Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 24.05.2024
Share:

By Village Missionary Movement

Friday, 24-May-2024

దిన ధ్యానము(Telugu) 24.05.2024

 

అంశం:- వరుడు యొక్క ప్రేమ 

 

"దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. కాగా ఆయన తన అద్వితీయకుమారునిగా( లేక, జనిలైక కుమరుడుగా) పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్యజీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను" - యోహాను 3:16

 

ఒక ఊర్లో రాణి అనే యవ్వనస్తురాలు తన తల్లిదండ్రులతో జీవిస్తూ ఉండేది. రాణి ఒక యవ్వనుడిని ప్రేమించింది. ఇద్దరు కూడా ఒకరికొకరు ప్రేమను పంచుకున్నారు కానీ ఇద్దరు కుటుంబీకులు కూడా కఠినంగా వారిని వ్యతిరేకించారు. రాణి కైతే తనకు వివాహం చేయబోతున్న ఆ వ్యక్తి ఎంతగా తన కొరకు త్యాగం చేయగలడు అని ఆలోచించి రాణి అతడిని పిలిపించి మీరు నన్ను నిజముగా ప్రేమించిన యెడల ఒకటి చేయాలి రేపు ఉదయం మనము ఊరు అవతల ఉన్న కొండ చివరి భాగమునకు వెళ్లి ఇద్దరం ఒకేసారి క్రిందకు దూకుదాము అని అన్నది. ఆయన సరే నేను నిన్ను ప్రేమిస్తున్నాను నన్ను నమ్ము అని ఎంత చెప్పినా చివరికి ఆమె అతని మాట అంగీకరించలేదు. చివరికి మరుసటి రోజు ఉదయం రాని చెప్పిన సమయానికి అక్కడికి వెళ్లింది కానీ అక్కడ ఆ వ్యక్తి రాలేదు ఆయన యొక్క మొబైల్ నెంబర్ కూడా స్విచ్ ఆఫ్ గా ఉంది. రాణి నిజమును గ్రహించి ఈయన ఒక మోసగాడు నన్ను మోసగించినవాడు అని చాలా దుఃఖముతో ఏడుస్తూ ఉన్నది. 

 

ఆ మార్గము గుండా ఒక మనిషి వచ్చాడు రాణి ఎందుకు ఏడుస్తున్నావ్ కుమార్తె అని అడిగాడు అందుకు జరిగిన అన్నింటిని అతనితో చెప్పి ఏడ్చింది. అందుకు అతడు ఏడవకు నాకు ఒకరు తెలుసు ఆయన నీకు నెమ్మదిని ఇవ్వగలరు అని చెప్పినప్పుడు ఎవరు అని అడిగింది రాణి. నువ్వు కోరుకున్న వ్యక్తి నన్ను విడిచిపెట్టి వెళ్ళవచ్చు కానీ ఈ పరమందు ఉన్న వరుడు నిన్ను ఎప్పటికీ విడువడు చేర్చుకుంటాడు ఆయన నీ కొరకు మరణము అనే ఊబిలో ఉండి నిన్ను విడిపించారు ఆయనే ఏసుప్రభు ఆయన ప్రేమ మారినది. వెంటనే తన కొరకు త్యాగం చేసిన వారు ఎవరు అని గ్రహించుకున్నది రాణి. ఖాళీగా ఉన్న ఆమె హృదయంలో యేసయ్య ప్రేమతో నింపుకున్నది. 

 

ఈ దినము ప్రజల యొక్క ప్రేమ మారగలదు మనము కొందరినీ ఎక్కువగా ప్రేమించి నమ్మి చివరికి వారి యొక్క ప్రేమ నిరుత్సాహ పరిచినప్పుడు ఏడుస్తూ వినిపిస్తూ ఉన్నాం. ఏకాంతముగా విడబడుతున్నాం. యేసుక్రీస్తు ప్రభువు యొక్క ప్రేమ తప్ప మిగిలిన ప్రేమలన్నీ కూడా ఒక పరిధిలోనే ఉంటూ ఉంటాయి. దీనిని చదువుతున్న స్నేహితులారా నా పేదరికంలో, నా అనారోగ్యంలో, నా కష్టాలలో, నా నిందలలో, నా అవమానాలలో ఎవరు నాకు సహాయం చేయడానికి లేరే నాకు తోడుగా ఎవరూ లేరే అని కలత చెందుతున్నారా? అందరి మధ్యలో అన్నింటి మధ్యలో మిమ్మల్ని పైకి లేపి రక్షించడానికి తన చేతులను చాపుతూ ఎదురుచూస్తున్న దేవుడు మీకు ఉన్నారు. కలవరపడకుడి ఆయన ప్రేమను రుచిచూచి జీవితపు చివరి వరకు నిరుత్సాహ పడకుండా ధైర్యంతో ఆయనతో జీవిద్దాం. 

- సిస్టర్. విద్యా నిత్యానంద్ గారు 

 

ప్రార్థన అంశం:-

మన ఉత్తర భారతదేశ మిషనరీల కొరకు ప్రార్థిద్దాం.

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

www.vmm.org.in

ఈమెయిల్: info@vmm.org.in

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al holiganbet giriş holiganbet casibom bets10 extrabet royalbet süperbetin casibom giriş betcio royalbet betpas giriş milanobet bahiscasino betpas bahiscasino atlasbet romabet giriş holiganbet giriş bahiscasino ngsbahis betplay holiganbet jojobet casibom romabet betpas