున్నారు అనే దృఢత్వం కలిగిన వాళ్లు దగ్గర ఎక్కువగా కనబడుతుంది. యదార్ధత అనే స్వభావం లేని వారు యొద్ద సత్యాన్ని ఎదురుచూచుట వ్యర్థమైన పని. 

 

ఈ దినపు లేఖన భాగంలో యోబు తన యొక్క యధార్థతను విస్తారంగా వివరిస్తున్న దాన్ని మనం చూస్తున్నాం. యోబు గురించి ప్రభువు సాక్ష్యం ఇస్తున్నప్పుడు ఆయన యదార్థవంతుడును దేవునికి లోబడుతున్న వాడు అని చెప్పబడుతుంది. దీనిని చదువుతున్న మన గురించి ప్రభువు ఎలాంటి సాక్ష్యము పలుకుతారు అనేదాన్ని మన ప్రతి ఒక్కరు ఆలోచించి చూడాలి. యదార్థత, నిజాయితీ నన్ను కాపాడనివ్వండి అని దావీదు ప్రార్థిస్తున్నాడు. ఇలాంటి ప్రార్థన మనలో ఎంతమంది చేయగలం? యదార్థతగా యదార్ధమును ప్రేమిద్దాం దాని కొరకు ప్రయాస పడదాం. దేవుడు మనలను నడిపించును గాక! 

- బ్రదర్. పి. జాకబ్ శంకర్ గారు 

 

ప్రార్థన అంశం:-

వీ. బి.యస్ పరిచర్య ద్వారా దర్శింపబడిన చిన్నారులు దేవునిలో ఎదిగేటట్లు ప్రార్థిద్దాం.

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

www.vmm.org.in

ఈమెయిల్: info@vmm.org.in

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al perabet perabet giriş safirbet safirbet giriş betasus betasus giriş virüsbet medusabahis medusabahis giriş grandpashabet grandpashabet giriş jojobet jojobet giriş vaycasino vaycasino giriş pusulabet pusulabet giriş perabet perabet giriş perabet perabet giriş matbet slot oyna perabet perabet giriş hiltonbet perabet perabet perabet betnano holiganbet galabet kalebet holiganbet