Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 02.06.2024 (Kids Special)
Share:

By Village Missionary Movement

Sunday, 02-Jun-2024

దిన ధ్యానము(Telugu) 02.06.2024 (Kids Special)

 

అంశం:- కొత్త నిర్ణయం

 

ప్రత్యేకంగా చిన్న పిల్లల కొరకు

 

"నీకు ఉపదేశము చేసెదను నీవు నడవవలసిన మార్గ మును నీకు బోధించెదను నీమీద దృష్టియుంచి నీకు ఆలోచన చెప్పెదను" - కీర్తనలు 32:8

 

హలో పిల్లలు సెలవులన్నీ ముగించుకొని స్కూలు ఓపెన్ కాబోతుంది చాలా ఇబ్బందిగా ఉందా లేక చాలా జాలిగా ఉందా? సరే జాలీగా ఉందా స్నేహితులతో కలిసి జాలిగా వాడకోవచ్చు నవ్వుకొ వచ్చు అలానే చదువు మీద కూడా శ్రద్ధ కలిగి ఉండాలి. సరేనా పిల్లలు కధ విందామా? జిమ్ అనే చిన్న తమ్ముడు ఉండేవాడు సండే స్కూల్ కి తప్పకుండా వెళ్లేవాడు. బైబిల్ చదవడంలో క్రమంగా ఉండేవాడు కానీ ఆయనకు ఒక చెడ్డ అలవాటు ఉండేది. ఇంత మంచి వాడి దగ్గర చెడ్డ అలవాట అని అడుగుతున్నారా? అవును ఎప్పుడు చూసినా సెల్ ఫోన్ లో ఫ్రీ ఫైర్ గేమ్ ఆడుతూ ఉండేవాడు ఇది అమ్మకు చాలా బాధ కలిగించింది. సెల్ఫోన్లో ఎప్పుడు ఉంటావా అని అమ్మ అడిగినప్పుడు అమ్మ కొంతసేపు సెల్ఫోన్ ఆడుకుంటున్న అని చెప్తూ ఉండేవాడు. సమయం ఎలా గడుస్తుందో తెలియకుండా ఆడుతూ ఉండేవాడు. 

 

హలో పిల్లలు జిమ్ చేస్తుంది తప్పే కదా మీరు కూడా అలానే చేస్తున్నారా అలా చేయకూడదు కదా సరే. జిమ్ కి ఏమైందో అడుగుదాం రండి జిమ్ చెల్లి అమ్మ అన్నయ్య బైబిల్ సరిగా చదవలేక పోతున్నాడు అని చెప్పగానే ఏమైంది జిమ్ కి అని అమ్మ అడిగారు. అవునమ్మా నాకు అక్షరాలు సరిగా కనబడలేదు అని అన్నాడు. వెంటనే అమ్మ చాలా బాధపడ్డారు. తర్వాత దినము కంటి ఆసుపత్రికి తీసుకుని వెళ్లారు. డాక్టర్ గారు పరీక్షించిన తర్వాత కంటిలో ఒక గడ్డ వచ్చిందని సరిగా పట్టించుకోకపోతే అది క్యాన్సర్ గా మారిపోతుందని ఎక్కువ సేపు సెల్ఫోన్ చూడటం వలన అది వచ్చిందని డాక్టర్ గారు చెప్పారు. అమ్మ చాలా దుఃఖముతో జిమ్ ముఖాన్ని చూశారు. జిమ్ మనసులో దృఢమైన నిర్ణయం తీసుకున్నాడు. ఇక సెల్ఫోన్ చూడను జీసస్ మీరే నాకు సహాయం చేయండి అని ప్రార్థన చేసి తనను తాను దేవునికి సమర్పించుకున్నాడు. ప్రియ తమ్ముడు చెల్లి ఈ కొత్త సంవత్సరంలో నీవు కూడా కొన్ని నిర్ణయాలు తీసుకోవాలి. ఈ సంవత్సరం సెల్ఫోన్తో అలానే చెడు స్నేహితులతో మీ సమయాన్ని గడపకుండా చదువు బాగా చదువుకోండి. అప్పుడు కొత్త సంవత్సరం మీకు దీవెనకరముగా ఉంటుంది. 

- సిస్టర్. జై షీలా గారు

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

www.vmm.org.in

ఈమెయిల్: info@vmm.org.in

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al holiganbet giriş holiganbet padişahbet giriş bets10 extrabet royalbet süperbetin jojobet padişahbet holiganbet betcio romabet giriş romabet queenbet bahiscasino markajbet bahiscasino atlasbet casibom matbet matbet giriş