Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 01.06.2024
Share:

By Village Missionary Movement

Saturday, 01-Jun-2024

దిన ధ్యానము(Telugu) 01.06.2024

 

అంశం:- విజ్ఞాపన చేయుట 

 

"అయ్యో నీవు వారి పాపమును ఒకవేళ పరిహరించి తివా, లేనియెడల నీవు వ్రాసిన నీ గ్రంథములో నుండి నా పేరు తుడిచివేయుమని బ్రతిమాలుకొనుచున్నాన నెను" - నిర్గమకాండము 32:32

 

తన పొలమును బాగుగా చదును చేసి విత్తనములు వేసి నీళ్లు పెట్టి చాలా చక్కగా చెట్లు పెంచారు ఆ యజమానుడు. అందుకొరకు ఒక పని వాడిని కూడా నియమించుకున్నాడు. కొన్ని దినముల తర్వాత ఆ చెట్లు ఫలముల కొరకు వేచి ఉన్నారు కానీ ఫలములు లేవు ఫలాలను వెతికిన యజమానుడు చాలా బాధపడ్డాడు. తర్వాత ఇంక వేచియుండి ఏమీ ఫలితం లేనందున కోపపడి ఆ చెట్లు నరికి వేయమని చెప్పాడు. అప్పుడు దీన మనసు కలిగిన స్వరముతో ఈ సంవత్సరం కూడా ఉండనివ్వండి దాన్ని చుట్టూ తవ్వి ఎరువు వేస్తాను అని ఆ పనివాడు చెబుతున్నాడు. 

 

యజమానుడు నరికి వేయమని చెప్తున్నప్పుడు పనివాడు విజ్ఞాపన చేసి మాట్లాడుతున్నాడు. ఈ భాగము నన్ను బాగా కదిలించి వేసింది. ఈ దినము ప్రజలు పతనం వైపు వెళుతూ ఉన్నారు. వాళ్ల కొరకు విజ్ఞాపన చేసి ప్రార్థించే వారు ఎవరు? ఈ దినము అనేకులు తమ కొరకు తమ కుటుంబం కొరకు ప్రార్థించుకుంటున్నారు. తమ జనము కొరకు దేశ ప్రజల కొరకు ప్రార్థించే వారు తగ్గిపోయారు. నెహెమ్యా తన జనము యొక్క పరిస్థితి గ్రహించి ప్రార్థించారు ఆయన ద్వారానే దేవుడు గోడలు కట్టుటకు పూనుకున్నారు. తన ప్రజల కొరకు ప్రార్థించింది ఎస్తేరు ద్వారా దేశమునకు సంరక్షణ తీసుకువచ్చారు. పేతురు చెరసాలలో ఉన్నప్పుడు సంఘం కలిసి ప్రార్థించారు. అప్పుడు పేతురు యొక్క విడుదలను వాళ్ళు చూసినట్లు దేవుడు చేశారు. మీరు విశ్వాసముతో ప్రార్థనలో వేటిని అడుగుతారో వాటిని మీరు పొందుకుంటారు. ఇది మన కొరకు ప్రార్థించడం మాత్రమే కాదు ఇతరుల కొరకు ప్రార్థించుట కొరకు చెప్పబడుతుంది. తన పనివాని కొరకు విశ్వాసముతో వచ్చిన సైన్యాధిపతి విశ్వాసాన్ని యేసుక్రీస్తు ప్రభువు మెచ్చుకున్నారు. ఆ పక్షవాయువు గల వ్యక్తిని మోసుకు వచ్చిన నలుగురు యొక్క విశ్వాసాన్ని చూసి అతనికి స్వస్థత దయచేశారు. ఇలా పాపపు బంధకాలలో ఉంటున్న వారిని ఆయన యొద్దకు తీసుకుని వస్తున్న విశ్వాసులు ఈ దినం అవసరం. ఈ దినము స్వార్థముగా ప్రార్థించే వారు ఎక్కువైపోయారు. 

 

నన్ను అడుగుము. జనములను నీకు సొత్తుగాను భూ దిగంతముల వరకు నీకు స్వాస్యముగా ఇస్తాను( కీర్తన 2:8) అని దేవుడు చెబుతున్నారు. విశ్వాసులు అంటే లోకములో ఉన్న వారందరి కొరకు ప్రార్థించే వారు. దేశంలో గల ప్రజలను నాశనం నుండి రక్షించడానికి విజ్ఞాపన చేసే వారు అవసరం. మీరు అలా ప్రార్థించుటకు ఈ దినమే మిమ్మల్ని మీరు సమర్పించుకొనుడి. అంశాలు చెప్పి ప్రార్థించడం రాదు అంటే మాకు రాయండి మేము మీకు ప్రార్థన అవసరాలు పంపిస్తాము. మీరు ప్రార్థించే మిషనరీలగా మాతో కలిసి పరిచర్యలో పాల్గొనవచ్చు. కలిసి ప్రార్థన చేద్దాం విజయాన్ని పొందుకుంటాం. 

- బ్రదర్. కే. డేవిడ్ గణేషన్ గారు 

 

ప్రార్థన అంశం:-

ఈ నెల అంతా జరగబోతున్న పరిచర్య కొరకు ప్రార్థిద్దాం.

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

www.vmm.org.in

ఈమెయిల్: info@vmm.org.in

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al perabet perabet giriş safirbet safirbet giriş betasus betasus giriş virüsbet medusabahis medusabahis giriş grandpashabet grandpashabet giriş jojobet jojobet giriş vaycasino vaycasino giriş pusulabet pusulabet giriş perabet perabet giriş perabet perabet giriş matbet slot oyna perabet perabet giriş hiltonbet perabet perabet perabet betnano holiganbet galabet kalebet holiganbet