By Village Missionary Movement
Sunday, 19-May-2024దిన ధ్యానము(Telugu) 19.05.2024 (Kids Special)
అంశం:- బిను పిచ్చుక మరియు స్నేహితులు
ప్రత్యేకముగా చిన్న పిల్లల కొరకు:-
"యెహోవా మీద పాడుడి, ఆయన నామమును స్తుతించుడి అనుదినము ఆయన రక్షణసువార్తను ప్రకటించుడి" - కీర్తనలు 96:2
హాలో పిల్లలు మీకు పక్షులు అంటే చాలా ఇష్టం కాదు? మీ ఇంట్లో కూడా లవ్ బర్డ్స్ పెంచుతూ ఉంటారు అవునా? మీరు ఎప్పుడైనా పక్షులు పెంచే స్థలమునకు వెళ్లారా? అక్కడ రంగు రంగుల అందమైన పక్షులు ఉంటాయి చూశారా? ఈ సమ్మర్ సెలవుల్లో కూడా మీ అమ్మానాన్నతో కలిసి పక్షుల్ని సంరక్షించే ప్రాంతమునకు వెళ్లి పక్షులను చూసి రండి వెళ్తారా.
ఇలాగే ఒక దట్టమైన అడవిలో ఒక పెద్ద చెట్టు పైన బిను అనే పిచ్చుక మరియు దాని స్నేహితులు గూళ్ళు కట్టుకొని నివసిస్తూ ఉన్నాయి. రోజు ఉదయాన్నే లేచి విడివిడిగా ఆహారం కొరకు వెళ్లి సాయంకాలం వచ్చి తాను తెచ్చుకున్న ఆహారమును తన పిల్లలకు పెడుతూ సంతోషంగా జీవిస్తూ ఉండేది. ఆ పిచ్చుకలు ఇలా ఆహారం కొరకు వెళ్లిన బిను మాత్రం ఒక స్థలములో ఎక్కువ ఆహారం దొరికే ప్రాంతమునకు వెళ్లి రోజు ఆ ఆహారమును తీసుకుని వచ్చి ఎక్కువ ఆహారాన్ని తన గూటిలో సమకూర్చుకుంది. మిగిలిన పిచ్చుకలకు కూర్చుకొనదగినంత ఆహారం దొరకలేదు.
కొన్ని దినాలు అయింది వర్షము ప్రారంభమైంది. ఈ బిను పిచ్చుక మాత్రమే తాను సమకూర్చుకున్న ధాన్యమును తిని సుఖముగా ఉంది కానీ మిగిలిన పిచ్చుకలు అయితే ఎక్కువగా పడుతున్న వర్షం వలన ఆహారము వెతుకుటకు వెళ్ళలేకపోయాయి. ఆకలితో అలమటించగా రోజులు గడుస్తా ఉన్నాయి. వర్షం ఆగేటట్లు లేదు. అందువలన పక్షులు ఇంకను ఆకలితో అలమటిస్తూ ఉన్నాయి. కొన్ని పిచ్చుక పిల్లలు మరణించాయి కూడా. వీటన్నిటినీ చూస్తూ ఉన్నా బినుపిచ్చుక తన మనసులో నేను పొరపాటు చేశాను నేను ఆహారం కొరకు వెళ్ళిన స్థలములో ఎక్కువ ధాన్యం ఉండేది అప్పుడే నా స్నేహితులకు చెప్పి ఉంటే వాళ్లు కూడా వెళ్లి సమకూర్చుకొని ఉండేవారే ఇలా అన్యాయంగా ఈ పిచ్చుక పిల్లలు చనిపోయి ఉండేవి కాదేమో దీనికి బాధ్యురాలు నేనే అని ఏడుస్తూ ఆకలితో అల్లాడుతున్న మిగిలిన పక్షులకు తన ధాన్యాన్ని పంచిపెట్టింది. చివరికి తనతో ఉన్న ఆహారం కూడా అయిపోయింది. వర్షం ఇంకా ఆగలేదు అప్పుడు బినుపిచ్చుక ఆకలితో అలమటించింది. నేను ఆరోజే నా స్నేహితులకు చెప్పి ఉంటే ఈరోజు మేమందరం సంతోషంగా ఉండి ఉంటామే అని తలంచి చాలా దుఃఖపడింది.
ప్రియమైన తమ్ముడు, చెల్లి! మీరు కూడా ఇలానే యేసు యొద్ద నుంచి పొందుకున్న మేలులను, రక్షణను ఇతరులకు చెప్పడం మర్చిపోకూడదు. మీతో చదువుతున్న మీ వీధిలో ఉన్న అందరూ ఎవరు మేలు చేస్తారు అని ఎదురు చూస్తూ ఉంటారు. నువ్వే వారికి యేసయ్య సహాయము చేస్తారు అని చెప్పాలి. ఒకవేళ వారు రక్షింప బడకుండా నరకానికి వెళ్లినా కార్యము నీ మీదకే వస్తుంది. కాబట్టి నువ్వు ఎరిగిన యేసయ్యను ఇతరులకు ప్రకటించాలి. చేస్తావా మరి?
- శ్రీమతి. సారాల్ సుభాష్ గారు.
*Whatsapp*
ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.
www.vmm.org.in
ఈమెయిల్: info@vmm.org.in
Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin
విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001
ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250