Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 23.05.2024
Share:

By Village Missionary Movement

Thursday, 23-May-2024

దిన ధ్యానము(Telugu) 23.05.2024

 

అంశం:- ప్రయాసమునకు ఫలము కలదు

 

"యెహోవా నీవు చేసినదానికి ప్రతిఫలమిచ్చును; ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా రెక్కలక్రింద సురక్షితముగా నుండునట్లు నీవు వచ్చితివి; ఆయన నీకు సంపూర్ణమైన బహుమాన మిచ్చునని ఆమెకుత్తర మిచ్చెను" - రూతు 2:12

 

రధములో ఒక రాజు అడవి గుండా ప్రయాణం చేస్తూ వెళుతున్నాడు. ఆ మార్గంలో రెండు గుర్రాలు చూసాడు. రెండు దినముల తరువాత రాజు యొక్క పని వారు ఆ గుర్రములను కోటకు తీసుకుని వెళ్లి తర్ఫీదు ఇచ్చారు. ఆ తర్ఫీదు కఠినంగా ఉన్నందున ఆ గుర్రాలు సహించలేక తప్పిపోయి మరల అడవిలోనికి వెళ్ళిపోయాయి. ఎప్పుడు లేనంతగా అడవిలో నీళ్లు లేకుండా ఎండిపోయాయి. వర్షం లేనందున గడ్డి అంతా కూడా ఎండిపోయింది. ఆహారం దొరకగా ఆ గుర్రములు శరీరం బక్క చిక్కిపోయాయి. ఆ భవనములో కొంచెం కష్టపడి తర్ఫీదు తీసుకుని ఉండి ఉంటే మంచి ఆహారం దొరికిండేది అని ఆలోచించి బాధపడ్డాయి. 

 

బైబిల్లో కూడా క్రీస్తు కొరకు తమను శ్రమ కొరకు ఒప్పుకున్న వారి యొక్క ముగింపు దీవెనకరముగాను ఆశ్చర్యకరంగా ఉన్నదాన్ని మనం చూడగలం. షడ్రక్, మేషక్, అబేద్నగో అనేవాళ్ళు తెలివి, జ్ఞానము, మంచి శరీర బలము గలవారుగా ఉండేవారు. వారు తమ దేవునికి మాత్రం నమస్కరించి ఆయన ఒక్కరికే ఆరాధన చేస్తాము అని నిర్ణయించుకున్నారు. అందుకొరకు అగ్నిగుండంనకు వెళ్లడానికి ఇష్టపడ్డారు. దేవుడు తప్పించడానికి సమర్ధుడు తప్పించుకుపోయినా పరవాలేదు అని తెగించి నిలబడ్డారు దాని ఫలితము ఆ రాజ్యం అంతా కూడా రాజు మొదలుకొని ప్రజలందరూ కూడా దేవుణ్ణి తెలుసుకున్నారు. ఈ అగ్నిగుండం వంటి శోధన చూసినప్పుడు వెనకబడి ఉంటే ఆ రాజ్యము దేవున్ని ఎరిగి ఉండేది కాదు. ఉపద్రవమును మరియు శోధనను చూచి వెనక్కి వెళ్ళిపోకుండా దేవుని కొరకు దృఢంగా నిలబడుతున్న వారు ఈ దినము యేసుప్రభునకు అవసరమై ఉన్నారు. ఈ లోకంలో ఉపద్రవం కలవు అయినప్పటికీ ధైర్యం తెచ్చుకొనుడి నేను లోకమును జయించాను అని ప్రభువు చెప్తున్నారు. లోకాన్ని జయించి క్రీస్తు యేసు యొక్క ఫలితాన్ని మన పిల్లలు పొందుకొనుటకు ఆయన సిద్ధం చేసి ఉన్నారు. కాబట్టి మనము ఈ లోక శోధనలు జయించి ధైర్యంతో ముందుకు వెళ్దాం. 

 

దీనిని చదువుతున్న దేవుని పిల్లలారా ఈ లోకపు జీవితంలో క్రీస్తు కొరకు అన్నింటిని సహించడానికి శ్రమ పడుటకు సిద్ధంగా ఉన్నవాళ్లు నక్షత్రం వలె ప్రకాశిస్తారు. అనేకమంది క్రైస్తవులు క్రీస్తు కొరకు ఉపద్రవంలో దృఢముగా నిలబడి ఉండటం వలన సువార్త మనకు ప్రకటించబడింది. అవును ప్రయాసమునకు తగిన ఫలితం ఇహపరమందు మనకు దొరుకుతుంది. కాబట్టి క్రీస్తు కొరకు సమస్తాన్ని సహించి ఆయన రాజ్యంలో ప్రయాస పడదాం, ఫలాన్ని పొందుకుందాం. 

- సిస్టర్. ఎస్తేర్ సెల్వి గారు 

 

ప్రార్థన అంశం:-

మోక్ష ప్రయాణం అనే మాస పత్రికను చదువుతున్న ప్రతి ఒక్కరును ఆత్మీయ జీవితంలో ఎదిగేటట్లు ప్రార్థిద్దాం

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

www.vmm.org.in

ఈమెయిల్: info@vmm.org.in

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al