Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 31.05.2024
Share:

By Village Missionary Movement

Friday, 31-May-2024

దిన ధ్యానము(Telugu) 31.05.2024

 

అంశం:- ఎదుటి వాళ్లతో జాగ్రత్తగా ఉండము 

 

"మోసపోకుడి. దుష్టసాంగత్యము మంచి నడవడిని చెరుపును" - 1 కొరింది 15:33

 

గొప్ప సేవకుడైన బిల్లీ గ్రహం ఆయన పరిచర్య ప్రారంభంలో ఎలాంటి కారణానికైనా ఒక పురుషుడు ఒక స్త్రీతో ఒంటరిగా మాట్లాడకూడదు అనే ఒక నిర్ణయం తీసుకున్నారు. ఎందుకంటే అనేకులు ఈ విషయంలో పడిపోయే ప్రమాదం ఉంది అన్నదే దానికి గల కారణం. కాబట్టి దీనిని ప్రాముఖ్యంగా పాటించాలి అని తమ సేవకులకు బోధించారు. ఒక దినము బిల్లీ గ్రహం కు ఎలిజిబెత్ రాణి వద్ద నుండి ఒక ఫోన్ కాల్ వచ్చింది. దాంట్లో మిమ్మల్ని కలిసి మీతో ఒంటరిగా కొంత సేపు మాట్లాడాలి అని మహారాణి చెప్పారు. నిజానికి చెప్పాలి అంటే ఆ మహారాణిని చూడడానికి ఆమెతో మాట్లాడడానికి అనేకులు వేచి ఉంటారు. ఏ ఒక్కరైనా మహారాణిని చూడాలంటే కొన్ని అర్హతలు కలిగి ఉండాలి కానీ అలాంటి స్త్రీ వద్ద నుండి ఈయనకు పిలుపు వచ్చింది. బిల్లీ గ్రహం ఏమి చెప్పబోతున్నారు అని అనేకమంది ఎదురు చూశారు కానీ ఆయన అయితే ఒక్క మాటలో నో అని చెప్పారు. 

 

క్రీస్తు నందు ప్రియమైన వారలారా ఎందుకు ఆయన నో అని చెప్పారు అని ప్రశ్న వేయవచ్చు. ఆయన వద్ద పరిశుద్ధత మరియు సెల్ఫ్ కంట్రోల్ లేదా అని అడగవచ్చు కానీ ఆయన అయితే తీసుకు నిర్ణయంలో దృఢముగా ఉన్నారు. కారణము ఎక్కడ ఎప్పుడు ఎవరో పడిపోతారు అన్నది ఎవరికీ తెలియదు. పరిచర్యకంటే సేవకుడు ప్రాముఖ్యమైన వాడు అని మర్చిపోకూడదు. బైబిల్లో చూచేటప్పుడు బలములో గొప్పవాడైన సంసోనును, ఆత్మీయ జీవితంలో బలమైన వాడైనా దావీదు మరియు జ్ఞానంలో గొప్పవాడైన సొలోమోను వంటి వారు దేవుని చేత ఏర్పరచుకొనబడిన పాత్రలు కూడా ఈ విషయంలో పడిపోయారు. యాకోబు కుమార్తె అయినా దీనా షికారుకు వెళ్లి పాపములో పడి తనను హీనపరుచుకుంది. సాధారణంగా స్త్రీలు మరియు పురుషులు ఎవరైనా ఎదుటివానితో ఉన్న సంభాషణ జ్ఞానముగా ఉండాలి. అవసరం లేని మాటలు మన శీలానికి కీడును తెచ్చిపెడుతుంది. సాధారణమైన మాటలతో ప్రారంభమై అవి శరీరేచ్చల వరకు పడిపోయే అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్తగా ఉండవలసింది చాలా అవసరం. కావున మన క్రైస్తవ జీవితంలో ఎలాంటి నిష్కలంకముగా ఉండి క్రీస్తుకి అపకీర్తి రాకుండా జాగ్రత్తగా జీవిద్దాం. దేవునికి భయపడుతున్న భయము దేవునితో గల బంధము సరిగా ఉంటే లోకములో ఉన్న దురాశల నుండి మనము తప్పించబడతాం. 

- బ్రదర్. ఇసక్కి 

 

ప్రార్థన అంశం:-

మన ఫీల్డ్ లో ఒక గంట పని చేసే మిషనరీలు మరియు సేవకులు దొరికేటట్లు ప్రార్థిద్దాం

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

www.vmm.org.in

ఈమెయిల్: info@vmm.org.in

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al perabet perabet giriş safirbet safirbet giriş betasus betasus giriş virüsbet medusabahis medusabahis giriş grandpashabet grandpashabet giriş jojobet jojobet giriş vaycasino vaycasino giriş pusulabet pusulabet giriş perabet perabet giriş perabet perabet giriş matbet slot oyna perabet perabet giriş hiltonbet perabet perabet perabet betnano holiganbet galabet kalebet holiganbet