By Village Missionary Movement
Friday, 17-May-2024దిన ధ్యానము(Telugu) 17.05.2024
అంశం:- పెద్దల కొరకైనా కథ
"ఎవడైనను వీటిలో చేరక తన్నుతాను పవిత్ర పరచుకొనినయెడల వాడు పరిశుద్ధపరచబడి, యజమానుడు వాడుకొనుటకు అర్హమై ప్రతి సత్కార్యమునకు సిద్ధపరచబడి, ఘనత నిమిత్తమైన పాత్రయైయుండును" - 2 తిమోతికి 2:21
ఒక మనిషి తన ఇంట్లో మూడు వస్తువులు పెట్టుకుని ఉన్నాడు. 1.గొడ్డలి, 2.కత్తి 3. బ్లేడు. ఒక దినము ఉదయమున ఆ మనిషి చెట్టు నరుకుటకు సిద్ధపడ్డాడు. అప్పుడు ఈ మూడు వస్తువులు ఒకదానితో ఒకటి మాట్లాడుకున్నాయి. గొడ్డలి చెప్పింది ఇప్పుడు యజమానుడు నన్నే తీసుకుని వెళ్తాడు అని అలానే కత్తి బ్లేడు కూడా లేదు లేదు నన్నే తీసుకుని వెళ్తాడు అని చెప్పుకున్నాయి. ఆ మనిషి గొడ్డలి ఎత్తుకొని వెళ్ళాడు. చెట్టును నరికి ఇంటికి వచ్చి చేరుకున్నాడు. గొడ్డలి తన గురించి గర్వముగా తలంచి మిగిలిన రెండింటిని చిన్న చూపుతో చూసింది. కొంత సమయం తర్వాత ఆ మనిషి ఫలములు తినుటకు వాటిని తీసి కడగడం ప్రారంభించాడు। అప్పుడు ఆ మూడు వస్తువులు నన్నే వాడుకుంటారు అని మరలా పోటీపడ్డాయి కానీ ఆయన కత్తి తీసుకుని ఆ ఫలములను కోసి తినడం ప్రారంభించాడు. కొంత సమయం తర్వాత ఆయన షేవింగ్ చేసుకొనుటకు సిద్ధపడ్డాడు అప్పుడు మరల మూడు వస్తువులు పోటీపడ్డాయి. అయితే ఆయన బ్లేడు తీసుకుని తన గడ్డం గీసుకున్నాడు. కొద్దిగా ఆలోచించండి గొడ్డలితో ఫలములను కోయగలమా? కత్తితో గడ్డం గీసుకోగలమా? బ్లేడుతో చెట్లు నరకగలమా? అనగా మూడు వస్తువుల పనులలో ఎలాంటి లోపం లేదు వాడుకునే యజమానుడి వద్ద ఎలాంటి లోపం లేదు కానీ మూడు వస్తువులు తమ యొక్క పనులను ఇతరులతో పోల్చుకోవడం తప్పిదమైనది.
అపోస్తులుడైన పౌలు తిమోతికి రాసినప్పుడు ఇలాంటి కార్యాన్ని రాస్తున్నాడు. ఒక ఇంట్లో బంగారము, వెండి పాత్రలు మాత్రమే ఉండవు మట్టితోనూ, చెక్కతోనో చేయబడిన పాత్రలు కూడా కలవు. ఒక్కొక్క దానిని దాని యొక్క ప్రయోజనం కొరకు వాడబడుతుంది. వాటిలో ఒకటి మరి ఒకదానితో పోల్చుకుని చూస్తే ప్రయోజనము ఉండదు.
దీన్ని చదువుతున్న స్నేహితులారా మిమ్మల్ని ఇతరులతో పోల్చుకుని చూడకండి. అనేక సమయాల్లో మనలను ఇతరులతో పోల్చుకొని మన మేలును కోల్పోతున్నాం. ఇక్కడే మన పొరపడుతున్నాం. దేవుడు ప్రతి ఒక్కరికి ఒక విశేష తలాంతులను ఇచ్చి ఉన్నాడు. కాబట్టి పనిచేయండి కానీ పోల్చుకుని చూడకండి. మీరు మేలు చేయుటకు సిద్ధంగా ఉండాలి తప్ప ఇతరులతో పోల్చుకుని నిరుత్సాహపడిపోకండి. మీకు మీరే దేవునికి సమర్పించుకుంటే ఆయన మిమ్మల్ని వాడుకొనుటకు సిద్ధంగా ఉన్నారు.
- బ్రదర్. టీ. శంకర్ రాజు గారు
ప్రార్థన అంశం:-
గృహ కూడికలో తమ గృహములను ప్రార్థన కొరకు ఇస్తున్న కుటుంబాలను దేవుడు దీవించేటట్లు ప్రార్థిద్దాం.
*Whatsapp*
ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.
www.vmm.org.in
ఈమెయిల్: info@vmm.org.in
Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin
విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001
ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250