Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 21.05.2024
Share:

By Village Missionary Movement

Tuesday, 21-May-2024

దిన ధ్యానము(Telugu) 21.05.2024

 

అంశం:- కొదువులను తీర్చే దేవుడు 

 

"కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తుయేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును" - ఫిలిప్పీయులకు 4:19 

 

ఇంగ్లాండ్ దేశంలో ఉన్న జార్జ్ ముల్లర్ ఒక విశ్వాస యోధుడు. వేలకొలది చిన్నారులను తన హాస్టల్లో పెట్టుకొని పరామర్శిస్తూ ఉండేవారు. ఒక దినము ఆహారం కొరకు సమయం వచ్చినప్పుడు ఆహారం ఏమీ లేదు, ఏదైనా కొనాలి అంటే చేతులో డబ్బులు లేవు. అందరి ప్లేట్లు గ్లాసులు ఖాళీగా ఉన్నాయి. అందరినీ కూర్చుండ బెట్టి తమ తలను మంచి మా తండ్రి మీరు ఇవ్వబోతున్న ఆహారం కొరకు వందనాలు అని చెప్పి ప్రార్థన చేశారు ఆమెన్ అని చెప్పి ముగించేలోగా తలుపు తట్టిన శబ్దము వినబడింది. అక్కడ రొట్టెలు చేసే వ్యక్తి నిలబడ్డాడు. ఆయన తనకు రాత్రంతా నిద్ర లేదు మీకు ఆహారం అవసరమని నాకు గుర్తుకు వచ్చింది కాబట్టి ఉదయాన్నే రెండు గంటలకు లేచి మీకు రొట్టెలు తయారు చేశాను ఇదిగో తీసుకోండి అని చెప్పి ఆయనకు ఇచ్చారు. ఇది అయిపోయిన వెంటనే మరల తలుపు తట్టిన శబ్దం వినబడింది తెరిచి చూస్తే పాలు ఇచ్చే వ్యక్తి ఆయన బండి వీళ్ళ హాస్టల్ ముందు రిపేర్ అయిపోయింది. దాన్ని బాగు చేయాలంటే దాంట్లో ఉన్న పాలు అన్నింటిని బయటకు తీయాలి కాబట్టి ఈ పాలను మీరు తీసేసుకుంటారా అని అడిగాడు. ఇలా జార్జ్ ముల్లర్ యొక్క ఆ దినపు అవసరతలు తీర్చబడ్డాయి.

 

యోహాను సువార్తలో కానా అనే ఊరిలో ఒక వివాహం జరిగింది. యేసుప్రభువు మరియు శిష్యులు వివాహానికి పిలవబడ్డారు. ఆ వివాహం జరుగుతున్న ఇంట్లో ద్రాక్ష రసం కొదువుగా ఉన్నది. యేసయ్య ఆ రాతిబావలో నీళ్ళు నింపమని నీళ్లను నింపి దాన్ని ద్రాక్షరసంగా మార్చారు. ముందు రుచిగల ద్రాక్ష రసాన్ని ఇచ్చి జనాలు తృప్తి పొంది మత్తెక్కిన తర్వాత రుచి లేని ద్రాక్ష రసాన్ని ఇస్తారు కానీ మీరైతే ఈ ఆఖరి వరకు మంచి ద్రాక్ష రక్షణ పెట్టుకున్నారు అని మాట్లాడారు. 

 

ప్రియమైన వారలారా! ఈ దినం మీ జీవితంలో ఆర్థిక అవసరతలతో ఇబ్బంది పడుతున్నారా? పిల్లలు యొక్క భవిష్యత్తు గురించి బాధపడుతున్నారా? వివాహము చేయడానికి డబ్బులు సమస్యగా ఉన్నదా? వీటిలో ఏదైనా ఉండవచ్చు కానీ అన్నింటికి ఒకే పరిష్కారము యేసయ్య సన్నిధి. ఆయన సన్నిధిలో కూర్చుని ఉంటే మీ కొదువులన్నీ ఆయనతో చెప్పేటప్పుడు ఆ కొదువులన్నీ కూడా సంపూర్ణపరచడానికి ఆయన సమర్థుడు. మీ ఆవసతులు తీర్చబడతాయి కాబట్టి మీ కొదువులను తీర్చగలిగిన దేవుడు మీతో ఉండేటప్పుడు మీ కొదువులను తలంచి వ్యర్థముగా ఎందుకు ఆలోచిస్తున్నారు? ఆయనతో చెప్పి సహాయాన్ని పొందుకోండి. 

- శ్రీమతి. గ్లాడిస్ మురళి గారు 

 

ప్రార్థన అంశం:-

చిన్నపిల్లల క్యాంపులో దర్శింపబడుతున్న చిన్నపిల్లలకు యేసయ్య బహుమానం అనే బహుమానం ఇచ్చేటట్లు ప్రార్థిద్దాం.

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

www.vmm.org.in

ఈమెయిల్: info@vmm.org.in

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al holiganbet giriş holiganbet casibom bets10 extrabet royalbet süperbetin casibom giriş casibom jojobet giriş casibom milanobet piabellacasino betpas bahiscasino atlasbet betpas casinoroyal bahiscasino ngsbahis betplay holiganbet jojobet casibom holiganbet jojobet casibom vaycasino romabet