Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 22.05.2024
Share:

By Village Missionary Movement

Wednesday, 22-May-2024

దిన ధ్యానము(Telugu) 22.05.2024

 

అంశం:- జాగ్రత్తగా ఉండు

 

"మరియు ప్రభువునందు నీకు అప్పగింపబడిన పరిచర్యను నెరవేర్చుటకు దానిగూర్చి జాగ్రత్తపడుమని అర్ఖిప్పుతో చెప్పుడి" - కొలస్సీయులకు 4:17

 

దేవుడు ప్రతి ఒక్కరికి పరిచర్య సిద్ధం చేసి ఉన్నాడు. ఈ ధ్యానం చదువుతున్న వారిలో కొందరికి ఏ పరిచర్య చేయాలో అని ప్రశ్నార్ధకంగా ఉండవచ్చు అయితే దేవుని వద్ద అడుగుడి ఆయన మీకు మార్గాన్ని చూపిస్తారు. పరిశుద్ధులు, దేవుని వాక్యాలు, సేవకుల ద్వారా దేవుడు మీతో మాట్లాడుతారు. ఏదైనా ఒక పరిచర్య మీ కొరకు సిద్ధపరచబడి ఉంటుంది. ప్రార్థన పరిచర్య అనేది అన్ని చోట్లలో చేస్తూ ఉండవచ్చు. ఈ ధ్యానంలో ప్రతిరోజు ఇవ్వబడుతున్న ప్రార్థనా అంశములకు తప్పకుండా ప్రార్థించవచ్చు. దేవుడు మీకు ఇచ్చిన పరిచర్యను త్యాగపూరితముగా యధార్ధముగా నెరవేర్చుటకు జాగ్రత్తగా ఉండాలి. 

 

ధమస్కు మార్గంలో తనను దర్శించిన యేసయ్య కొరకు నేను ఏమి చేయాలి అని సౌలు అడిగినప్పుడు అన్యులకును, ఇశ్రాయేలీయులకును, రాజులకు సువార్త ప్రకటించుటకు సువార్త పరిచర్య చేయడానికి దేవుడు ఏర్పరుచుకున్నారు పౌలును. కొర్నేలి ఇంటిలో దేవుడిచ్చిన పరిచర్య నెరవేర్చుటకు పేతురు సిద్ధంగా ఉండటం వలన అన్యుల మధ్యలో గొప్ప ఉజ్జీవం ఏర్పడింది. ఫిలిప్పు పొందుకున్న పరిచర్య నెరవేర్చుటకు జాగ్రత్తగా ఉండటం వలన ఐతోఫియా నపుంసకుడు రక్షింపబడ్డాడు. అపోస్తులు తమ పరిచర్య జాగ్రత్తగా చేసినందువలన విస్తారమైన ఆత్మలను రక్షింపబడుటకు, సంఘము అనుదిన అభివృద్ధి పొందింది. 

 

పాత నిబంధనలో ఓబద్య ద్వారా ఆహాబురాజు దర్శింపబడుట వలన అవకాశం పొందుకున్న ఏలియా కర్మెలు పర్వతం పైన ఉజ్జీవం రావడానికి అవకాశం వాడుకున్నాడు. దేవుడిచ్చిన పరిచర్యను శ్రద్ధగా నెరవేర్చే వారిని దేవుడు వ్యర్ధంగా విడిచి పెట్టే దేవుడు కాడు. ఏలియాను పరామర్శించుటకు ఆజ్ఞ పొందుకున్న సారేపతి వెధవరాలు తాను దేవుని మాట నెరవేర్చినప్పుడు కరువు కాలమంతా కూడా దేవుడు ఆమెను ఆమె కుమారుడిని ఆదరించారు. ఆమె కుమారుడు మరణించినప్పుడు ప్రాణంతో లేపి ఆమెను సంతోషింపజేశారు. 

 

ప్రియమైన వారలారా! దేవుడిచ్చిన పరిచర్యను నెరవేర్చుటకు జాగ్రత్తగా ఉండుడి. ఉజ్జీవముతో దేవుడు మిమ్మల్ని బలంగా వాడుకుంటారు. మీ యొక్క అవసరాలు దర్శిస్తారు. సంపూర్ణ లేదా పార్ట్ టైం పరిచర్య ఏదైనా గాని అందరికీ సమానంగా కూలి ఇవ్వగలిగిన దేవుడు మన దేవుడు. మరి పరిచర్య చేయుటకు సిద్ధంగా ఉన్నారా? 

- శ్రీమతి. గీతా రీఛార్జ్ గారు 

 

ప్రార్థన అంశం:-

మన పరిచర్యలో రిపేర్ లో ఉన్న ఫోర్ వీలర్స్ వాహనాలు బాగు చేయబడేటట్లు ప్రార్థిద్దాం.

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

www.vmm.org.in

ఈమెయిల్: info@vmm.org.in

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al holiganbet giriş holiganbet casibom bets10 extrabet royalbet süperbetin casibom giriş casibom jojobet giriş casibom milanobet piabellacasino betpas bahiscasino atlasbet betpas casinoroyal bahiscasino ngsbahis betplay holiganbet jojobet casibom holiganbet jojobet casibom vaycasino romabet