Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 27.05.2024
Share:

By Village Missionary Movement

Monday, 27-May-2024

 

దిన ధ్యానము(Telugu) 27.05.2024

 

అంశం:- జవాబు చెప్పుటలో జాగ్రత్తగా ఉండుము

 

"బంగారు కర్ణభూషణమెట్టిదో అపరంజి ఆభరణ మెట్టిదో వినువాని చెవికి జ్ఞానముగల ఉపదేశకుడు అట్టివాడు" - సామెతలు 25:12

 

ఒక ఆఫీసులో రాము 25 సంవత్సరాలగా పని చేస్తూ ఉన్నాడు. అందువలన ఆయన పైన ఉన్న అధికారి ఎప్పుడు రాముతో కలిసి ఉండేవారు. ఉన్నతాధికారికి రాముని ఎలాగైనా ఉన్నత పదవిలో కూర్చోబెట్టాలి అని ఆశ ఉండేది. ఒక దినము ఉన్నతాధికారి రాముతో రేపు ఉదయమున 4 గంటలకు ఆఫీసుకు రమ్మని పిలిచారు. సరే అని చెప్పిన రాము ఇంటికి వెళ్లి పడుకున్నాడు. ఉదయం నాలుగు గంటలకు రాము లేవలేకపోయాడు యధావిధిగా ఆఫీసుకు వెళ్ళాడు. ఆయన యొక్క ఉన్నతాధికారి ఎందుకు నాలుగు గంటలు రాలేదు అని అడిగాడు. అందుకు రాము ఎంత మాత్రం ఆలోచించకుండా మర్చిపోయి పడుకుండిపోయాను అని చెప్పాడు. ఈ జవాబు ఆ ఉన్నతాధికారికి కోపాన్ని తెచ్చి పెట్టింది. ఇందువలన ఆయనకు ఇవ్వవలసిన ఉన్నత ప్రమోషన్ను ఆయనకు ఇవ్వలేదు. 

 

నా ప్రియమైన వారలారా! ఒక జవాబు ఒకరి యొక్క జీవితాన్ని మార్చివేసింది. మనము మన జీవితంలో చెప్పే ప్రతి జవాబు కూడా ఆలోచించి సమయానుసారముగా జ్ఞానవంతముగా మాట్లాడాలి. బైబిల్లో కూడా నెహెమ్యా 2:4-5 వచనాల్లో నెహెమ్యా రాజు అడిగిన ప్రశ్నకు ప్రార్థన చేసి జవాబు చెప్పడు చూస్తున్నాం. అందువల్ల రాజు దృష్టిలో నెహెమ్యా కు కనికరము దొరకడం చూస్తున్నాం. నాబాలు తన యొక్క తొందరపాటు జవాబు వలన తన జీవితాన్నే కోల్పోయాడు. యోసేపు కూడా నేను కాదు దేవుడే జవాబిస్తారు అని జ్ఞానముగా మాట్లాడుతున్నారు. యేసుక్రీస్తు ప్రభువు పైన నేరం మోపాలని రెండు గుంపులు ఆయనను ఎప్పుడు వెంబడిస్తూ ఉండేవి. వారి యొక్క కుయుక్తి అయిన ప్రశ్నలకు ఆయన చాలా జ్ఞానముతో అదే సమయంలో నిదానంగా జవాబు ఇచ్చేవారు. 

 

అలానే మన జవాబు కూడా జ్ఞానముతో, దీనత్వం కలదిగా ఉండాలి. మన యొక్క జవాబు దేవుడిచ్చే మాటలుగా ఉండాలి. సామెతలు 15:1లో మృదువైన మాట కోపమును చల్లార్చును అని చెప్పబడింది. మన యొక్క జవాబు ఇతరులను గాయపరిచినంతగా వాళ్లను అశ్రద్ధ చేసినట్లుగా ఉండకూడదు. మరణము జీవము మన నాలుగ వసము అని బైబిల్ చెబుతుంది. అంటే అర్థం ఏమిటి? ఒక సమస్యలో నీవు జ్ఞానముగా మాట్లాడితే అది నీ ప్రాణాన్ని తప్పిస్తుంది. అదే నాకు ఆశీర్వాదం లేనియెడల దెబ్బలు కాసి శ్రమలు పాలు అవుతాను. పొందుకోవాల్సిన మేలు కూడా చేయి జారిపోతుంది. కాబట్టి ఎప్పుడూ దేవుని పైన అనుకుని ఆలోచించి జవాబిద్దాం. ఆమెన్! 

- శ్రీమతి. దివ్య అలెక్స్ గారు 

 

ప్రార్థన అంశం:

మన క్యాంపస్ లో జరుగుతున్న హాస్పిటల్ పరిచర్యలో అనేకులు దర్శించబడుతున్నారు వారి యొక్క రక్షణ కొరకు ప్రార్థిద్దాం.

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

www.vmm.org.in

ఈమెయిల్: info@vmm.org.in

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al perabet perabet giriş safirbet safirbet giriş betasus betasus giriş virüsbet medusabahis medusabahis giriş grandpashabet grandpashabet giriş jojobet jojobet giriş vaycasino vaycasino giriş pusulabet pusulabet giriş perabet perabet giriş perabet perabet giriş matbet slot oyna perabet perabet giriş hiltonbet perabet perabet perabet betnano holiganbet galabet kalebet holiganbet